గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, అక్టోబర్ 2017, మంగళవారం

కవయిత్రి పావులూరి సుప్రభ కృత నాగోల్లేఖిత శ్రీకారబంధ కందాందము

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ కృత  నాగోల్లేఖిత శ్రీకారబంధ కందాందమును తిలకించండి.
నాగోల్లేఖిత శ్రీకారబంధ కందము 

కం.
శ్రీమతి! మతిమతి! భారతి! 
మామక హృత్పద్మసంస్థ మహిమోపేతా!
కామితవరదా! సుఖదా!
వామా!యందింతు జోత, ప్రముదిత మనమున్‌.
సుప్రభ 
10-26-2017.
కవయిత్రి సుప్రభవంటి వారి కృషి 
తెలుఁగు తేజాన్ని 
ద్విగుణీకృతం చేయకమానదు.
వారికి నా అభినందనలు.
జైహింద్.

30, అక్టోబర్ 2017, సోమవారం

విశ్వముఖ మత్స్యత్రయ బంధము. చంపకమాల. .. .. .. శ్రీహరి వీయస్సెన్ మూర్తి

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత మత్స్యత్రయ బంధ చంపకమాలను చూడండి
.మత్స్యత్రయ బంధము. చంపకమాల
పురహర నీదు నామముల పోడిమి పోడిమిగోరి దల్చినన్ 
స్మరహర నీకథావిమలసంపద సంపద లంద జూచినన్ 
వరగుణ నీ చరిత్రమను బంధము బంధము వీడ గాంచినన్ 
ధరపయి నెందునన్ శుభవితానమునన్ జయమందు నెన్నినన్.
హరి వీయస్సెన్ మూర్తీ!
నిరుపమమగు కృషిని చేసి నేర్పుగ మీరల్
వరలఁగ మత్స్యత్రయమున
మురిపించిరి చంపకమును పొగడఁగ సుకవుల్.
బంధ కవి వీయస్సెన్ మూర్తిగారికి 
అభినందనలు.

జైహింద్.

29, అక్టోబర్ 2017, ఆదివారం

విశ్వముఖమత్స్యత్రయబంధ చంపకమాల. .. .. .. సుప్రభ

3 comments


జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభగారు మత్స్యత్రయబంధ రచన ఎంత సులభంగా చేసారో చూడండి.

శుభకరి శారదాంబ యిటు చూడుము! చూడుము మించు కూర్మినే !
ప్రభ యెద మెచ్చ కాదనక పల్కుము ! పల్కుము పద్యమాలనే !
అభినవ మొల్లనే యనఁగ నల్లెద! నల్లెద నీదుగాథనే !
విభవము నెన్న నేనికను బ్రేమమునే యిల మెచ్చు భంగి నే !

మొదటి మూడు పాదములలో నొక్కొక్కటి యొక మత్స్యములో పొందుపరచబడినది. నాలుగవది చుట్టునున్న వలయములో నిక్షిప్తమైనది.
కవయిత్రి
పావులూరి సుప్రభ.
కవయిత్రికి నా అభినందనలు. ఇంకా అద్భుతమైన చిత్ర బంధ గర్భ కవితానురక్తితో కవితలు వెలయించాలని మనసారా కోరుకొనుచున్నాను.
జైహింద్.

28, అక్టోబర్ 2017, శనివారం

కృష్ణుడికి 16008 భార్యలు ఎందుకు​? .. .. .. బ్రహ్మశ్రీ అందుకూరి చినపున్నయ్యశాస్త్రిగారి వివరణము.

1 comments

జైశ్రీరామ్.
ఆయులారా!
Sree ACPSastry
కృష్ణుడికి 16008 భార్యలు ఎందుకు​? Sree ACPSastry గారి వ్యాసము.
చదివితే మనకవగాహన కలుగక మానదు.
ఇక చదువఁగలరు.
 రామాయణ  ,భారత ,భాగవతాలలోచూస్తే భూమి మీదికి భగవంతుడు వచ్చినప్పుడల్లా సూర్యుడు భూమి మీదికి వచ్చినట్లు మనం భావించాలేమో..రామయణ భారతాలు విశ్లేషించి చూస్తే ఇదే అర్ధం అవుతుంది. ఒక రకంగా ఇది scientists చెప్పే Solar origin theory of earth ని
​​ supp​o​​​rt చేస్తుందేమో.
సూర్యుడి శక్తి రోజూ తగ్గి పోతూ ఉంటుంది.constant burning వలన. Consequent గా సూర్యుని కి దూరంగా ఉన్న దక్షిణ ధృవం మీద సూర్యుని శక్తి బలహీనమయి ఆ

​ధ్రు​వం ఉత్తరం వైపు జరగుతూ ఉంటుంది​. ​
.​​ఇదే​ గీత లో కృష్ణుడు చెప్పిన .. ​ ధర్మానికి గ్లాని కలగటం అంటే .​​లేకపోతె భగవంతుడు ఒకసారి ధర్మం స్థాపించి సృ ష్టి చేసిన తరువాత ధర్మానికి గ్లాని ఎందుకు .​​దక్షిణ ​ధ్రు ​​వంలో ఉండే రాక్షసులు బలం పెరిగి ఉత్తర ​ధ్రువ వాసులయిన దేవతల మీదికి అంటే  ఉత్తర ​ధ్రు ​వాన్ని జయించటానికి దండెత్తుతారు.ఆయుధ్దానికి దేవతలకు సహాయం చేయటానికి సూర్యుడు భూమి మీదికి వస్తాడు. అది కూడా ఉత్తర ​ధ్రు ​వం సూర్యుని కి దగ్గరగా ఉండటం వలన..ఇదే పాండవులు కృష్ణుని యుద్ధం లో సాయం అడగటం అంటే..కానీ దక్షిణ ధృవం సూర్యుని కి శత్రువుకాదు కదా ..అందుకని కృష్ణుడు తనకిద్దరూ సమానమే నని యుద్ధం చేయనంటాడు.యుద్ధంలో తనకు దగ్గర గా ఉంటే చాలంటాడు అర్జునుడు.సరే రథం మాత్రం తొలుతానంటాడుకృష్ణుడు. ​సూర్యుడు ప్రతినిత్యం movement లో ఉంటాడు ​. అదే రథం తోలటం అంటే,. Is not the metaphor clear
మిగతా విషయాలు .
ఉత్తరధ్రు ​వం లో దేవతలు ఉంటారు. అన్ని దేవజాతులు ఉత్తర మే. ఇక అన్ని రాక్షస జాతులు దక్షిణం లో ఉంటారు. అవేమిటంటే ...రాక్షసులు, పిశాచాలు,పాములు, పితృదేవతలు.యముడు

​. Originate కావటం దక్షిణ ధ్రు వమైనా ,  భూమి మీద ఉండే మన మీద ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి South pole magnetic lines కి పాము రూపం ఇచ్చారు మన ఋషులు . పాము భూమి లో నుంచి పుట్ట ద్వారా బయటకు వసుంది కదా . ​
..అందుకే. అన్నమాట. దక్షిణ​ధ్రు ​వ శక్తి అయిన తక్షకుడు ఉత్తర కొడుకయిన పరీ

​క్షిత్తునుకాటు వేస్తాడు.భారతం.మొదలు కావటం సర్పయాగం తో మొదలవుతుంది. ఇది ratio​n​alisation of south pole .కారణం తక్షకుడు పరీక్షిత్తు ని కాటువేయటం ఉత్తర ధృవానికంటే దక్షిణ ధృవం బలపడటం అన్నమాట.

 రాముడు సూర్యుడు అని వాల్మీకి ఎప్పుడూ చెబుతున్నాడు. దానికి చాలాఉదాహరణలు చెప్పచ్చు..విశ్వామిత్రుడు బల అతిబల ఇవ్వడం,రాముడు పునర్వసు నక్షత్రం లో పుట్టాడు.సూర్యుని పునర్వసు నక్షత్రం లో గాయత్రీ మంత్రం తో పునరాధా నం చేయాలనీ వేదం చెబుతున్నది. గాయత్రీ మంత్రస్థానం లో విశ్వామిత్రుడిని రప్పించాడు వాల్మీకి  .

​రాముడు ​తన గుర్తుగా ఉంగరం పంపించటం. ​ సూర్యుడికి వేదంలో హిరణ్యపాణి  అని పేరుంది అంటే చేతిలో బంగారం కలిగిన వాడు అని చేతిలో బంగారం అంటే ఉంగరమే .. అందుకే తాను సూర్యుడినని చెప్పటానికి రాముడు ఉంగరం పంపించాడు. ఇంకా  చాల గుర్తులున్నాయి రామాయణం లో ​.....
బారతం లో అగ్ని స్వరూపుడైన అర్జునుడి​కి సారథ్యం చేయటం మొదలయిన విషయాలు ..

