పాఠకావతంసులారా! కవిసమ్రాట్టు శ్రీ విశ్వనాథ సత్యనారాణ యొక్క శ్రీమద్రామాయణ కల్పవృక్షమును ఆపోసన పట్టి కల్పవృక్షం నీడన తలదాచుకొనుచున్న కవివతంసులైన శ్రీమాన్ బులుసు వేకటేశ్వర్లు కవితా సంకలనమైన మువ్వ లో గల కవితలను కవితామృత ఖండికలనఁ దగి యున్నవి.
నిరంకుశాః కవయః అన్నది ఎంతటి సత్యమో వీరి రచనయైన విమల కావ్యదాస! వేంకటేశ! మకుటముతో గల పద్య త్రింశత్తు గమనించినట్లైతే మన కవగతము కాక మానదు.
పాఠకులు ఆనంద పరవశు లగుదు రనే ఉద్దేశ్యంతో ఆరు భాగాలుగా మీ కందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇక చదివి మీరే చూడండి. చూచి మీ ఆనందాన్ని కవివతంసులకు మీ అపురూపమైన వ్యాఖ్య ద్వారా తెలియఁ జేయండి.
ఇక చదవండి.
సకల దుర్ వ్యసనములకు సెలవీయంగ
దీక్ష పూనె నొకఁడుధీర వృత్తి.
దీక్ష విడుచు రేయి తెప్పించె సారాయి
విమల కావ్య దాస వేంకటేశ. ౧౬.
అమ్మ ఒడిని చేరి హాయి పరుండెడు
పిల్లకాయ బడికి వేయబడెను.
చేయి పలకపైన చిత్తమ్ము తల్లిపై.
విమల కావ్య దాస వేంకటేశ. ౧౭.
పోతనార్యుపద్దెమును పఠింపగ లేరు.
విశ్వదాభిరామ వినగ రారు.
ఆంగ్ల గీతి పాడ నభ్యసింతురు తొల్త.
విమల కావ్య దాస వేంకటేశ. ౧౮.
తన ప్రీక్ష ఒకటి తప్పుచు నుండంగ
ఎట్లు ప్యాసు అగుతో ఎఱుగ లేడు
చదువు చెప్పనెంచి స్థాపించె కాన్వెంటు.
విమల కావ్య దాస వేంకటేశ. ౧౯
గోల చేసి చేసి గురువుల బెదిరించి,
చదువు లేమివారు చదువుకొంద్రు.
కాకి గోల లోన కోకిల కూయునా.
విమల కావ్య దాస వేంకటేశ .౨౦.
(త్వరలో ఐదవ భాగం మీ ముందుంటుంది. నమస్తే)
జైశ్రీరాం.
జైహింద్.
1 comments:
ఒక్కొక్క పద్యం చదువు తుంటే అందులొని దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా కనబడు తోంది " అమ్మ ఒడిని కాదని బలవంతపు బడి పసివారు ,ఇంగ్లీషు పద్యాలు తప్ప ,తెలుగు నేర్పడానికి నామోషీ పడె తల్లులు,[ కమ్మనైన అమ్మ పిలుపు కరువై మమ్మీలుగా మారుతున్నారు ] మాష్టార్ని బెదిరించె మార్కులు నిజమె ఈ కాకి గోలలొ కోయిల కూయక పోవడమె మంచిదేమొ ! చక్కని పద్యాలకు మిక్కిలి ధన్య వాదమ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.