గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జనవరి 2009, బుధవారం

ఈ నాటి పరిస్థితుల కానాడే అద్దం పట్టాయి మన కావ్యాలు.

మిత్ర వరులారా!
1920 వ సంవత్సరం ఇప్పటికెన్నాళ్ళ క్రితందంటారు! రమారమి తొంభై సంవత్సరాలైందికదూ.

ఆనాటి
ధర్మవరపు గోపాలాచార్యులవారు రచించిన రామదాసు నాటకంలో చూపించిన ఆ నాటి సాంఘిక దుస్థితి మనమిప్పుడు పరిశీలిస్తే మనకు మతి పోతుంది
మారింది కాలమే కాని పరిస్థితులు కావు అని మనకి అర్థమైపోతుంది.
చూడండి అతడు రచించిన ఒక పద్యం.

చ:-
కఱువొకవంక, జాతి మత కక్ష లొకానొక వంక, హత్యలున్
మరణములొక్క వంక, దయ మాలిన ధర్మ విరుద్ధ చర్యలున్,
చెఱలొకవంక, నోటికిని చేతికి కట్టడు లొక్కవంక, యి
త్తెఱగున దే శమెల్ల అతి దీన దశా వశమయ్యె నేమనన్.

ఆ నాటి సాంఘిక పరిస్థితులకా లేక ఈ నాటి సాంఘిక పరిస్థితులకా ఈ పద్యం అద్దం పడుతోంది.
ఆ నాటి కవులే కాదు ఈ నాటి కవులు కూడా ఋషులే.
నాన్ ఋషిః కురుతే కావ్యం అన్నారు కదండీ.
ఋషులు కాబట్టే త్రి కాలజ్ఞత కలిగి వారు రచించిన కావ్యాంశాలు నిత్యనూతనమై సర్వ కాలాల్లోనూ ఆదరణీయమౌతున్నాయి. వారివి వేదవాక్కులవుతున్నాయి. యదార్థమేనంటారా?

జైహింద్.
Print this post

6 comments:

Kathi Mahesh Kumar చెప్పారు...

ఈ నాటి పరిస్థితులకు ఆనాటి కావ్యాలు అద్దంపట్టడం కాదు, మన ఖర్మగాలి ఇన్నాళ్ళైనా మనం మారలేదంతే!

రాఘవ చెప్పారు...

లలిత నిగమాంత నిగమాది జలకలితవు
కర్షువుల నెలవైనట్టి ఆర్షభూమి
కేలు మోడిచి మ్రొక్కేను వేలసార్లు
భారతావని మజ్జన్మపావనివని

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చంపకమాల:-
మనమున "కత్తి" నట్లనెడు మాటలుదెల్సె, మహేషుబాబు! నా
మనమున నున్న భావమును, మాన్యుల భావన లొక్కటే యనన్
గనితి నమేయభావ మొలుకన్ విరచించిన మీదు వ్యాఖ్య. భూ
మిని గల మానవాళి కిక తృప్తిగ సత్ ప్రభ కానదొకో?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కందము:-
అగునిది నీదు కవిత్వము.
అగుపించని భావమొకటి యగుపడ జేయన్
సొగసుగ తెలిపినవిధమును
పొగడకనెట్లుండగనగు? బుధ! రాఘవుడా!

ఆత్రేయ కొండూరు చెప్పారు...

కడివెడు నీరు ధరిత్రిన
కనిపించని బాధపుడును ఇపుడును చూడగ
కవి కనులలొ తిరిగిన సుడె
కడుపునునింపిందనుటము నిజమే ఎపుడూ !!

Anil Dasari చెప్పారు...

పద్యం రాయక ముందు శతాబ్దంలో అలాగే ఉన్నాయి, మరో వందేళ్ల తర్వాతా అలాగే ఉంటాయి పరిస్థితులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.