​ఇంద్రుడు నాలుగవ ఆగ్నియని వేదం చెబుతున్నది . ఆయన కొడుకు అర్జునుడు . అర్జునుడు కూడా అగ్నియే  . అందుకే శివుడు పాశుపతం ఇచ్చాడు . అగ్నికి సారథ్యం చేయటానికి సూర్యుడికంటే  తగిన వాళ్ళు ఎవరు. ​

ఇక భాగవతం లో కృష్ణుడు ..16008 భార్యలు విషయం ...
: కృష్ణుడు సూర్యుడు అని ఒప్పుకుంటే ...కృష్ణుని పుటుక నుంచి విశ్లేషించితే..కృష్ణుడు అర్థరాత్రి పుట్టాడు.Actual గా సూర్యుని effect అంటే sunrise effect ..అర్థ రాత్రి నుంచే మొదలవుతుంది.అందుకనే  శివరాత్రి అభిషేకం అర్థ రాత్రి నుంచే మొదలవుతుంది.

​శివుడు సూర్యుడేనని రుద్రాభిషేకం లో మంత్రం లో ఉంది. 12 గంటలకు సూ ర్యోదయం​ effect ఉంటుందని మన వాళ్ళు ఊహించటం వలన వారు earth యొక్క global షేప్ ఊహించినట్టు కనపడుతుంది. మనం వై-axis పైన ఉంటె

ఎక్కడో X -axis కుడి extreme లో సూర్యోదయం అవుతూ ఉంటుంది .global shape కనుక దాని ఎఫెక్ట్ vertex మీద ఉంటుంది . అంటే సూర్యోదయం ---- , మనం ఉన్నచోటు....  right angle triangle hypotenuse  అటు పాయింట్ .. ఇటు పాయింట్ గా ఉంటామన్నమాట

ఇక" గో"అంటే సూర్యకిరణాలు అని అర్ధం ఉంది.సూర్యుడు పుట్టగానే. ఎక్కడికి వెళతాడు? సూర్యకిరణాలు ఎక్కడ ఉంటే అక్కడి కి వెళతాడు ..సూర్యకిరణాలు అంటే గోవులు ఎక్కడ ఉన్నయ్..రేపల్లె లో నందుని దగ్గరకు వెళతాడు ..ఇక అర్థ రాత్రి సూర్యోదయం తెలియని కంసుడు శతృవు లేడనుకుంటాడు​కారణం.దక్షిణ ధృవం ఎక్కడో భూమి కింద పల్లం లో ఉంటుంది .అందుకని సూర్యోదయం కనపడదు. కంసుడికి రాక్షస సహాయం ఉన్నట్టు ఆయన పూతనను, శక టాసురుడిని , పంపించటం లో అర్థమవుతుంది .  . గోకులంలో గోసంపద పెరుగుతూఉంటుంది అంటే సూర్యుని కాంతి పెరుగుతూ ఉంటుంది.ఇక గోపికలు.​..... ​చిన్నతనంనుంచి గోపికలు కృష్ణుని తోఏదో సంబంధం కలిగిఉన్నారు.గోపికల పని ఏమిటి.?
 గోవుల ని పితకటం ..అంటే సూర్యకిరణాల నుండి నీటిని పితకటం .పితికేదెవరు..చంద్రకిరణాలు.
గోపికలు అంటే చంద్రకిరణాలు.కానీ ​.... ​సూర్యకిరణాల రూపమే చంద్రకిరణాలు.​.... ​అందుకే గోపికలు కృష్ణుని వెంట పడటం ఎవరూ ఆపలేకపోయినారు.
ఇక చంద్రకిరణాల సంఖ్య ఎంత?  చంద్రుడి కి 16 కళలు.దానినే ఒక్కొక్క రోజున ఒక్కొక్క కళ ..కానీ చంద్రకిరణాలు అనేకం. వాటిని సహస్రం అన్నారు. ఎక్కువ అని చెప్పటానికి సహస్రం అనే మాట వాడటం సాంప్రదాయం ..ఈగోపికలను నరకాసురుడు బంధించాడు. నరకాసురుడు భూదేవి కొడుకు ..అంటే ఛాయ అన్నమాట..అంటే భూమి నీడపడి ...చంద్రకాంతి మరుగున పడింది.ఆగోపికలు సూర్యకిరణాల రూపం కాబట్టి ..కృష్ణుడు కలగజేసికొని వారిని విడిపించాడు
 ఈవిధంగా 16008 లో 16000 కి లెక్క తేలింది. వీళ్లందరితో రాసక్రీడ సలిపాడు కృష్ణుడు. సూర్య కిరణాలు నీటిని గ్రహిస్తయి .సూర్యడికిరణాల వేడికి సముద్రాలే ఇంకుతయ్యి..ఆఇంకిన నీటిని గ్రహించి చంద్రకిరణాలు చల్లపడతయ్యి.చల్లదనమే రసం ..ఆకిరణాలతో చేసేదే రాసక్రీడ.అందుకే రాస క్రీడ ఎప్పుడూ రాత్రిపూట వెన్నెల లో జరుగుతుంది.​సూర్యకిరణాల చల్లని రూపమే చంద్ర కిరణాలు .సూర్యుడు  సూర్యకిరణాలు  లేకపోతేచంద్ర కిరణాలు లేవు. అందుకే చంద్రుడిని ధరించి కాపాడతాడు శివుడు ​
 ఇక 8 ..ఇది అష్టవసువులు   సూర్యుని విష్ణువు గాచెబుతుంది వేదం..అందుకే కృష్ణుడు 8 వ గర్భం. కృష్ణుని వసురూపంగా చెప్పాడు వ్యాసుడు.అందుకే వాసుదేవుడు అన్నారు ఆయనను..8 సంఖ్య విష్ణువుకి ఇష్టం.అందుకే అష్టమి రోజున పుట్టాడు కృష్ణుడు. గాయత్రి కి అధిష్ఠాన దేవత విష్ణువు.గాయత్రి రూపమైన గ​రు ​క్మంతుడు ఆయన వాహనం. నరకాసురుడి తో యుధ్దానికి కృష్ణుడు గరుక్మంతుడు మీద నే వెళతాడు.అందుకని అష్టభార్యలు..
ఇంకా ఎంతయినా చెప్పవచ్చు..
కృష్ణుడంటే సూర్యుడే. ఇదే వ్యాసహృదయం.మిగతా వ్యాఖ్యానాలు ప్రయత్నించి చెప్పినవే ...Central Pillar idea strong గా ఉండదు.

: అష్ట వసువుల కు గుర్తు అయిన శమంతకమణిని సత్రాజిత్తు ​​సముద్రం ఎదురుగా తపస్సుచేసి సంపాదించాడని కథలో ఉంది
భీష్ముడు అష్టవసువులలో ఒకడు.అష్టవసువులకి సముద్రం స్థానం. అందుకే వసువులు గంగను ప్రార్థించారు.గంగ సముద్రానికే వెళుతుంది కదా
కృష్ణుడు సముద్రంలో ద్వారకలో ఉండటానికి ఇదే కార ణం​. ​ సముద్రంలో అష్టభార్యలతో కృష్ణుడు ఉంటాడు.అంటే అష్టవసువులతో నన్న మాట
​​ఇదీ 16008 మంది భార్యలంటే.
​భవదీయుడు
ACPశాస్త్రి.
పూజ్యులైన అందుకూరి శాస్త్రిగారికి ధన్యవాదములు.
జైహింద్.

27, అక్టోబర్ 2017, శుక్రవారం

కవయిత్రి పావులూరి సుప్రభ కృత ద్వివిధ కందద్వయ తేటగీతి గర్భ చంపకమాల

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ గారు గర్భకవితానురక్తులై విరచించిన ద్వివిధ కందద్వయ తేటగీతి గర్భ చంపకమాల ఎంత చక్కగా వ్రాసిరో గమనించండి.
కందద్వయ, - తేటగీతి - గర్భ  చంపక మాల .
వర గుణదాయినీ జనని పావన రూపిణి శారదాంబ వా
సర రమణీమణీ కృపను సత్యమెరుంగగ నీయ శక్తి య
క్షర ఘనతన్‌ వి/గనన్‌ ముదముగా నిను బాడెడి పుత్రినౌదు, నీ
దరి రమణన్‌, సదా సుముఖతన్‌ గమకంబును జూపనౌను గా.
చంపకమాలలో గర్భితమైన....
కం. (1)
గుణదాయినీ జనని పా
వన రూపిణి శారదాంబ వాసరరమణీ
ఘనతన్‌ వి/గనన్‌ ముదముగా
నిను బాడెడి పుత్రినౌదు నీ దరి రమణన్‌
కం. (2)
రమణీమణీ! కృపను స
త్యమెరుంగఁగ నీయ శక్తి, యక్షర ఘనతన్‌
రమణన్‌, సదా సుముఖతన్‌
గమకంబును జూపనౌనుగా వర గుణదా!
తే.గీ
జనని పావన రూపిణి శారదాంబ
కృపను సత్యమెరుంగఁగ నీయ శక్తి
ముదముగా నిను బాడెడి పుత్రినౌదు,
సుముఖతన్‌ గమకంబును జూపనౌను.

