జైశ్రీరామ్.
26, మార్చి 2025, బుధవారం
751 - 760 లలిత
0
comments
చమత్కార ప్రార్థన. మామకు మామయైన పరమాత్ముఁడు మాకు బ్రసన్నుఁడయ్యెడున్. సమర్పణ శ్రీ వైద్యంవారు.
0
comments
జైశ్రీరామ్.
చమత్కార ప్రార్థన.
ఉ. మామను సంహరించి, యొకమామకు గర్వమడంచి, యన్ని శా
మామను రాజుజేసి, యొకమామతనూజునకాత్మబంధువై
మామకుగన్నులిచ్చి, సుతుమన్మథుపత్నికి దానె మామయై
మామకు మామయైన పరమాత్ముడు మాకు బ్రసన్ను డయ్యెడున్.
ఇందులో 8 మంది మామలున్నారు.
1. కంసుడనే మామను చంపి,
2.సముద్రుడనే మామకు గర్వమణచి(రామావతారంలో)
3. చందమామను రాత్రికి రాజును చేసి (నానార్థాలలో రాజు అంటే చంద్రుడు అని ఒక అర్థం)
4. ఒకమామకొడుక్కు(అర్జునునికి) ఆత్మబంధవై,
5. ఒకమామకు కన్నులిచ్చి(రాయబారంలో ధృతరాష్ట్రునికి)
6. రతీదేవికి తానే మామయై,
7. సముద్రుడు విష్ణువుకు మామ,
8.ఈయనకు గంగను ఇచ్చినందున మామకు మామయైనాడు,
అటువంటి విష్ణువు ప్రసన్నుడై మాకు అనుగ్రహం కలిగించుగాక.
జైహింద్.
మా అమ్మగారు 90 ఏళ్ళవయసులో పాడిన పాటలు.
0
comments
741 నుండి 750 లలిత...
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
726 నుండి 740 లలిత...
0
comments
జైశ్రీరామ్.
జైహింద్.
కన్దుకో భిత్తినిక్షిప్త . ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. కన్దుకో భిత్తినిక్షిప్త - ఇవ ప్రతిఫలన్ముహుః|
ఆపతత్యాత్మని ప్రాయో - దోషోఽన్యస్య చికీర్షతః|| (కథా సరిత్సాగరం)
తే.గీ. బంతి గోడకు కొట్టిన వచ్చు తిరిగి,
యటులె మనమితరులకును హాని చేయ
మనకె యాహాని కలుగును, మరువఁబోకు,
జ్ఞానహీనతన్ వరలకు గర్వమునను.
భావము. గోడకు కొట్టిన బంతి వెంటనే వేసిన చోటకే తిరిగి వచ్చినట్టు, ఇతరులకు
చెడు చేద్దామని ప్రయత్నిస్తే, ఆ చెడు మనకే జరుగుతుంది. కావున
ఇతరులకు చెడు తలపెట్టకూడదు.
జైహింద్.
25, మార్చి 2025, మంగళవారం
711 నుండి 725 వరకు లలిత...
0
comments
జైశ్రీరామ్.
679 వ లలితా నామ పద్యగానము.Lalitha Sahasra Namalu -2 | Chintha Ramakrishna Rao | Kumara Suryanaraya...
0
comments
24, మార్చి 2025, సోమవారం
మా SRVD ఎలైట్ సమూహ సభ్యులు.
0
comments
జైశ్రీరామ్.
SRVD ఎలైట్ సమూహ సభ్యులు.
మొదటి వరుసలో మనకు ఎడమ నుండి కుడికి కూర్చున్న వారి పేర్లు.
శ్రీయుతులు
1. ఏ.ఆర్.హెచ్.ప్రసాద్ 2. యస్. సుభాష్ చంద్రబోస్.
3. సుబ్బారావు. 4. యం.సతీష్
5. పీ.నరహరిరావు 6. చింతా రామకృష్ణారావు.
రెండవ వరుసలో మనకు ఎడమ నుండి కుడికి కూర్చున్న వారి పేర్లు.
శ్రీయుతులు
1. బీ. రాములు 2. కోటయ్య. 3. ఆర్. జాన్సన్.
4. జీ.వాసుదేవరావు. 5. కే.ఎం.రమేశ్ బాబు
మూడవ వరుసలో మనకు ఎడమ నుండి కుడికి నించున్న వారి పేర్లు.
శ్రీయుతులు
1. జీ.రామకృష్ణ. 2. పీ.మురళీమోహనరావు. 3. ప్రవీణ్ (అతిథి)
4. మురళీధర్ రెడ్డి. 5. కే.జే.రెడ్డి.
6. అశోక్ కుమార్. 7. ప్రమోద్ జోషి. 8. ఎన్.వీ.శరభరాజు.
9. జీ.విజయకుమార్. 10. టీ.రామకృష్ణ.
11. సీ.మదన్ మోహన్. 12. కే.శ్రీనివాసరావు.
13. బీ.వీ.నారాయణ. 14. కే.విజయకుమార్.
వీరే కాక మా మిత్రులు ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు.. శ్రీ బీ జనార్దన్ గారు
గ్రామాంతరం లోయున్నందున ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ఉ. వీరి యమోఘ ప్రేమ నను వీరికి మధ్యను నిల్పె గొప్పగా,
నారసి నాకవిత్వముననంత మహత్ కవికల్పభూజ యన్
తీరయినట్టిదౌ బిరుదు తృప్తిగ నిచ్చిరి పొంగిపోవుచున్,
వీరలకేను వందనము ప్రీతిగ చేయుచు పొంగుచుంటినే.
