సదసద్వివేక సంపన్నులారా! నమస్సులు.
Print this post
మీ నుండి నేను నాకు కలిగిన సందేహ నివృత్తిని కోరుకొంటున్నాను.
౧)పుట్టిన ఆడ పిల్లకు నెల లోపు నామ కరణకు ఇన్నవ రోజు ప్రశస్తమనే నియమముందా?
౨)౨౯ వ రోజున నామకరణ చేస్తారని వినికిడి.
ఐతే దానికి ముహూర్తమక్కరలేదని కొదరి అభిప్రాయము సరైనదేనా?
౩)గురు మూడములో నామకరణ చేయ వచ్చునా?
౪)(ఆడపిల్లైతే బేసి, మగపిల్లడైతే సరి సంఖ్యలో అక్షరనియమముందని వినికిడి)
ఆడ పిల్లకు నామకరణమప్పుడు పాటించ వలసిన అక్షర నియమమేదైనా ఉందా?
నాలుగు సందియంబులను నల్వురు చింతన చేసి చెప్పుగన్
జాల గలారు మీరు. సరసామృత వాక్కులు. సద్గుణాలయల్.
చాలను నే మిమున్ బొగడ. సద్గుణ పుణ్య ధరిర్తి వర్ధనుల్.
మేలగు సూచనల్ సలుపు మీరల కందరి కంజలించెదన్.
ఇట్లు
సద్విధేయుఁడు.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.