చింతా రామకృష్ణారావు గారి "ద్వివిధ కందద్వయ, తేటగీతి గర్భ చంపకమాల" స్ఫూర్తితో యత్నించినది. వారికి హార్దిక ధన్యవాదములు,
సుప్రభ .
అందంబుగ ద్వివిధంబగు
కంద ద్వయ గీతములను కల చంపకమున్,
సుందరభామృతముగ
నందించిన కవయిత్రికి హారతులిడుడీ!
జైహింద్.


26, అక్టోబర్ 2017, గురువారం

పద్మ దీప బంధ సీస మాలిక. .. .. .. శ్రీమాన్ హరి వీయస్సెన్ మూర్తి.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీమాన్ హరి వీయస్సెన్ మూర్తిగారు. 
పద్మ దీప బంధ సీసమాలికను ఎంత ముదావహంగా రచించారో చూడండి.
"దీప పద్మ గర్భ సీసమాలిక"
(శ్రీయుతులు 'పూసపాటి కృష్ణ సూర్య కుమార్' గారు దీపావళినాడు 'శంకరాభరణం' బ్లాగులో ప్రచురించిన రచన వలన కలిగిన స్ఫూర్తితో చేసిన అభ్యాసము. వారికి ధన్యవాదములు)
సీసము
శంకరా! త్రిపురారి! సర్వేశ్వరుండవు నీవే కదా ప్రభూ! నిన్ను సకల
లోకంబు లన్తటన్ శ్రీకంఠుడను సత్యనామంబు ఘనదీప్తి నడచుచుండు
సర్వార్థ సుఖదాత! సాంత్వనోద్ధారకా! కోసలేశప్రియా! గొల్తు నిన్ను
చంద్రశేఖర! సత్వ సద్యోగమానస! సర్వకాలస్థితా! సద్గుణాఢ్య!
నీసంతతిం గావ నిత్య మీవాసనల్ దూరకు స్ఫూర్తిద! ధూర్తహంత!
హే వ్యాసపూజితా! హే భవా! వాంఛితసంపత్ప్రదా! సర్వసన్నుతాంగ!
తా నెవ్వ డున్నాడు త్రాత సత్యము నీవె వేదనాసంహార! విశ్వవాస!
ముక్తిదాతా! శివా! మునిసాధుజనవాస! నిర్వాణదాయకా! నీలకంఠ!
హే హరా! సర్వదా యాహరిన్నీవెగా ప్రేమించినావు సత్ప్రీతితోడ
హర్షసాన్నిధ్యాన నధివాసమై వెల్గి నీదు సాయుజ్యమున్ నేను జేరు
సద్భావభాగ్యంబు సంగూఢశక్తులన్ నతిసమర్పింతును నాకు దాన
సాధింప జూపి సత్సౌమనస్యం బిచ్చి దాసుడన్ గావవా దాసబంధు!
నిత్యంబు నిను జేరి నిష్ఠతో ధ్యాసను జోడించెదను సుంత సుగుణ మిమ్ము
సన్మానదాయకా! సాధనానందదా! దేవ! సత్పరిపాల! దివ్యమూర్తి!
హే భక్తపాల! సద్వైభవాన్విత! రుద్ర! ప్రణతులం జేసెద పరమపురుష!
తే.గీ.
శంభు! వేదాన్తసందీప్త! సాంబ! నిన్ను
సన్నుతించెద నావాంఛ నెన్ని నాకు
ముక్తి నీయవె సంసారయుక్తి గూల్చి
దాసదాసానుదాసుండ ధర్మమూర్తి!
హ.వేం.స.నా. మూర్తి. 
మూర్తిగారికి హృదయపూర్వక అభినందనలు.
 జైహింద్.

25, అక్టోబర్ 2017, బుధవారం

శ్రీ హరి.వేం.స.నా.మూర్తి. గారు రచించిన కందద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము.

3 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ హరి.వేం.స.నా.మూర్తి. గారు రచించిన 
కందద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము.
తిలకించండి.
కందద్వయ రుగ్మవతీ కమలవిలసితగర్భ క్రౌంచపద వృత్తము.
(ఆధారము - అప్పకవీయము)

క్రౌంచపదవృత్తము
గణములు - భ మ స భ న న న య
యతి - 1,11,19
భావజనాశా! భాగ్యవిభావా! భవహర! పురహర! వరగుణ దాతా!
తావకనిష్ఠా ధారుల తావున్ స్తవముల గొలువగ దగునని రావా
సేవలు చేయన్ క్షేమము చేవల్ శివములు నరుసము చిరముగ నీవా
దేవ! హరా! సద్దీప్తిని దేవా దివిజుల భువిజుల స్థిరతను దేవా.

దీనిలో గర్భితమైన మొదటి కందము.
భావజనాశా! భాగ్యవి
భావా! భవహర! పురహర! వరగుణదాతా!
తావక నిష్ఠాధారుల
తావున్ స్తవముల గొలువగ దగునని రావా.

దీనిలో గర్భితమైన రెండవ కందము.
సేవలు చేయన్ క్షేమము
చేవల్ శివములు నరుసము చిరముగ నీవా
దేవ! హరా! సద్దీప్తిని
దేవా! దివిజుల భువిజుల స్థిరతను దేవా.

దీనిలో గర్భితమైన రుగ్మవతీ వృత్తము.
గణములు - భ మ స గ
యతి - 1,6
భావజనాశా! భాగ్యవిభావా!
తావకనిష్ఠాధారుల తావున్
సేవలు చేయన్ క్షేమము చేవల్
దేవ! హరా! సద్దీప్తిని దేవా.

దీనిలో గర్భితమైన కమలవిలసిత మను వృత్తము.
గణములు - న న న న గగ
యతి - 1,9
భవహర! పురహర! వరగుణదాతా!
స్తవముల గొలువగ తగునని రావా
శివములు నరుసము చిరముగ నీవా
దివిజుల భువిజుల స్థిరతను దేవా.

రచన.  ..  ..  ..  హ.వేం.స.నా.మూర్తి.
గర్భకవితానురక్తితో రచనకు సాధన చేయుచు కృతకృత్యులగుచున్న మూర్తిగారిని మనసారా అభ్నందిస్తున్నాను.
జైహింద్.

24, అక్టోబర్ 2017, మంగళవారం

శ్రీ కందుల వరప్రసాదు గారు విరచించిన గోమూత్రికాబంధ కందము

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! ఏలూరులో పోలిటెక్నిక్ కళాశాల అధ్యక్షులు 
శ్రీ కందుల వరప్రసాదు గారు 
విరచించిన గోమూత్రికాబంధ కందము నవలోకించినచో 
అభినందించక మానరు.
కందుల కవివరు కృషినే
మందును, మహనీయ బంధ మార్గములోనన్
కందము సాగెను, మధురమ
రందము ప్రవహింపఁజేయు ప్రాభవమెలసెన్.
 శ్రీ వరప్రసాదు గారికి అభినందనలు.
జైహింద్.

23, అక్టోబర్ 2017, సోమవారం

చి.మఠం శివకుమార్ విరచించిన గవాక్షబంధ కందము

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! చి.మఠం శివకుమార్ విరచించిన గవాక్షబంధ కందము తిలకించండి.

క:
శివవల్లభ నాకునొసగె
శివమాయను దాటుశక్తి !శిరమున గొలువై
వివిధ పదంబులు బలుకును!
దవతౌ కలమౌ జయంతి! తా యంత్రంబే!
దవతి= సిరాబుడ్ది
నా తొలి ప్రయత్నము ఈ ప్రక్రియలో. ప్రేరణగా నిలిచిన పెద్దలకు ధన్యవాదములు.

సుందర గవాక్ష బంధము
నందముగా శివకుమారు డమరిచె కనుడీ!
సుందర భావోద్బంధుర
కందమ్ముగ శివుడె వెలసె కారుణ్యముతో.

శివ కుమారునకు అభినందనలు.
జైహింద్.

22, అక్టోబర్ 2017, ఆదివారం

మహా నాగ బంధము .. .. .. గణపవరపు వేంకటకవి.

