గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2022, ఆదివారం

ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం ...11 - 3...//..మన్యసే యది తచ్ఛక్యం , , .11 - 4,,,//... ఏకాదశోధ్యాయః - విశ్వరూపదర్శనయోగః.

 జైశ్రీరామ్.

 || 11-3 ||

శ్లో.  ఏవమేతద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర|

ద్రష్టుమిచ్ఛామి తే రూపమైశ్వరం పురుషోత్తమ.

తే.గీ.  ప్రీతి దెల్పిన నీదగు విశ్వరూప 

మహిమ సత్యంబు, పొడగనన్ మనసుకలిగె

నీ యపారమౌ జ్ఞానము, నీయనంత

తేజ మమరు శక్త్యైశ్వర్య పూజనీయ

రూపమునుగాంచగాను గోరుదును తెలియ.

భావము.

ఓ పరమేశ్వరా! నీ మహాద్భుత విశ్వరూప మహిమను గూర్చి 

నీవు చెప్పినదంతయు పరమ సత్యమే. ఓ పురుషోత్తమా! అపార

 ఙ్ఞాన శక్తి తేజములతో కూడిన మహా ఘనమైన నీ అనంత 

ఐశ్వర్య రూపమును ప్రత్యక్షముగ దర్శింప గోరుచున్నాను.

| 11-4 ||

శ్లో.  మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో|

యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్.

తే.గీ.  నీదు ఘనవిశ్వరూపమున్ నేను జూడ

తగినదని నీవు తలచిన తప్పకుండ

గొప్పదైన యా రూపంబు గొప్పగాను

చూపుమిప్పుడే నాకు శుభద కృష్ణ! 

భావము.

హే యోగేశ్వర ప్రభో! నీ ఘన విశ్వరూపం నాచేత చూడశక్య

మైనదని నీవు తలంచుచో అట్టి నాశరహితమైన నీ దివ్య రూపమును 

నాకు చూపుము.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.