గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, ఆగస్టు 2022, శనివారం

దంష్ట్రాకరాలాని చ తే ముఖాని- ...11 - 25...//.. అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః , , .11 - 26,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

 జైశ్రీరామ్.

|| 11-25 ||

శ్లో.  దంష్ట్రాకరాలాని చ తే ముఖాని

దృష్ట్వైవ కాలానలసన్నిభాని|

దిశో న జానే న లభే చ శర్మ

ప్రసీద దేవేశ జగన్నివాస.

తే.గీ. నీ కరాళ దంష్ట్రల్ మోము నాకు భయము

గొల్పు, తోచవు దిక్కులు, కొరత కలిగె

శాంతి కో దేవదేవరా! శాంతి దాల్చి

నీవు సుప్రసన్నుడవయి కావు నన్ను.

భావము.

ఓ జగన్నివాసా! కరాళదంష్ట్రలతో 

(భయంకరమైన కోరలతో) ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని

జ్వాలలవలె భీతిగొల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు

తోచకున్నది. నెమ్మది (శాంతి) శూన్యమైనది. ఓ దేవేశా! ప్రసన్నుడవు కమ్ము.

|| 11-26 ||

శ్లో.  అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః

సర్వే సహైవావనిపాలసఙ్ఘైః|

భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ

సహాస్మదీయైరపి యోధముఖ్యైః.

తే.గీ.  ధార్తరాష్ట్రులున్, భీష్ముడున్, ధరనృపాలు

రట్లె కర్ణుడున్,ద్రోణుడు, నట్లెమనప

రిజనులున్ నిన్ బ్రవేశించిరి, కనితిపుడె,

నాకు మతిపోవుచుండెను నయనిధాన.

భావము.

ఇదిగో! (ఇచ్చట చేరియున్న) ఈ ధృతరాష్ట్రపుత్రులు 

(దుర్యోధనాదులు) ఇతర రాజన్యులతోసహా నీలో ప్రవేశించుచున్నారు. 

భీష్మపితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి 

ప్రధానయోధులు అందఱును.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.