0 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! 
గణపవరపు వేంకటకవి రచించిన 
ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము కావ్యమున 
మహా నాగబంధ మంజరీ, గీతి చరణ గర్భిత సీసము నకు 
మీరెవరైనా 
చిత్రీకరించ వలసినదిగా కోరుచున్నాను.
ఈ క్రిందిది గమనించి మీరు చేయగలరు.
మహా నాగ బంధము, ‌‌‌ (మంజరీ,గీతి చరణ గర్భితము), 
ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసము,
రచనన-గణపవరపు వేంకటకవి. 
సీ. సురభి భావగరాగ సూరాగణితధామ
వర్ణిత శాశ్వతైశ్వర్యధామ
వర్ధిత దానవవార పారావార
మధ్యమస్థా మహామత్తవార
నమ్రతామరజాత నవ్యభవ్యయుతాసి
రక్షిత తాపసరత్నవర్య
వర్ణిరూపారూఢ వాసవాదరలాప
‌హారగౌరద్యుతి సారహార
వర మురజ దమితనుతహ సరసహాస
రాసలీలాభిలాష వరతమపార్థ
భద్రవస్ఫుర వారణాపారభయద
ఫణివరాచల పాలప్రభాతిరమ్య.
గర్భిత మంజరి --
సురభిభావరాగ సూరాగధామ
వర్ధిత దానవవార పారావార.
గర్భిత ఆటవెలది--
సురభి భావ రాగ సూరాగణితధామ
నమ్ర తార జాత నవ్య భవ్య
వర్య వర్ణి రూఢ వాసవాదరలాప
హీర గౌర సార హార మురజ.
జైహింద్.

21, అక్టోబర్ 2017, శనివారం

"నాగబంధ కంద పద్యము". గణపవరపువేంకటకవి కృత "ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసం"లోినిది.

4 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
బ్రహ్మశ్రీ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు 
పరమ భాగవతులు.
వారికి చిత్ర, బంధ, గర్భ కవితాసక్తి మెండు. వారి ఆదాయమును ఇట్టి కవితా సంపదను పునరుద్ధరించుటకై వెచ్చించుచు, మరుగునపడిపోయిన మాన్య కవుల బంధ చిత్రాదులను వెలికి తీసి, చిత్రీకరించి ముద్రించుచు, ఆధునిక కవులకు చిత్రకవితానురక్తి కల్పించుచు మార్గదర్శకులగుచున్నారు. వారి ఇట్టి ప్రయత్నమును మనసారా అభినందించిచున్నాను. వారు చిత్రీకరిమ్చిన ఈ బంధము చూడుడు.
 "నాగబంధ కంద పద్యము". 
గణపవరపువేంకటకవి కృత 
"ప్రబంధరాజవేంకటేశ్వరవిజయవిలాసం"లో 
"వింశతిబంధకందం"ఉంది.
ఆ కందం-
క. సార వర హార వారా!
సార హరీ నరహరి హర శర కరసారా!
గౌర ధరధీర చారా!
సార హరీ సుర హరి నర సరసార భరా!

ఈ కందంలో ఉన్న ఇరవై బంధాలలో ఈ నాగబంధం ఒకటి. 
ఈ నాగబంధాన్నికూడా అనేక
విధాలుగా చిత్రం రూపొందించవచ్చు ,
వాటిలో ఇది ఒకటి.
జైహింద్.

20, అక్టోబర్ 2017, శుక్రవారం

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవికృత గవాక్ష బంధ కందము.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి గారు
వ్రాసిన గవాక్షబంధ కందము తిలకించండి.
శ్రీ హరి వీయస్సెన్ మూర్తి

మాన్యులు కవివర్యులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు 
ఈరోజు పరిచయము చేసిన రచనను 
చూచూటవలన కలిగిన స్ఫూర్తితో చేసిన ప్రయత్నము.
వారికి నమశ్శతములు.

సత్యత్యక్తుం డగునా
నిత్యము కరిరాట్ప్రసాదు నిర్మల దయతో
భృత్యుడు నౌనా ప్రణతిన్
సత్యైశ్వర్యాహరుండు శౌరీ జేజే. 
 హరి వీయస్సెన్ మూర్తీ!
పరమాద్భుత రీతి మీరు పరుగు పరుగునన్
మురియుచు గవాక్ష బంధము
 నరయుచు కందమును వ్రాసిరాహా యనగా!
కవిగారికి అభినందనలు.
జైహింద్.

19, అక్టోబర్ 2017, గురువారం

దీపావళి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
నేడు దివ్య దీపావళి. 
ఈ సందర్భంగా మీ అందరికి నా శుభాకాంక్షలు
జ్ఞానజ్యోతులనంతమై వెలిఁగి మీ కామ్యార్థమీడేర్చుతన్,
శ్రీనాథుండు సదా కృపన్ గను మిమున్ చిద్వర్తియై మెల్గుచున్,
దీనోద్ధారక శక్తినిచ్చు, భువిపై దేదీప్యమానంబుగా
ఈనాడీ ఘన దీపమాలిక మహోత్కృష్టత్వమున్ గొల్పెడున్..
జైహింద్.

18, అక్టోబర్ 2017, బుధవారం

కృతాపరాధము ప్రకృతి ప్రకోపము . . . శ్రీ వల్లభ,

0 comments

జైశ్రీరామ్.
 జైహింద్.

17, అక్టోబర్ 2017, మంగళవారం

బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
పండితమ్మన్యులు, నిగర్వి, సహృదయులు, 
సజ్జన సంసేవనాసక్తులు, 
సన్మార్గోద్వర్తులు,
బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి
పుట్టిన రోజు నేడే.
సహృదయ శిరోమణియైన శ్రీ ఏల్చూరి మురళీధరరావు మహోదయులకు 
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుచున్నాను.

ఈశా సంతత సంతసంబు నిడు మా యేల్చూరికిన్ బ్రేమతో
నాశింతున్ మురళీధరుండిలను మాహాత్మ్యంబుతో వర్ధిలన్,
ధీ శక్తిన్ వెలుగొందగా,  పహితాధీశుండుగా వెల్గగా,
శ్రీశా నీ పద పద్మ భక్తియుతుఁడై చెల్వొందగా నిత్యమున్.

వర యేల్చూరికులాబ్ధి చంద్ర! మురళీ! ప్రఖ్యాత సత్ పండితా!
ధర మీ పుట్టిన రోజు నేడు. శుభ సంస్తాప్యంబు చేయున్ గృపన్,
పరమానంద వసంత సంహతినిడున్ ప్రఖ్యాతిగా మీకికన్,
హరి సంతోష సుఖప్రదుండునగుచున్. హర్షంబు మిమ్మొందెడున్.
జైహింద్.

16, అక్టోబర్ 2017, సోమవారం

గవాక్ష బంధ కందము. . . . రచన. చింతా రామ కృష్ణా రావు.

2 comments

 జైశ్రీరామ్.


గవాక్ష బంధ కందము.
రామకృష్ణారావున్ మహేశా
రచనచింతా రామ కృష్ణా రావు.

రారా మదీయ సుకృతిన్
ధీరుఁడ కృష్ణా మనోజ్ఞ కృపతో,    రారా!
శ్రీరమణా! కను  నీవున్
దా. రా. సన్నిగమ సంస్తుతా!  హే శ్రీశా!

రా

రాదీ

సుకృతిన్ ధీ

రుఁ డ కృ  ష్ణామ నోజ్ఞ

కృ ప తో,   రా రా  శ్రీ  ర మ ణా

 క ను  నీ వున్  దారాస

 న్నిగ  సంస్తు

  తా  హే  శ్రీ

  శా

        జైహింద్.

15, అక్టోబర్ 2017, ఆదివారం

దేవరాజ వృత్త గర్భిత సీసము. .. .. .. రచన. శ్రీమతి పావులూరి సుప్రభ.

1 comments

జైశ్రీరామ్. 
దేవరాజ వృత్త గర్భిత సీసము. రచన. శ్రీమతి పావులూరి సుప్రభ.
వాణి, వరదనంచు భావమునను బల్కుదీవు కరుణతోడ నిందువదన
యెంచి మురిసిపోయి యేనిడుదును మొక్కులెన్నొ బగితితోడ నీవిధాన
పారి పరుగుదీయు పద్యములవ బాసలన్ని సొగసుగానె యనుదినమ్ము
కోరి వరము నిచ్చు కొమ్మవనుచుఁ బ్రస్తుతింతు నిజము గాద తెలుపవమ్మ
తే.గీ
పలుకు నాది నమ్ముదెవరు పలుకు తల్లి
పలుకులతిశయోక్తులనుచుఁ దలఁచకుండఁ
జెలిమి సత్యమనుచు నెంచఁదెలుఁగులంతఁ
బలుకవమ్మ వడివడిగా వెలుఁగుఁ జూపి /వెలసి తెరను
సీస గర్భస్థ దేవరాజ వృత్తము
గణములు --న ర న జ భ స ... య తి 11
వరదనంచు భావమునను బల్కుదీవు కరుణతో
మురిసిపోయి యేనిడుదును మొక్కులెన్నొ బగితితో
పరుగుదీయు పద్యములవ బాసలన్ని సొగసుగా
వరము నిచ్చు కొమ్మవనుచుఁ బ్రస్తుతింతు నిజముగా
సుప్రభ