జైహింద్.
శ్రీ కడయింటి కృష్ణమూర్తిగారు కారణంగా వెలసిన 12రామాయణాలు చక్కగా ఒక్కసారే ఆవిష్కరింపఁజేసిన ప్రజ - పద్యం సమూహ నిర్వాహకులు.
0
comments
జైశ్రీరామ్.
కుమారస్వామి ప్రభవాభివర్ణనము. శ్రీ క్రొవ్విడి వేంకట రాజారావు.
0
comments
ఉగాది రోజున చేయాల్సిన 7 ముఖ్యమైన పనులు #Hindudharmakshetram #SantoshGhan...
0
comments
అనభ్యాసే విషం శాస్త్రమ్ ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అనభ్యాసే విషం శాస్త్ర మజీర్ణే భోజనం విషమ్ ।
మూర్ఖస్య చ విషం గోష్ఠీ వృద్ధస్య తరుణీ విషమ్ ॥
తే.గీ. విద్య విషమిల నభ్యాసవిహితునకును,
అగ్నిమాంద్యునకన్నమే యగును విషము,
మూర్ఖునకు గోష్టి విషమిలన్ బూజ్యులార!
యువతి విషమగు ముదిమికి నోపలేక.
భావము. అభ్యసము చేయని వానికి శాస్త్రము విషతుల్యము. అజీర్ణముగా
ఉన్నవానికి భోజనం విషతుల్యము. మూర్ఖునికి విద్యాగోష్ఠి విషతుల్యము.
ముసలివానికి యువతి విషతుల్యము.
జైహింద్.
అమృతం సద్గుణా భార్యా ... మేలిమిబంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. అమృతం సద్గుణా భార్యా - అమృతం బాలభాషితం
అమృతం రాజసమ్మానం - అమృతం మానభోజనమ్.
తే.గీ. భార్య గుణవతి యమృతంబు భర్తకెపుడు,
బాలభాషణమృతంబు పద్మనాభ!
రాజ సన్మానమమృతంబు పూజ్యులకును,
పరిమితాహారమమృతము భక్తవరద!
భావము. మంచిగుణం గలదైన భార్య అమృతం వంటిది. చిన్నపిల్లల
ముద్దుమాటలు అమృతసమాన మైనవి. రాజు వల్ల గౌరవం పొందడం
అమృతంతో సమానం. కొలత ప్రకారం పరిమితంగా చేసే భోజనం
అమృతం వంటిది.
జైహింద్.
ఆశ్రుతస్య ప్రదానేన ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. ఆశ్రుతస్య ప్రదానేన - దత్తస్య హరణేన చ।
జన్మప్రభృతి యద్ దత్తం - తత్ సర్వం తు వినశ్యతి॥
తే.గీ. ఇచ్చెదనటంచు చెప్పియు నీయకున్న,
నిచ్చినది లాగుకొన్నను, నిహమునందు
పూర్వందున చేసిన పుణ్యమెల్ల
గ్రహియించు నరుఁడ! నీవు.
భావము. "ఇస్తాను" అని చెప్పిన వస్తువును దానం చేయకపోవడంచేత, ఇచ్చిన
దానాన్ని తిరిగి తీసుకోవడంచేత జన్మించిన నాటినుండి చేసిన దానాల ఫలితం
అంతా నశిస్తుంది.
జైహింద్.
23, మార్చి 2025, ఆదివారం
యయోరేవ సమం విత్తం - ... మేలిమి బంగారం మన సంస్కృతి.
0
comments
జైశ్రీరామ్.
శ్లో. యయోరేవ సమం విత్తం - యయోరేవ సమం శ్రుతం |
తయోర్వివాహః సఖ్యం చ - న తు పుష్టవిపుష్టయోః || (మహాభారతం)
తే.గీ. ధనము విద్యయు సమముగా ధరణిఁ గలుగు
వారి మధ్యనే స్నేహ వివాహములును,
హెచ్చు తగ్గులు గలవారికెన్నటికిని
శ్రేయముగనొప్పఁబోవవి శ్రీనృసింహ!
భావము. ఎవరికి ధనం మరియు విద్య సమానంగా ఉన్నాయో, వారి మధ్య
మాత్రమే వివాహం మరియు స్నేహం ఉత్తమం. హెచ్చుతగ్గులు ఉన్నవారిలో
ఇది శ్రేయస్కరం కాదు.
జైహింద్.
22, మార్చి 2025, శనివారం
చిన్న జీయర్ స్వామి అసత్య ప్రచారం! ప్రశ్నించిన హిందూ ధర్మ రక్షా సమితి.
0
comments
అనవద్య,పనిగొను,మనసా,వచసా.అమేయ,వాదన,మాథురి,దశదిశ,వ్యాపక.మలుపు,పలికించు,సతతము,వరదమము,అలవాటు,గర్భ"-తొలికిస లాడు,"-వృత్తము,రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి,
0
comments
జైశ్రీరామ్.
అనవద్యము పద్యమునే!ఆదరమున గొల్వగన్! అలవాటయె!చిన నాటన్!

వ్రాసినది


.jpeg)







