గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జనవరి 2009, ఆదివారం

టిటిడివారికి ధన్య వాదాలు

విశాఖపట్ణంలో పూర్నా మార్కెట్ లో ఈ రోజు జరిగిన వేంకటేశ్వర మహోత్సవం అత్యద్భుతంగా ప్రజల హృదయాలను దోచుకొంది. నిజం చెప్పాలంటే మానవుడిని దుర్ మార్గానికి దూరంగా భక్తి మార్గంలోను ముక్తి మార్గంలోను నడప గలిగినది కేవలం ఇటువంటి కార్యక్రమాలే ననడంలో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, ప్రత్యక్ష ప్రసారంద్వారా ప్రజల హృదయాలలొ చిన్ముద్ర వేస్తున్న శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు. ఐతే ఒక్క విషయంలో కొన్ని అతి జాగ్రత్తలు అత్యవసరంగా నా నమ్మకం.

ఉచ్చారణలో చాలా అప్రమత్తత అవసరం.

ప్రచోదయాత్ ని ప్రచోధయాత్ అని పకితే దానినే శ్రోతలు ప్రమాణంగా శ్వీకరించే అవకాశం ఉందనుకుంటాను. ఒక్క సారి జరిగిన కార్య క్రమానంతటినీ పునః సమీక్షించుకొని దోషాలున్నాయేమోనని చూచుకొని ఒకవేళ దోషములుంటే మరొక మారు మరెక్కడా ఆ దోషాలు పునరావృతం కాకుండా చూచుకోవడంద్వార కార్యక్రమం యొక్క విలువను ద్విగుణీకృతం చేయవచ్చునని నా భావన. ఇలా చెప్పడం కేవల ఈ కార్యక్రమం బాగుంది కాబట్టి ఇంకా బాగుండడం కోసమేనని సహృదయంతో అర్థం చేసుకో గలరు.
ఒకవేళ వినికిడిలోపం వల్ల నేను తప్పుగా అర్థం చేసుకొని వుంటే క్షంతవ్యుడిని టీటీడీ కార్య క్రమాలు ప్రజలను భక్తి సాగరంలో ఓలలాడిస్తూ భక్తి ముక్తి ప్రదమై భారతావనిని పునీతంగా ఉండేలాగ చేయగలందులకు ఆ వేంకటేశ్వర స్వామి ఎల్ల వేళలా అండ దండగా నిలిచి విజయములు చేకూర్చ గలందులకు ప్రార్థిస్తున్నాను.తప్పుగా పలికి వుంటే మన్నించగలరు.

జై శ్రీమన్నారాయణ్.జైహింద్.

Print this post

5 comments:

అజ్ఞాత చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారు,

Hindu Temples ను government manage చెయుట మీద మీ అబిప్రాయము.

pseudosecular చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారు,

Thank you for the information.

"ఆ వేంకటేశ్వర స్వామి ఎల్ల వేళలా అండ దండగా నిలిచి విజయములు చేకూర్చ గలందులకు ప్రార్థిస్తున్నాను".

మీరు బాగా వ్రాసారు. కాని ఆ వేంకటేశ్వరుడు, secular non-believer's చెతిలొ ఇరుక్కున్నాడు.

What is you comment on Hindu Temples are managed by Government?

pseudosecular చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారు,

Thank you for the information.

"ఆ వేంకటేశ్వర స్వామి ఎల్ల వేళలా అండ దండగా నిలిచి విజయములు చేకూర్చ గలందులకు ప్రార్థిస్తున్నాను".

మీరు బాగా వ్రాసారు. కాని ఆ వేంకటేశ్వరుడు, secular non-believer's చెతిలొ ఇరుక్కున్నాడు.

What is you comment on
"Hindu Temples are managed and controlled by Government".

pseudosecular చెప్పారు...

చింతా రామకృష్ణారావు గారు,

Thank you for the information.

"ఆ వేంకటేశ్వర స్వామి ఎల్ల వేళలా అండ దండగా నిలిచి విజయములు చేకూర్చ గలందులకు ప్రార్థిస్తున్నాను".

మీరు బాగా వ్రాసారు. కాని ఆ వేంకటేశ్వరుడు, secular non-believer's చెతిలొ ఇరుక్కున్నాడు.

What is you comment on Hindu Temples are managed by Government?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! నమస్తే.
హిందూ దేవాలయాలను ప్రభుత్వం నిర్వహించడం నేనైతే సమర్ధించను.
మరి మీరైతే యేమంటారో?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.