గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2022, సోమవారం

స్వతంత్రభారతదేశ అమృతో త్సవశుభాకాంక్షలు

 జైశ్రీమన్నారాయణ.🙏

శ్రీమన్మంగళ సర్వతంత్రస్వతంత్ర భారతాంబ స్వాతంత్ర్య అమృతోత్సవం దేశమంతా ఉప్పొంగుచూ జరుపుకొనుచున్న సందర్భంగా ఉప్పొంగుచున్న మీకూ నా శుభాకాంక్షలు. 

స్వాతంత్ర్యవైభవభారతము.

సీ౹౹ శ్రీ మన్మహాభాగ్య చిద్భారతావనీ 

             ప్రాభవంబెన్న నా వశము కాదు,

  ధీమంతులైనట్టి తేజోవిరాజితుల్   

            వేదాంతవేద్యులున్ వెలసిరిచట,

  బంగారుపంటలన్ భవ్యంబుగా ప్రజన్    

                       వర్ధిల్ల జేసెడి భాగ్య సీమ,

  యాధ్యాత్మికప్రభ లసమానరీతిలో  

              పండించుసుజ్జనులుండిరిచట

తే.గీ.ఇట్టి మహనీయభూమిపై పుట్టుటనిన 

     పూర్వ జన్మంపు పుణ్యమే పూజ్యులార!

     తల్లి భారతి సేవలో తనియుడయ్య!  

     అందమైనట్టి భారతీ! వందనమ్ము.🙏                 

సద్విధేయుడు

చింతారామకృష్ణారావు.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.