గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

నిశ్చలాత్ములే ఆత్మ సాక్షాత్కారం పొందగలరు.

శ్లో:-
శ్రుతివిప్రతిపన్నా తేజ్యోతి పగిది
యదా స్థాస్యతి నిశ్చలా
సమాధా వచలా బుద్ధి
స్తదా యోగ మవాప్స్యసి.
క:-
శ్రవణాదుల కలత పడని
యెవని మదిని దైవ భక్తి, ఎఱుకయు యుండున్
భవ బంధ దూరుడాతడు.
సవిధంబుగ గాంచు నాత్మ శక్తిని, దీప్తిన్.
భావము:-
నానావిధములగు శ్రవణాదులచే కలత జెందియున్న నీ బుద్ధి యెపుడు చలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగ నిలిచియుండునో, అపుడు నీవాత్మసాక్షాత్కారమును బొందగలవు.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.