09-18-2017
నేను ప్రచురించిన కంద,గీత గర్భ ఉత్పలమాల కు స్పందనగా, శుభకామనలతో చింతా రామకృష్ణారావు గారు వ్రాసిన దేవరాజగర్భిత సీసమును జూచి, వారినడిగి లక్షణములను తెలిసికొని, చూపిన గర్భస్థమైన దేవరాజ వృత్తమును గూడ పరిశీలించి అది మర్చిపోకముందే వ్రాస్తే బాగుంటుందని అనుకున్నాను. లోపలినుండి ప్రశ్న వచ్చినది.. ఇప్పుడే వ్రాయాలా? అని. నిద్రించే సమయమని, వేళ మించిపోతున్నదని తెలిసినా పెంకెగా )-: సమాధానమిచ్చాను --అవును.మరి. వ్రాయకపోతే వాణికూతుర్నంటే నమ్ముతారా? అని :-) ఏమనుకున్నారో యేమో కాని, యిక మాటాడలేదు. అదే అంగీకారముగా దీసికొని నా యత్నము నేను మొదలుబెట్టాను. అందిన/ అందించిన పలుకులు పైవి.
ఇంకొక గర్భకవితకు స్ఫూర్తి నొసగిన రామకృష్ణారావుగారికి ధన్యవాదశతములు. వ్రాయవలసినదే నని యన్నంత మాత్రాననే ప్రేమతో సాయము జేసిన వారికి వందనసహస్రములు. స్వస్తి.
చిత్రకవితానంద సంభరిత శ్రీమతి సుప్రభను మనసారా అభినందిస్తున్నాను.
అప్రతిమాన యత్నమున హాయిగ చిత్ర కవిత్వ సాధనన్
క్షిప్ర గతిన్ రచించు విదుషీమణి సుప్రభ యాంధ్రభాషలో
కప్ర మనోజ్ఞ సౌరభము కాంచును చిత్ర కవిత్వమింకపై.
సుప్రభ చిత్ర పద్యకృతి చూడగ తెల్గుకు సుప్రభాతమే
జైహింద్

14, అక్టోబర్ 2017, శనివారం

మానినీవృత్త గర్భ సీసము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

 జైశ్రీరామ్
మానినీవృత్త గర్భ సీసము.
శ్రీమదనంతుని, చిన్మయ రూపుని, చేర్చిన చిత్తులు క్షేమకరులు.
క్షేమసుయోగ విశేషఫలంబుల శేష జనాళికిఁ జేర్తురిలను.
నీమముతోడ మనీష సుభక్తులనేకులనెన్నుచు నేర్పుమెయిని
మీ మహనీయ సమీప్సిత సత్కృతి మేలుగ నిచ్చిన  మేల్కలుగును.
తే.గీ. కాన మహనీయ కావ్యసత్కర్తలగుచు
చిత్ర గర్భసద్బంధముల్ చేర్చి హరిని
కొలుచువారల కర్పించి కోర్కె మీర
యిహపరంబులసాధించి హాయిఁ గనుఁడు.
సీస గర్భస్థ మానినీవృత్తము. (భ భ భ భ భ భ భ గ .. యతి 1-7-13-19)
శ్రీమదనంతుని, చిన్మయ రూపుని, చేర్చిన చిత్తులు క్షేమకరుల్..
క్షేమ సుయోగ విశేషఫలంబులశేష జనాళికిఁ జేర్తురిలన్.
నీమముతోడ మనీష సుభక్తులనేకులనెన్నుచు నేర్పుమెయిన్.
మీ మహనీయ సమీప్సిత సత్కృతి మేలుగ నిచ్చిన  మేల్కలుగున్.
జైహింద్.

13, అక్టోబర్ 2017, శుక్రవారం

చక్రబంధ సీసము. .. .. .. రచన. శ్రీ పూసపాటి కృష్ణకుమార్

0 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ పూసపాటి కృష్ణకుమార్ గారు వ్రాసిన చక్రబంధ సీసము అపురూపమైనది.
తప్పక గ్రహించఁ గలరని ఆశించుచున్నాను.
వదన పుస్తక మిత్రులకు నమస్కారములు నిన్న తిరుమలలో శ్రీవారి చక్ర స్నానము తో శ్రీవారి బ్రహ్మోత్సవములు ముగిశాయి . చక్ర బంధ సీసములో శ్రీవారి ప్రార్ధన నిన్న వ్రాశి శంకరాభరణము బ్లాగులో పెట్టాను. పరిశీలించగలరు
చక్ర బంధ సీసములో శ్రీ వేంకటేశ్వర స్వామీ ప్రార్ధన
సీ:శ్రీ లక్ష్మీ వల్లభ, శ్రీ గోపికాలోల , శ్రీ జగత్పాలాయ, శ్రీ నివాస
శ్రీ వేంకటేశాయ, శ్రీ అమృతాంశాయ, శ్రీ వత్సవక్షసే, శ్రీ హరాయ,
శ్రీ శాంజ్ఞ పాణయే ,శ్రీకటి హస్తాయ, శ్రీ పద్మనాభాయ, శ్రీధరాయ,
శ్రీ దీనబంధవే, శ్రీ అనేకాత్మనే, శ్రీ జగద్వాపినే, శ్రీ వరాయ,
శ్రీ హయ గ్రీవాయ, శ్రీ జగదీశ్వరా, శ్రీ పరంజ్యోతిషే, శ్రీ రమేష,
శ్రీ మధుసూధనా, శ్రీ భక్త వత్సలా, శ్రీ పరబ్రహ్మణే, శ్రీ శుభాంగ,
శ్రీ యజ్ఞ రూపాయ, శ్రీ ఖడ్గ ధారిణే, శ్రీ నిరాభాసాయ, శ్రీ గిరీశ,
శ్రీ వన మాలినే, శ్రీ యాదవేంద్రాయ, శ్రీ సుర పూజితా, శ్రీ శిరీశ,
తే: నంద నందనా, దశరధ నందన, మధు
సూధన, పశుపాలకుడ ,అనాధ రక్ష
కా , దినకర తేజా,సాలగ్రామ హర, పు
రాణ పురుష, కాపాడు పరమ దయాళు.
పద్యము చదువు విధానము : 1 అన్న చోటునుంచి “శ్రీ లక్ష్మీ వల్లభ” తో మొదలు పెట్టి మద్యలో ఉన్న శ్రీ తో కలిపి “ శ్రీ గోపికా లోల “అని చదువు కోవాలి చివరిగా
“శ్రీ శిరీష” తో ఆపి పైన “నంద నందనా” నుంచి చదువుకొని “పరమ దయాళు” వద్ద ముగించాలి

పూసపాటి కృష్ణ సూర్య కుమార్ (సెల్ 9290042432 )
నా వ్యాఖ్య. 
ఆర్యా! అభినందనలు.
అద్భుతమైన యత్నము, మహాద్భుతదైవ నివేదనంబులో
కాద్భుత చిత్ర పద్య శుభ హారము, మీ కవితామృతంబుగా
నుద్భవమౌనటుల్ హరి మహోజ్వలశక్తి యొనర్పఁ జేసె, కిం
చిద్భవమైన దోషములు శ్రీహరి కాచును పూసపాటియున్
నమస్తే.
జైహింద్.

12, అక్టోబర్ 2017, గురువారం

కంద, గీత, గర్భిత ఉత్పలమాల .. .. .. రచన శ్రీమతి పావులూరి సుప్రభ.

1 comments

జైశ్రీరామ్.
కంద, గీత, గర్భిత ఉత్పలమాల రచన పావులూరి సుప్రభ.
సుస్వర మాలతో జనని, సుస్వర రాజ్ఞిని సన్నుతించి జ్ఞా
నేశ్వరిగా, సదా పలుకు నీరజ నేత్రిగఁ బాడ భక్తితో
నాస్వర దీప్తితో వెలుఁగనా వరదాయిని బిడ్డ నౌచు భా
షా స్వరమై నటుల్‌ శుచిగ శంకరమై నుడి శోభమీఱఁగా.

గర్భితమైన కందము
స్వర మాల తో జనని సు
స్వర రాజ్ఞిని సన్నుతించి జ్ఞానేశ్వరిగా
స్వర దీప్తితో వెలుఁగనా
వరదాయిని బిడ్డ వోలె, భాషా స్వరమై!

