గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, ఆగస్టు 2022, బుధవారం

మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్

శా. ఓం గం శ్రీగణనాయకాప్రణతులీకో దేవ సంపూజ్యుఁడా!
ఓం గం శ్రీ వర భక్త సేవిత పదా! ఓంకారశబ్దోజ్వలా!
ఓం గం శ్రీ హిమరాజనందిని సుతా! ఓంతత్త్వసుజ్ఞానదా!
ఓం గం శ్రీ కవిపూజితా! శుభము లీ వొప్పార కల్పింపుమా.

నేడు సర్వమంగళ సుస్వరూపుఁడగు గణనాథుని చతుర్థి. ఈ సందర్భముగా మీకు ఆ గణనాథుని కృప అపారంగా లభించాలని కోరుకొంటూ మీకు నా శుభాకాంక్షలు తెలియఁ జేయుచున్నాను.

జై శ్రీమన్నారాయణ.

జైహింద్.

Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

🌺🙏🌺

అజ్ఞాత చెప్పారు...

మనోహరమైన పద్యముతో శుభాకాంక్షలు అందించారు. ధన్యవాదాలు🙏🌹
మీకునూ, మీ కుటుంబ సభ్యులకునూ...
వినాయక చవితి శుభాకాంక్షలు🌺🌹

వెలుదండ సత్యనారాయణ రావు చెప్పారు...

పద్యకవితార్చనతో శుభాకాంక్షలు సముచితం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.