గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఆగస్టు 2015, శనివారం

శ్రీమద్భారతీయులకు 69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

1 comments

 జై భారత్.
శ్రీమద్భారతాంబ ముద్దుబిడ్డలైన యావన్మంది భారతీయులకు 69 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. 
సప్త వింశత్యధిక ద్వివిధ కంద గీత గర్భ చంపకమాల.
ధర నుత మాన్య సజ్ జనని భారతి నిత్యము శాంతితోడ ప్రా
గ్వర శృతమై సదా వెలుగు గావుత ప్రీతిని విశ్వమందు పూ 
జ్య రసతమున్ గనున్ జనులు సన్నుతులొందుత సత్ప్రవృత్తితో 
కరినుతుడారయన్ ఘనత గాంచుత సత్యము క్రాలు వెల్గుచున్.
జైహింద్.

రస జల వృత్తము. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా!రస జల వృత్తమును గూర్చిన శ్రీవల్లభవఝల వారి వివరణ తిలకించండి.
జైహింద్.

14, ఆగస్టు 2015, శుక్రవారం

సమవృత్తములు ఒక పరిశీలన. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ సమవృత్తములు ఒక పరిశీలనను తిలకించండి. 
జైహింద్.

13, ఆగస్టు 2015, గురువారం

శ్రీ రుద్రము తరగతులు. - 1వ రోజునుండి - 14వ రోజు వరకు.

0 comments













కృతి ఛందము ఛందము పరిశీలన. శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ ఛందోపరిశీలనను తిలకించండి.
జైహింద్.

12, ఆగస్టు 2015, బుధవారం

కృతిఛందము. ఛందము పరిశీలన. శ్రీవల్లభ.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ కృషిని పరిశీలించండి.
జైహింద్.

11, ఆగస్టు 2015, మంగళవారం

జరా రూపం హరతి ధైర్య ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. జరా రూపం హరతి ధైర్య మాశా ,
మృత్యుః ప్రాణాన్ ధర్మచర్యా మసూయా ,
కామో హ్రియం వృత్త మనార్యసేవా ,
క్రోధః శ్రియం సర్వ మేవాభిమానః .

గీ. ముదిమి రూపమున్, ధైర్యమున్ పోని యాశ,
ప్రాణమున్ మృత్యు వసూయ వర్తనమును
కల్గు కామము సిగ్గును, ఖలుల సేవ
శీలము, శ్రియమున్ గోపము,కొల్లగొట్టు,
గర్వమది సర్వమున్ బాపు కనరదేల?

భావము. ముసలితనము రూపమును , ఆశ ధైర్యమును , మృత్యువు ప్రాణములను , అసూయ ధర్మప్రవృత్తినీ , కామము లజ్జను , దుష్టసేవ శీలమును, కోపము ఐశ్వర్యమును , గర్వము సర్వమును హరించును.
జైహింద్.

10, ఆగస్టు 2015, సోమవారం

దరిద్రాయ కృతం దానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

2 comments

జైశ్రీరామ్.
శ్లో. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,
అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
క. బీదలకు దానమొసగుట,
పేద శివార్చన, యనాథ ప్రేతములకు స
మ్మోదముతో సంస్కారము
మేదినినొనరింప నశ్వ మేధ సమంబౌన్.
భావము. బీదవానికి దానము చేయుట, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనము చేయుట, యీ మూడున్ను అశ్వమేధముతో సమమైన ఫలమునిచ్చును.
జైహింద్.

9, ఆగస్టు 2015, ఆదివారం

ఆయుర్విత్తం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

1 comments

జైశ్రీరామ్.
శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం , మంత్రమౌషధసంగమౌ , 
దానమానావమానాశ్చ , నవ గోప్యా మనీషిభిః. 
ఆ.వె. వయసు, ధనములింట బాధించు గొడవలు                                                                                     
మంత్ర యౌషధములు, మాన, దాన
సంగమములు, మనల కృంగించు యవమాన
ములను పరుల కెపుడు తెలుప రాదు.
భావము. ఆయువు , సంపద , గృహచ్ఛిద్రము , మంత్రము , ఔషధము , సంగమము , దానము , మానము ,
అవమానము - ఈ తొమ్మిదింటినీ బుద్ధిమంతులు రహస్యముగ నుంచవలెను.
జైహింద్.

8, ఆగస్టు 2015, శనివారం

అనుష్టుప్ ... శ్రీవల్లభ పరిశోధన.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల కవి చేసిన అనిష్టుప్ పై కృషిని తిలకించండి.

జైహింద్.

7, ఆగస్టు 2015, శుక్రవారం

ఛందోత్పత్తి...సమవృత్తములు. శ్రీ వల్లభ.

2 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభవఝల అప్పలనరసింహ మూర్తి కవి చేసిన ఛందోత్పత్తి సమవృత్తములకు సంబంధించిన కృషిని తిలకించండి.
జైహింద్.

6, ఆగస్టు 2015, గురువారం

తార్నాకలో శ్రీమాన్ జెజ్జెల కృష్ణ మోహనరావుగారిఉపన్యాసం అద్భుతం.

