గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, ఆగస్టు 2022, సోమవారం

బృహత్సామ తథా సామ్నాం ...10 - 35...//..ద్యూతం ఛలయతామస్మి, .10 - 36,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జై శ్రీరామ్

|| 10-35 ||

శ్లో.  బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛన్దసామహమ్|

మాసానాం మార్గశీర్షోహమృతూనాం కుసుమాకరః.

తే.గీ. సామములలోన నే బృహత్సామమరయ,

ఛందములలోన గాయత్రి,  జయుడ! నేనె

మార్గశీర్షంబు నేనేను మాసములను,

ఋతువులందు వసంతంబు పృథ్వి నేనె.

భావము.

అలాగే నేను సామాలలో బృహత్సామాన్ని, చందస్సులలో గాయత్రిని, 

మాసాలలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువుని.

 || 10-36 ||

శ్లో.  ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినామహమ్|

జయోస్మి వ్యవసాయోస్మి సత్త్వం సత్త్వవతామహమ్.

తే.గీ.  మోసములలోన కన ద్యూతమునగుదునయ,

తేజమునవెల్గువారిలో తేజమేనె

నేనె జయమున్, బ్రయత్నంబు నేనె యరయ,

సాత్వికులలోన గలయట్టి సత్వమేనె.

భావము.

నేను మోసములలో జూదాన్ని, తేజోవంతులలో తేజాన్ని, 

జయాన్ని ప్రయత్నాన్ని, సాత్వికులలో సత్వాన్ని.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.