గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఫిబ్రవరి 2011, బుధవారం

యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామీ నమోనమః

http://www.thehindu.com/2007/02/24/images/2007022410440301.jpg
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి.
ఉll దుర్జనపాళి దౌష్ట్యములు తోయజ నాభ! సహింపఁ జాలకే
గర్జన చేయుచున్ దురిత గర్వ మదాంధ తమోపహారివై
భర్జన చేయగా వలచి; భక్తుల పాలిట కల్పవల్లివై
యూర్జముతో నృసింహునిగ యుర్విని యాద గిరిన్ రహించితే?

దయామయా! మరెందుకాలస్యం? దుష్ట సంహారం చేసి శిష్టుల్ని కాపాడు.
జై శ్రీ నార సింహా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.