గర్భితమైన తేటగీతి
జనని సుస్వర రాజ్ఞిని సన్ను తించి
పలుకు నీరజ నేత్రిగఁ బాడ భక్తి
వెలుఁగనా వరదాయిని బిడ్డ నౌచు
శుచిగ శంకరమై నుడి శోభ మీఱ
సుప్రభ

09-17-2017
చింతా వారి గర్భకవిత స్ఫూర్తిగా, నేను ప్రచురించిన "నీవే దిక్కని" అనే కందగర్భిత శార్దూలమును చదివి వారు కంద,గీత గర్భిత ఉత్పలమాల లో స్పందనను దెలిపారు. అది చూడగానే చాలాకాలముగా నటువంటిది వ్రాయాలని యున్న సంకల్పము బలపడి పురికొల్పినది. కొంచెము కష్టపడినా లోనున్న వారి సాయముతో పై పద్య రూపములో పూర్తిజేయగలిగాను. :-) విషయము మాత్రము మామూలే. )-:
సంకల్పము రూపు దిద్దుకొనుటకు స్ఫూర్తినిచ్చిన చింతా వారికి ధన్యవాదములు. లోనుండి మౌనముగానే సాయమిచ్చిన వారికి శతాధిక వందనములు.

ఈ సుగుణవతికి అభినందన పూర్వకముగా నేను వ్రాసినది.
దేవరాజ వృత్త గర్భ సీసము,
గణ్య కవితలల్లగా సముచిత కల్ప - నంబు కలుగుచున్ నవంబు నెంచి,
భవ్య భవిత నెన్నిభారతికిని పావు - లూరి శుభ ప్రభాస ధీర వనిత
గణ్య భువిని గర్భకావ్య కలన పూజ్య - వౌదు వనునటుల్ శుభాదులొప్ప
సత్య కవన తేజసంబు కొలుపఁ గల్గి - తీవు. శుభగుణాళి తేజమీవు.
తే.గీ. సత్కవిత్వ ప్రదీప్తంబు సలుపనెంచి
గర్భచిత్రాదులన్ వ్రాయఁ గాంచి నన్ను
తత్ సుధాధార కైఁగొంచు తన్మయతను
వ్రాయుచున్నట్టి మీరిలన్ వరలుడమ్మ.
జైహింద్. 

11, అక్టోబర్ 2017, బుధవారం

శతావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ 47వ - అష్టావధానం. ..

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!
తేదీ 27.09.2017, శతచండీయాగం సందర్భంగా. చింతలూరు, రావులపాలెం దగ్గర జరిగిన.
శతావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ 47వ - అష్టావధానం.
సంచాలకులు : శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, పల్లిపాలెం
సమస్య : డా. నరసింహదేవర ఉమామహేశ్వర శాస్త్రి,
దత్తపది: శ్రీ వర్మ గారు
వర్ణన: శ్రీమతి ఓలేటి
నిషిద్ధాక్షరి: శ్రీ ఓలేటి బంగారేశ్వర శర్మ
న్యస్తాక్షరి: శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి
ఆశువు: -----------------------------
ఘంటానాదం: డా. పాలంకి లక్ష్మీ దేవి
అప్రస్తుతం: ద్విభాష్యం వేంకటేశ్వర్లు
ధారణాంశాలైన పద్యాలు ఆస్వాదించి ఆశీర్వదించండి!
సమస్య:
చండీ మండన దండనంబులను హింసాహింసపాలింపవే
గండంబుల్ కలిగించు దుష్టుల మఖాకారంబునందుంచి, వే
దండంబెక్కి మహార్షరూపిణివనన్ ధర్మంబు పృథ్విం గనన్
నిండున్ ప్రేమముజూపి భక్తతతిపై, నిర్లక్ష్యపుం ధూర్తులన్
చండీ మండన దండనంబులను హింసాహింసపాలింపవే!
దత్తపది : చండి, కాళిక, భైరవి, రుద్రాణి - అమ్మవారి స్తుతి.
చండి దేహమునందలి శత్రు తతికి!
కవులగాచెడికాళిక కథలవినమె!
భైరవీయంచు పూజింప బాధలెల్ల
దంష్ట్రముల జిక్కి త్రెళ్ళు రుద్రాణి! నతులు!!
వర్ణన: చింతలూరు - చండీయాగం
ఆయుర్వేదమహాలయంబనగ విఖ్యాతింగన్నదీ సీమయే
ఆయుర్దాతగు శక్తి నిల్చెనిట; సఖ్యంబిచ్చు నీ యాగముల్;
ధీయుక్తంబుగ చింతలూరు సతమున్ దేదీప్య మానంబుగా
నీ యా చోటు లనేక ప్రాంతములలో నీ రీతి పెంపుంగనున్!
నిషిద్ధాక్షరి: శారదా స్తవం (మూడు పాదాలు ప్రత్యక్షర నిషేధం, నాల్గవ పాదం స్వేచ్ఛ)
శ్రీ మాకిచ్చున్ నీ వా
శ్రీ! మాపాలిని! జనని! వరించుమ మమ్మున్!!
లేమా! అజనిజభామా!
ధీమంతుల జేయుమమ్మ దీవ్యత్ప్రభలన్!!
న్యస్తాక్షరి:
ర, న, త,వి అనే అక్షరాలు వరుసగా నాలుగు పాదాల్లో మొదటి అక్షరాలుగా ఉంచుతూ చండీ యాగం - అవధాన వేదిక వర్ణన.
రయమున నేలుమమ్మ! ఘనరమ్య వధాన విధాన మంతయున్
నయనములారయన్ చనని నవ్య పథాన పదాల పోహళిం
త యనగ పృచ్ఛకాళి శృతి దప్పని రాగము నాగ మెచ్చ దే
వి! యనుగు బాలుడున్ గనుమ విశ్రుత పాండితి గల్గ జేయుమా!!
తదుపరి
ఆశువులు, ఘంటాగణనం, అప్రస్తుత ప్రసంగంతో అష్టావధానం సంపూర్ణమైంది
స్వస్తి
ఈ కార్యక్రమ నిర్వాహకులకు, అవధానిగారికి, పృచ్ఛకాళికి అభినందనలు.
  జైహింద్.

10, అక్టోబర్ 2017, మంగళవారం

వస్తేన వపుషా, వాచా, . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

 జై శ్రీరామ్.
శ్లో. వస్త్రేన వపుషా, వాచా, విద్యయా, వినయెనచ
వకారైః పంచభిర్యుక్తః నరో భవతి పూజితః.
గీ. వస్త్రము, వపువు, వినయము వాక్సుధయును,
విద్య యను వకారములైదు హృద్యముగను
కలిగి యుండిన మనుజుఁడు గౌరవింపఁ 
బడును జగతిని. తెలియుఁడీ! ప్రాజ్ఞులార!
భావము. వస్త్రము, వపువు, వాక్చాతుర్యము,విద్య, వినయము అను పంచ వకార యుక్తుఁడైన మానవుఁడు పూజింపఁబడును. 
జైహింద్.

9, అక్టోబర్ 2017, సోమవారం

నదీ వృత్త గర్భ సీసపద్యము .. .. .. రచన. శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నా ప్రియ సహోదరులు శ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ గారు నదీ వృత్త గర్భ సీసపద్యమును వ్రాసినారు చూడండి.
శ్రీ Chinta Rama Krishna Rao గారు వ్రాసిన అమ్మ స్తుతి స్ఫూర్తితో ... సామాజికాంశం గా ఒక
నదీ వృత్త గర్భ సీసము.
సీ॥
తెలిసికూడ కనులు తెరువరే కానగ
దీన జీవాల్ వారి హీన గతుల
తెలుపరేల తనకు తెలిసినా తప్పుకు
పోవుటేలా తోటి జీవులగని
శిలలైతిరె మనసు తెలుపరే మంచికి
తోడురారే వారి గోడు వినరె
మారరేల జనుల మనసులో జాగృతి
కల్గునెట్లో కదా వెల్గు నింప
తే॥గీ॥
పదుగురొకటైన చాలును ఫలితముండు
తనకు కుదిరినంతటి సేవ ఘనత కాదు
మనసు పెట్టిన పూనిక మానకుండ
వెలుగు నింపుట తేలిక వెతల బాప

సీస గర్భస్థ నదీ వృత్తము. (న న త జ గగ .. యతి 8)
కనులు తెరువరే కానగ దీన జీవాల్
తనకు తెలిసినా తప్పుకు పోవుటేలా
మనసు తెలుపరే మంచికి తోడురారే
జనుల మనసులో జాగృతి కల్గునెట్లో

8, అక్టోబర్ 2017, ఆదివారం

శివశంకర గర్భ సీస పద్యము .. .. .. రచన. శ్రీమతి మంతా భానుమతి.

