గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఆగస్టు 2022, బుధవారం

యచ్చాపి సర్వభూతానాం ...10 - 39...//..నాన్తోస్తి మమ దివ్యానాం , , .10 - 40,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరామ్.

|| 10-39 ||

శ్లో.  యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున|

న తదస్తి వినా యత్స్యాన్మయా భూతం చరాచరమ్.

తే.గీ. ప్రాణులకు ములమేనేను, పార్థ! వినుమ,

ధర చరాచరములలోన తలచి చూడ

నేను లేనన్నదే లేదు, నిజము కనగ,డ

నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.

భావము.

అర్జునా! అన్ని ప్రాణుల యొక్క మూలకారణం నేను. చరాచర 

ప్రపంచంలో నేను లేనిదంటూ ఏదీ లేదు.

 || 10-40 ||

శ్లో.  నాన్తోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరన్తప|

ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా.

తే.గీ.  నా విభూతికి తుది లేదు, నీవెరుంగ

క్లుప్తముగ జెప్పినాడను గొప్పదయిన

దాని విస్తారమును నీకు పూనికగొని

నీవు గ్రహియింపుమర్జునా! నేర్పుమీర.

భావము.

అర్జునా! నా దివ్యమైన విభూతులకు అంతులేదు. నా విభూతుల 

విస్తారాన్ని క్లుప్తంగానే చెప్పాను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.