గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, ఆగస్టు 2022, మంగళవారం

ఆంధ్ర భాషా ప్రౌఢిమ. .....రచన శ్రీ పుల్లూరు మాతయ్య:

జైశ్రీరామ్.

శ్రీ పుల్లూరు మాతయ్య: 

మత్తేభవిక్రీడిత, కంద గర్భ సీసము.

సీ.  విభవభావాన్వితవిభ్రమంబు,పటు కా

వ్యాలంకృతంబౌ ప్రభావ భాష,

ప్రభవ సూక్తుల్ సుధ,వార్ధియై,తనుపు,నిం

పారన్,జిగీషా సభన్ ,జయించు,

సుకవి సంకల్పిత శోభితా రసధునుల్,

కావ్యాత్మ లోఁబాఱఁగాను పించు,

ప్రసవ సౌగంధ్యసువర్ణనా కలిత భా

షాయోష,వాక్సార సాగరంబు,

తే.గీ.  లలిత గుణ,వృత్తి,రీతుల నెలవు తెలుఁగు,

వాకొన,రమణీయ,మధురవాక్కులనిధి,

నవరస భరితామల పాక భవమనియన

గ,మనతెలుఁగమరెన్ బలుకనుమృదువుఁగ,


సీస గర్భిత మత్తేభము:-

భవభావాన్విత విభ్రమంబు,పటుకావ్యాలంకృతంబౌ ప్రభా

భవ సూక్తుల్ సుధవార్ధియై,తనుపు నింపారన్ జిగీషా సభన్,

కవిసంకల్పిత శోభితారసధునుల్,కావ్యాత్మలోఁబాఱఁగా,

సవసౌగంధ్య సువర్ణనా కలిత భాషాయోష,వాక్సారసా!


సీస గర్భిత కందము*

లలిత గుణ, వృత్తి ,రీతుల

నెలవు తెలుఁగు,వాకొన రమ ణీయ,మధుర వా                                                 

క్కులనిధి,నవరసభరితా

మల పాకభవమనియనఁగ మన తెలుఁగమరెన్;

                       

1,అలంకారములు=శబ్దార్థాద్యలంకారములు

2,రసధునులు=నవరసములు

3పాకము=(పదవ్యుత్పత్తి)ద్రాక్ష,నారికేళాదులు

4,గుణములు=శబ్దములకుప్రాణప్రదమైనవి,శ్లేష,మాధుర్యాదిగుణములు,

5,వృత్తులు=నాయకునికావ్యరసానుకూల చేష్టలు,,కైశికి,ఆరభటిమున్నగునవి.

6రీతులు=కావ్యరసాశ్రయ శబ్దరచన,వైదర్భి,గౌడీత్యాదులు.

7వర్ణనలు=అష్టాదశవర్ణనలు

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.