2 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
కవయిత్రి శ్రీమతి మంతా భానుమతి గారు 
శివశంకర గర్భ సీస పద్యమును వ్రాశారు.
గురువర్యులు, పండితులు చింతా రామకృష్ణా రావుగారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, ప్రతీ రోజూ పద్య గర్భ సీసములతో అమ్మవారిని స్తుతిస్తున్నారు. వారి స్తుతిలో భాగంగా శివశంకర గర్భ సీస పద్యమును వ్రాశారు. ఆ పద్యముతో స్ఫూర్తి నొంది, మేము కొందరం ప్రతీరోజూ నడుపుకుంటున్న ప్రహేళికకి శివశంకర గర్భిత సీస పద్యమును వ్రాశాను.
కవి మిత్రులు వీక్షించాలనే ఆశతో ..

శివశంకర గర్భ సీస పద్యము
సీ. జనియించి నది యశస్సనిశము భాసిలు
పొలుపౌ చరిత గల, పుడమి నేలు
ఘన వంశమున, నదే కద ఘన కీర్తిగ
తనకే, వరింపగా తమ్మునిగను,
వని యందున పురమున్పర వలతిన్, పను
చుకొనెన్ మమతలను సురతములను
తన సూత పటిక సత్ఫలితము లన్ సహ
జులతోడ తాతయే నిలను పలుక
ఆ.వె. దేవు నామములను భావి తరముకిచ్చె
ఆలమంద నతడు నలవి కాచి
పాలనందజేసి బాగోగుల నడిగె,
మాయగాని చంపె మదమునణచి.
శివశంకర వృత్తము.
జనియించి నది యశస్సనిశము భాసిలు పొలుపౌ
ఘన వంశమున, నదే కద ఘన కీర్తిగ తనకే
వని యందున పురమున్పర వలతిన్ పనుచుకొనెన్
తన సూత పటిక సత్ఫలితము లన్ సహజులతో!
(మా ప్రహేళిక విప్పడానికి, పద్యం చదివి.. ఆ కథను చెప్పాలి.  
స్వస్తి.
ఇట్లు
మంతా భానుమతి.
అమ్మా! భానుమతిగారూ! నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీరు చేస్తున్న ప్రయత్నంలో కృతకృత్యులగుచున్నందులకు మీకు నా మనః పూర్వక అభినందనలమ్మా.
శుభమస్తు.
జైహింద్.

7, అక్టోబర్ 2017, శనివారం

వేడుకోలు. .. .. .. శార్దూల వృత్త మాలిక.

1 comments

జైశ్రీరామ్.

నమోస్తు తే జగన్మాతా!
శార్దూల వృత్త మాలిక.
అమ్మా! నిన్ గనుచుంటి సర్వమున నాహా! పొంగుచున్ సర్వదా.
సమ్మాన్యంబగు సుస్వరూపముగ. భాషా సుందరోద్భాసి! వే
దమ్మున్ గల్గిన తేజ మీవె మహిళా తత్వార్థ సంభాసితా!
ఇమ్మున్ భారత నారిగా ప్రబలితే! ఈశాని! నీ తేజసం
బెమ్మిన్ దాల్చిన కాంతలే శుభములన్ హృష్టాత్ములై పంచుచున్,
దమ్ముం జూపఁగఁ జాలువారు, కవితా దర్పంబునన్ వెల్గుచున్
సమ్మానంబుల నందువారు, విలసత్ సత్కార్యముల్ చేయువా
రమ్ముల్ బట్టి రణంబు చేయుప్రతిభుల్ హర్మ్యది నిర్మాణముల్,
సమ్మోదంబుఁగఁ జేయఁ గల్గు మహితల్, సత్కార్య నిర్వాహకుల్,
కమ్మందేనియ పల్కులన్ సుజనులన్ కారుణ్యముం జూచువా
రమ్మా యంచును బిల్చినంతనె మదిన్ హర్షించి ప్రేమామృతం
బమ్మై పంచెడి వార లక్షయ కృపన్ త్యాగాకృతిన్ వెల్గువా
రమ్మోహాదుల గెల్చినట్టి ఘనులున్, యత్నించి దైవంబునే
రమ్మంచున్ బిలువంగఁ జాలు ప్రతిభల్, ప్రాణంబులన్ నిల్పు బ్రో
చమ్మల్, సంతత సన్నుతాత్ములు, కృపా సామ్రాజ్య రాజ్ఞీమణుల్,
నమ్మన్ వారిని వమ్ము చేయక కృపాణమ్మై సదా కాచువా
రమ్మా! నీ ప్రతి రూపులై వెలుగు మాయందున్ సదా. దైవ కా
ర్యమ్ముల్ చేయఁగఁ జేతురమ్మ గని సౌర్యంబిచ్చి సత్ప్రేరణన్.
తమ్ముం దాము తలంచుచాత్మనిను మాతా గాంచి పూజ్యంబుగా
సొమ్ముల్దాల్తురు ప్రేమతోడ మదిలో శోభిల్ల నీరూపు వే
దమ్మున్ వెల్గెడి దేవదేవి! కృపతో.తత్వార్థ పూర్ణాకృతిన్
మమ్మున్ గావగ నీవె వీరగుచు ప్రేమన్ మాకు గన్పింతు వో
యమ్మా! నీవె కృపాంతరంగవయి మోహాదుల్ విడంజూడుమా!
నమ్మంజాలని దుష్టసంస్కృతులచే నశ్యంబగున్ సర్వమున్.
క్రమ్మున్ వేగమె మానవాళిని, మహత్కాఠిన్య గాఢాంధమున్
క్రమ్మంజేయును. పాపభీతి నణచున్, బ్రఖ్యాతి పోకార్పుచున్
వమ్ముంజేయు మహత్వ సంస్కృతి గతిన్ వర్ధిల్లు కాంతాళిపై
క్రమ్మున్, దుర్గతిపాలు సేయు నవతన్ గాంక్షింపఁగా చేయుచున్
నమ్మంజాలని ధర్మహీనగతులన్ నర్తింపఁగా చేయు, మౌ
నమ్ముందాల్పగఁ జేయు శిష్టజనులన్, నక్షత్ర వారాశినాన్
క్రమ్మంజేయును దూరదర్శనములన్ గానంగ సిగ్గౌనట్లుల్.
మమ్ముంజూడుడటంచురేగునటులన్ మౌనంబుగా చేయు, మా
యమ్మా గాంచగరాని తీరునిడి మోహాంధంబునే గొల్పుచున్
సమ్మోహమ్మును గొల్పి దుష్ట గతులన్ చాంచల్యమున్ గొల్పు, హే
యమ్మౌ దుర్గతి పాలు సేయుచును మాయన్ గొల్పు. పూబోడులన్
సమ్మోదమ్మున కాచుమమ్మ కరుణన్. సంధించు బాణమ్ములన్.
సమ్మాన్యుల్ మఃహిళామణుల్ ధరణిపై శశ్వన్నయోపాసకుల్.
క్రమ్మంజేయకు మమ్మ దుర్గుణ తతిన్ కాపాడుమా వారలన్.
నెమ్మిన్ దుర్మద దూర సంస్కృతిని క్షీణింపన్ గృపం జేయుమా!
కొమ్మా! వందన మాచరింతు జననీ! కూర్మిన్. భవానీ సతీ!
ఇట్లు 

అమ్మ భక్తుల పాదరేణువు.
చింతా రామకృష్ణారావు.
జైహింద్.

6, అక్టోబర్ 2017, శుక్రవారం

మన వడ్డాది పాపయ్య ప్రతిభా పాటవాలు మనకసలు తెలియనే తెలియవు.

1 comments

జైశ్రీరామ్.
కీ.శే. శ్రీ వడ్డాది పాపయ్య శాస్త్రి గారు 
1904లో చిత్రించిన పటం 
చూడండి. 
తలక్రిందులు చేసినా మామూలుగానే కనిపిస్తుంది. 
ఇప్పుడు తలక్రిందులుగా చూద్దాం.

ఎంతటి భావనాగరిమ! ఏమి విలేఖన నైపుణంబు. ర
వ్వంతయు లేదు భేదము. దివంగతులయ్యును పాపయార్యులీ
వింతగు చిత్రలేఖన సువిస్తర తేజసమందు జీవులై
సంతతమున్ బ్రజాళి మది సన్నుతులందుచునిల్చిరిద్ధరన్.
పాపయార్యులకు అంజలులర్పిస్తున్నాను.
జైహింద్.

5, అక్టోబర్ 2017, గురువారం

బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు విద్వద్వరేణ్యులు ప్రవహింపఁ జేసిన ఆంధ్రామృతం గ్రోలండి.

