గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, ఆగస్టు 2015, సోమవారం

దరిద్రాయ కృతం దానం ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం,
అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధసమం విదుః .
క. బీదలకు దానమొసగుట,
పేద శివార్చన, యనాథ ప్రేతములకు స
మ్మోదముతో సంస్కారము
మేదినినొనరింప నశ్వ మేధ సమంబౌన్.
భావము. బీదవానికి దానము చేయుట, పాడుపడిన గుడిలోని లింగమును పూజించుట, దిక్కులేని శవమును దహనము చేయుట, యీ మూడున్ను అశ్వమేధముతో సమమైన ఫలమునిచ్చును.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మేలి ముత్యము వంటి శ్లోకము ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.