గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఆగస్టు 2022, సోమవారం

మహర్షీణాం భృగురహం ...10 - 25...//..అశ్వత్థః సర్వవృక్షాణాం .10 - 26,,,//...శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు...విభూతియోగః‌

 జైశ్రీరమ్.

|| 10-25 |

శ్లో.  మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్|

యజ్ఞానాం జపయజ్ఞోऽస్మి స్థావరాణాం హిమాలయః|

తే.గీ.  ఋషులలో నేనె భృగువును, యసమచరిత!

శబ్దములలోన నోంకార శబ్దమేనె,

యజ్ఞ ములలోన గన జప యజ్ఞ మేనె,

స్థావరంబులన్ హిమపర్వతంబు నేనె.

భావము.

మహర్షులలో భ్రుగువుని, శబ్దాలలో ఏకాకషరమైన ఓంకారాన్ని. 

యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని.

 || 10-26 ||

శ్లో.  అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః|

గన్ధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః.

తే.గీ.  వృక్షములయందు రావి నేన్, వేల్పు ఋషుల

నారదుడు నేనె, గంధర్వ వారియందు

చిత్ర రదుడను నేనే, ప్రసిద్ధులయిన

మహిత మునులందు కపిలుడన్ మాననీయ!

భావము.

నేను వృక్షాలలో రావి చెట్టుని. దేవర్షులలో నారదుణ్ణి. గంధర్వులలో 

చిత్రరధుణ్ణి, సిద్ధులలో కపిల మునిని.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.