గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జనవరి 2009, ఆదివారం

మేలిమి బంగారం మన సంస్కృతి 47.

స్త్రీలను గౌరవించడం కనీస మానవ ధర్మం.

ప్రకృతికి ప్రతీక అయినటువంటి స్త్రీలను గౌరవించడం కనీస మానవ ధర్మం. స్త్రీలకు మనమిచ్చే గౌరవం విషయంలో ఒక చక్కని శ్లోకముంది చూడ్డామా?

శ్లో:-
యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాః
యత్రైతాస్తు నపూజ్యంతే
సర్వాస్తత్రాఫలాక్రియాః

తే:-
ఎచట స్త్రీ గౌరవము గల్గు నచట నెపుడు
దేవతలు కొల్వు తీరును. దివ్యముగను.
ఎచట స్త్రీ గౌరవములేక నీసడింతు
రచట పనులన్ని వ్యర్థము లగును నిజము.

భావము:-
ఎచ్చట స్త్రీ గౌరవింపబడునో అచట ఎల్లప్పుడూ దేవతలు ఆనంద నాట్యం చేస్తారు.
ఎచట స్తీ గౌరవింప బడదో అచట జరిపెడి కార్యము లన్నియు వ్యర్థములే సుమా!

మనలనుకనే, మనలను పెంచే, మనతో సన్నిహితంగా ఉండే, మనల యోగ క్షేమాల్నెప్పుడూ కాంక్షించే, మనకు ప్రాణప్రదమైనట్టి, స్త్రీల పట్ల మనం గౌరవ భావమే కాదు ఆరాధనా భావాన్ని కలిగి వుందాం, సృష్టికి మూలమైన శక్తి రూపిణి ఐన స్తీ మూర్తిని నిరంతరం మన సత్ ప్రవర్తనల ద్వారా ఆనంద వాహినిలో ఓలలాడిద్దామా?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.