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! తే.01-08-2015 న సాయంత్రం 4 గంటలనుండి 6 గంటల వరకు తార్నాకలోని మీ సేవ ప్రక్కనున్న ప్లెడ్డింగ్ లైట్స్ సంస్థలో మన ప్రియ మిత్రులు అమెరికా వాస్తవ్యులు సుప్రసిద్ధ ఛందశ్శాస్త్రార్ణవసదృశులు అయిన శ్రీమాన్ జెజ్జెల కృష్ణ మోహన్ గారు ఛందశ్శాస్త్రంపై అద్భుతమైన వివరణాత్మక ఉపన్యాసం ఇచ్చారు. ఆ సభకు అనేకులు ఛందశ్శాస్త్రాభిలాషులు వచ్చారు.
వారి ఉపన్యాసం శ్రోతలలో నూతనోత్సాహం పుట్టించి ఛందశ్శాస్త్రాభిరుచి పెంచింది.
వారి ఉపన్యాసానికి ప్రతిస్పందిస్తూ నేను వారినుద్దేశించి కంద గీత గర్భ చంపకమాలను అప్పటికప్పుడు వ్రాసి సభాముఖంగా వారికి వినిపించి నా ఆనందాన్ని తెలియజేశాను. వారు ఎంతగానో సంతోషించారు.
కంద గీత గర్భ చంపకమాల
గుణ గణ పద్ధత్తుల్ కలుగు గుంభన ఛందము, గాన రీతి, భా
వన నియతుల్, మదిన్ నిలిపి వర్ధిలఁ జేసిరి నేర్పు తోడ. స
ద్గుణ గణ ధీరుఁడా! ప్రబల కల్పన మీదగు ప్రాభవంబులన్
కననగునేమహా కవిగ గాంచెద మిమ్ముల గణ్య మూర్తిరో!
చంపక గర్భస్థ కందము
గణ పద్ధత్తుల్, కలుగు గుం
భన ఛందము, గాన రీతి, భావన నియతుల్,
గణ ధీరుఁడా! ప్రబల క
ల్పన. మీదగు ప్రాభవంబులన్కననగునే.
చంపక గర్భస్థ గీతము.
కలుగు గుంభన ఛందము,గాన రీతి,
నిలిపి వర్ధిలఁ జేసిరి నేర్పు తోడ.
ప్రబల కల్పన మీదగు ప్రాభవంబు.
కవిగ గాంచెద మిమ్ముల గణ్య మూర్తి
జైహింద్.

5, ఆగస్టు 2015, బుధవారం

కాంతా తోటక వృత్త మిశ్రిత మనోహర వృత్తద్వయము.రచన శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత కాంతా తోటక వృత్త మిశ్రిత మనోహర వృత్తద్వయము తిలకించండి.
జైహింద్.

4, ఆగస్టు 2015, మంగళవారం

శ్రీ కృష్ణ దేవరాయలు వారి 506 వ పట్టాభిషేక దినోత్సవానికి స్వాగతం

3 comments

                                                                                                       జైశ్రీరామ్.
ప్రియ సాహితీ బంధువులారా! శుభమస్తు.
తేదీ 07 - 08 - 2015 న 
సాహితీ సమరాంగణా సార్వభౌముఁడు శ్రీకృష్ణ దేవరాయలవారి 
506 వ పట్టాభిషేక దినోత్సవమును
 శ్రీ  గుత్తి(జోళదరాశి) చంద్రశేఖర రెడ్డిగారి స్వగృహమున
 సాయంత్రం 4 గంటలకు
జరిపించ తలపెట్టినారు.
ఈ కార్యక్రమమున తెలుగు, సంస్కృత, కన్నడ, తమిళ సాహితీవేత్తలుపాల్గొనుచున్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సాహితీ సౌరభాన్ని ఆఘ్రాణించగలిన, వారికృషిని ప్రశంసించుచు పరిశ్రమించిన ఎనిమిది మందికి అష్ట దిగ్గజముల పేర సత్కారములను కూడ అందింప నున్నారు.
కార్యక్రమము జరుగు చిఱునామా:-
శ్రీ గుత్తి (జోలదరాశి)చంద్రశేఖర రెడ్డి,
15, మొదటి దశ. (1St Phase)
జయప్రకాశ నారాయణ్ నగర్,
వయా మియాపూర్,
హైదరాబాదు,
500 049.
దూర వాణి. 9177945559.
ఈ సందర్భముగా
సాహితీ ప్రియులందరికీ ఇదే మా ఆహ్వానం.
బ్లాగ్ మిత్రులందరూ తప్పక విచ్చేసి కార్యక్రమమును జయప్రదము చేయ వలసినదిగా కోరు చున్నాను.
జై హింద్.

3, ఆగస్టు 2015, సోమవారం

గోమూత్రికాబంధ హంసయాన శివ స్తుతి. రచన శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత గోమూత్రికాబంధ హంసయాన శివ స్తుతి తిలకించండి.
జైహింద్.

2, ఆగస్టు 2015, ఆదివారం

బింబ సుకాంతి గర్భ ఉత్పలమాల. రచన శ్రీవల్లభ.

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝలకవి కృత బింబ సుకాంతి గర్భ ఉత్పలమాల తిలకించండి.
జైహింద్.

1, ఆగస్టు 2015, శనివారం

భిన్న భావానులోమ కందద్వయ గోమూత్రికా బంధము. రచన శ్రీవల్లభ.

4 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కవి కృత భిన్న భావానులోమ కందద్వయ గోమూత్రికా బంధము తిలకించండి.
జైహింద్.

31, జులై 2015, శుక్రవారం

గురుపూర్ణిమ సందర్భముగా పాఠకాళికి శుభాకాంక్షలు.

1 comments

జైశ్రీరామ్.
శ్రీ గురుభ్యోనమః.
శ్రీ గురుదత్త.
ఆర్యులారా! పరమ విశిష్టమైన గురు పూర్ణిమ నేడే. సద్గురుదేవుల శుభాశీః పరంపర మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
నారాయణ సమారంభామ్  -  వ్యాస శంకర మధ్యమామ్.
అస్మదాచార్య పర్యంతమ్  -  వందే గురు పరంపరామ్.
నారాయణుడాదిగ గురు
పారావారమున మధ్య వ్యాసుండును, గం
భీరవచశ్శంకరుడును,
ధారుణి నా గురులను మది తలచి నుతింతున్. 
జైహింద్.