గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, డిసెంబర్ 2009, శుక్రవారం

తేదీ 28 - 10 - 2009. ఏ వారమో లెక్ఖ చేసి తెసుకొందాం.

ఆర్యులారా!
దీని ముందు టపాలో ఒక ఆంగ్ల తేదీ చెపితే అది ఏవారమో ఏ పద్ధతి ప్రకారం తెలుసుకోవాలో వివరించఁ బడింది కదా!
ఇప్పుడు దానికి ఉదాహరణను ప్రయోగాత్మకంగా చేసి చూద్దాం.

తేదీ 28 - 10 - 2009. ఏ వారమో చెప్పండి?
అని అడిగారే అనుకొందాం. దానికి సమాధానం ఎలా పడికట్టాలో క్రింద పరిశీలిద్దాం.
దీనికి సమాధానం. గమనించండి.
సంవత్సరములు 1900 ఒక లెక్ఖ.
తరువాత మళ్ళీ ప్రారంభమవుతుంది సంవత్సరం.
ఉదాహరణ:-1999 అనుకొందాం.
1999-1900=99 అవుతుంది
2009 అనుకొంటే 2009-1900=109. వస్తుంది.
ఇప్పుడు ఆ 109 ನಿ 4 చే భాగించగా { శేషాన్ని విడిచిపెట్టాలి.} వచ్చిన భాగ ఫలాన్ని ఆ 109 కి కలపాలి.
తరువాత తేదీని దానికి కలపాలి.
ఆతరువాత నెలకు గల సంకేత సంఖ్యను కలపాలి.
నెల సంఖ్య:----- 1 - 2 - 3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12.
సంకేత సంఖ్య:---1 - 4 - 4 - 7 - 2 - 5 - 7 - 3 - 6 --01 -04 - o6.
అని గుర్తుంచుకోవాలి.
అప్పుడు
ఆ మొత్తాన్ని 7 చే బాగించగా వచ్చిన శేషం 1 ఐతే> ఆది, 2 > సోమ, 3 > మంగళ, 4 > బుధ, 5 > గురు, 6 > శుక్ర, O > శని వారము. అని గుర్తించి చెప్పాలి.
ఊదా:-
తేదీ 28 - 10 - 2009 ఏ వారము?

సమాధనం:-
2009 - 1900 =109.
109 ని 4 చే భాగించగా భాగ ఫలం = 27. { శేషాన్ని విడిచిపెట్టెయాలి.}
109 కి ఆ భాగ ఫలాన్ని అనగా 27 ను కలుపగా 136 అయింది. దానికి
తేదీ అయిన 28 ని కలుపగా 164 అయింది. ఆ తరువాత
164 కు ఆంగ్ల మాసమైన అక్టోబరు కు గల సంకేత సంఖ్య అయిన 1 ని కలుపగా 165. అయింది.
165 ను 7 చే భాగించగా మిగిలిన శేషము 4 వచ్చింది. అంటే బుధ వారమన్న మాట.

ఈ పర్యాయం మీరూ ప్రయత్నంచేసి, తేదీ.15-8-1947. ఏ వారమో లెక్ఖ చెసి నిరూపించగలరేమో ప్రయత్నంచగలరు
అలాగే మీరు పుట్టిన తేదీని, మీ పిల్లల పుట్టిన తేదీలను, వివాహాది ముఖ్యమైన తేదీలను ఏ వారాలో పడికట్టండి.

జైహింద్.
Print this post

6 comments:

తుంటరి చెప్పారు...

Good One kaani sanketa sankhya ni gurtunchukune margam emina undaa

Anandakiran చెప్పారు...

baagundi

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా!
చిదానంద గారూ! ధన్యవాదాలు.

ఆర్యా!
తుంటరి!సంకేతము గురు
తుంట,రిరక్ష గొలుపఁ గను ధుర్యుడ వీకున్
గంటిర! మార్గము. గను మీ
వెంట రహించు పద్య వివరణల నికన్.

ఈ క్రింది పద్యం కంఠస్థంచేస్తే సంకేతం గుర్తుంటుందని నావిశ్వాసం.
చదవండిక క్రింద గల సీస పద్యం క్రిందఁ గల ఆట వెలది ద్వయాన్ని.

సీ:-
ఈప్సితమగు(Date) తేది నిచ్చిన దానిలో
వత్సరమ్మును ముందు పట్టవలయు.
పందొందివందలు పరిధిగా గమనించి
పై పడ్డ సంఖ్యను పట్టి, పిదప
భాగించి నాల్గుచే, భాగఫలముఁ గల్పి,
తేదీని కలిపినఁ దేలు కొంత.
మాస సంకేతమ్ముమరల దానికి కల్పి,
ఏడుచే భాగింపనేది మిగులు?
తే:-
శేష మొకటైన ఆది గా చెప్పవలయు.
రెండు మూణ్ణాల్గు ఐదారు నిండు సున్న
సోమ మంగళ బుధ గురు శుక్ర శని గ
వారమును తెల్పి వర్థిల్ల వచ్చు మనము.

ఆ:-
ఆంగ్ల తిథికి వార "మాంధ్రామృతము" మీకుఁ
జెప్పె. జనవ(JANUARY)రాది కొప్పు వరుస
నొ్కటి, నాల్గు, నాల్గు. ఒద్దికతో ఏడు,
రెండు. ఐదు, ఏడు, ఉండు, పిదప
మూడు, ఆరు, ఒకటి, ముచ్చట తో వచ్చు
నాల్గు, ఆరు, వచ్చు. నయత నొప్పు.
ఆంగ్ల మాస క్రమము నరయు పద్ధతి యిదే.
ఆర్యులార! దీని నరసి కనుడు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు రామకృష్ణా రావు గారు.మీ అమృతధారలొ " ఏ వారమొ లెఖ తెలుసుకుందాం" శీర్షిక చదివి మా ఇంటిల్లి పాదివీ పుట్టిన రోజులు సరదా గా ప్రయత్నం చేసాను. చాలా చక్కగా వచ్చాయి. ధన్య వాదములు. బాగుంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

గీ:-
నేదునూరి వారు నేర్వగ లేనిది
లేదు, లేదు, లేదు, లేదు, లేదు.
మాదు బ్లాగు చదివి మామాట మన్నించి,
మంచి మాట పలికి మనసు నింపె.

ఆర్యా! సంతోషం. ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.