శ్లోll
కలౌకల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినామ్
విధి క్రియా విహీనానాం హరేర్నామైవ కేవలమ్.
తే.గీll
కలి యుగంబున కల్మష కలితులకును,
పాప ద్రవ్యోప భుక్కులౌ పాపులకును,
విహిత క్రియ వీడి చరియించు వెడఁగులకును
హరి ముదావహ నామము శరణమరయ.
భావము:-
కలియుగంలో కల్మష చిత్తమున్న వారికి,
పాప సంపాదనతో జీవిస్తున్న వారికి,
వేద విహిత కర్మాచరణ లేనివారికి
కేవల హరి నామమే మార్గము.
జైశ్రీరామ్.
జైహింద్.
4 comments:
bagaa selavicchaaru.
ee kaliyugam lo hari naama sankeerthana matrame manushulaku prashantatanu, mukthi prasadinchagaladu.
హరినామమే మనకు మిగిలే ధనమూ
అన్నింటికన్నా మిన్నైన ధనమూ.......
కీర్తన
నిజమె ఈ కలియుగంలొ రొజుకు ఒకసారైనా " హరి నామస్మరణ " చేయ గలిగితె కాస్త మనస్సాంతి దొరుకుతుందేమొ
బాగుంది రఘూ! పూరణ.
నీ వినూతన ప్రయోగం కూడా అద్భుతంగా ఉంది.అభినందనలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.