1 comments

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు విద్వద్వరేణ్యులు ప్రవహింపఁ జేసిన ఆంధ్రామృతం గ్రోలండి.
బ్రహ్మశ్రీ ఏల్చూరి మురళీధరరావు విద్వద్వరేణ్యులు

వేదార్థప్రతిపాదనైకపరమై విఖ్యాతసత్సంప్రదా
యాదిత్యోదయసానుమచ్ఛిఖరమై యాంధ్రావళీసంతతా
హ్లాదాపాదకమై మహాకవిశుభవ్యాహారనిష్పన్నమౌ 
ఓ దివ్యాంధ్రసరస్వతీ! కొనుమివే యుద్యన్మదీయస్తుతుల్. 
నన్నపార్యుని సుధీసన్నుతస్వచ్ఛగీర్వాణాంధ్రగంగాప్రవాహఘోష 
తిక్కన్న కవి తేట తెనుఁగు పల్కుల చక్కెరలతోడి మావిముక్కల పసందు 
శ్రీనాథకవినాథు శృంగారచాటూక్తినందనప్రసవమరందధార 
పోతనామాత్యుని మోక్ష్మలక్ష్మీపరిష్వంగ సంరంభ వాక్పాటవంబు

పెద్దనార్యుని కవనగాంభీర్యరేఖ 
రాయల బహుశాస్త్రప్రౌఢరసజగత్తు
దివ్యదీధితు లొలయు చాంద్రీమయాంధ్రి! 
దీవెనలు వోసి మమ్మోము తెలుఁగు తల్లి! 

చిన్నయసూరికృతోన్నయనంబున జీవసత్త్వంబునఁ జేవమీఱి
తిరుపతి వేంకటేశ్వరకవీంద్రవధానశుభవాక్యసంహతి శోభఁ జెలఁగి 
మానవల్లిబుధేంద్రమానితాఖిలకావ్యమాణిక్యరోచుల మహిమఁ జెంది
వేదాన్వయోదయవేంకటరాయశాస్త్రి మహాత్మ కృతికళాదీప్తి నలరి

నన్నయాద్రిశిఖరసముత్పన్నమైన
విశ్వనాథార్షభారతీశశ్వదమృత
నిమ్నగాస్నాతపూతమై నీ పదాబ్జ
యుగళి మా కభయచికీర్ష నెగడుఁ గాత. 

పలుకులు భావముల్ మధురభంగిమఁ జొప్పడ; సత్యవస్తుతా
స్ఖలితకళాస్వరూపముఁ, బ్రశస్తరసధ్వనిచార్వలంకృతుల్, 
లలితగుణంబులున్ మెఱయు లక్షణలక్షితగీఃప్రపంచసం 
చలితసరస్వతీకృతివిశాలజగత్పరమేశి కంజలుల్! 

(ఒకరోజు కళాశాలలో తెలుగు పద్యం గురించిన పరిచయ పాఠాన్ని ముగించిన తర్వాత 
సాహిత్యచరిత్ర విద్యార్థులకు వినిపించిన ప్రార్థన)

ఈ పాండిత్య ప్రకర్ష సంభవము శ్రీ ఏల్చూరికే. భక్తికిన్ 
సోపానంబగు మీ సుబోధ, మురళీ శ్రోత్రాద్భుతారావమై
కాపాడంగలదాంధ్రభాషను. శుభాకాంక్షల్. మహాత్మా! భివిన్
దీపింపన్ మహనీయ కావ్యకరణోద్దీప్తిం బ్రవర్ధిల్లుడీ!
జైహింద్.

4, అక్టోబర్ 2017, బుధవారం

ప్రణవ వృత్త గర్భ సీసము. .. .. .. రచన శ్రీ నారుమంచి వేంకట అనంతకృష్ణ

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నా ప్రియ సహోదరులు నా రచనా స్ఫూర్తితో రచించినప్రణవ వృత్త గర్భ సీసము. చూడండి.
బ్రహ్మశ్రీ నారుమంచి వేంకట అనంత కృష్ణ

శ్రీ Chinta Rama Krishna Rao గారి స్ఫూర్తితో రచించిన
ప్రణవ వృత్త గర్భ సీసము. 
రచన శ్రీ Anantha Krishna
ఆర్తిన్ కలిగిన భావావేశము పలు రూ
పాలై సరగున తా పరుగులిడదె
భావ్యమై వరలు సేవాభాగ్యము సిరిగా
తోచన్ యథాశక్తి తోడు నిల్వ
యవ్వారలైన దైవారాధన ధర నీ
రీతిన్ సలుప వచ్చు రేయి పవలు
పాలు పంచుకొని నావారందరు నడువం
జేతున్ ప్రమాణాల చేత చేయ
తే॥గీ॥
శక్తి కలవారు సేవనాసక్తి చూప
అందరొకటై మెలుగుట హాయి యనుచు
కలిమి లేములన్న తెరలు కరిగి పోవ
సమసమాజము నిల్పుడు సతము నిచట

సీసగర్భస్థ ప్రణవ వృత్తము. ( ప్రణవ వృత్తము - మ న య గ .. యతి 6 )
భావావేశము పలు రూపాలై
సేవా భాగ్యము సిరిగా తోచన్
దైవారాధన ధర నీరీతిన్
నావారందరు నడువంజేతున్
జైహింద్.

3, అక్టోబర్ 2017, మంగళవారం

యువశక్తి నిర్వీర్యం కాకూడదు.

1 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమాన్ ముమ్మడి ఛంద్రషెఖర్ ఆచర్యులవారు ముఖ పుస్తకమున వ్రాసిన ఉత్పల మాల చదివిన నేను చేసిన వ్యాఖ్యలో నేనూహించుచున్న యువతకుండు శక్తి ఉత్పల మాలికగా వెలువడినది. చూడఁగలరు.
శ్రీమాన్ ముమ్మడి ఛంద్రషెఖర్ ఆచర్యులవారు ఇలా వ్రాసిరి. 
పండితమిత్రులందఱికి వందనాలు
ఇలా తోచింది వ్రాసి యున్నాను.
ఉత్ప.
ఏమని చెప్పుదీయువత కెక్కడి బుధ్ధులు నావహించెనో
కామనలెక్కువయ్యె నిల కష్టము లేమియు లేకనొంటికిన్,
భామల దూలనాడి కడు పాపపు మూటనుమోయనెంచగా
నీమము దప్పిరీప్రజల నీవెటు జక్కనొనర్తువమ్మరో!
ముమ్మడి,,,, 2-10-’17.

నావ్యాఖ్య.
చంపక మాలిక..
యువకులు కొందరే క్షితినయోమయ దుస్థితి కారణంబుగా
భవితను కానలేక పరవశ్యమనంబున బ్రాంత చిత్తులై
ప్రవిమల స్త్రీజనంబులను వంచన చేయఁ దలంతురద్దిరా!
యువతకుఁ గల్గు శక్తిని ప్రయుక్తము చేసిన మంచిచేయగా
జవనహయంబులై చెలఁగు. సత్పరివర్తన సంభవించు. సం
భవమగు సంస్కృతీ ప్రగతి, వర్ధనమౌ వర సాంప్రదాయముల్,
కవులు వచించునాకృతయుగంబు రహించును ధర్మపూర్ణమై.
శ్రవణకుమారులున్ వెలయు చక్కఁగ చూడఁగ తల్లిదండ్రులన్,
ప్రవిమలదేశభక్తియుత భావితరాలకు మార్గదర్శమౌన్
కవులును గాయకుల్ వెలయు, గౌరవ వర్తన కాంతులీను,సం
స్తవ శుభ వర్తనల్ పెరుగు, ధర్మవిరుద్ధములుండఁబోవు, ప్రా
భవమది దీపితంబగు. శుభంబులె గాంచుదురెల్లరున్ సదా.
నవనవ కాంతులీనెడుననావిల భాసుర భారతావనిన్.
ప్రవరవరుల్ జనించుదురు భారతజాతికి కీర్తి పెంపగున్.
పవనకుమారులై ప్రగతిబాటను సాగుదురాత్మశక్తితో,
శివుని త్రినేత్రులై దురిత చిత్తుల దుర్మతి కాల్తురిత్తరిన్,
లవణ జలంబులన్ సుధను లక్ష్యముతో వెలి దీతురెన్నుచున్,
ప్రవహములై జలంబులు ప్రపన్నులఁ గావఁగ జాలునిబ్భువిన్.
నివసనముల్ రహించు మహనీయుల గొరవమెన్నగాబడున్,
ధవళితమౌను వేదములు ధాత్రిని విశ్వజనీనతన్, మహో
ద్భవులుగ భారతీయులిల ప్రాభవమున్ గొను సజ్జనాళిచేన్.
రవియు కనంగఁ జాలని పరాత్పరునిన్ గననేర్తురెల్లరున్.
యువతయె సాధకుల్ కన. ప్రయుక్తిని ఛండమయూఖులౌదు రీ
యువతకు దారి జూపెడి ప్రయోజకులిప్పుడు మృగ్యమౌటచే
ప్రవరులె బాటతప్పి పలు రాక్షస కృత్యము లబ్బి ధాత్రికిన్
యువతయె కీడు చేతురన నొప్పుచునుండిరి చంద్రశేఖరా!!

యువశక్తి వర్ధిల్లుఁగాక.
సస్తి.
జైహింద్.