గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, అక్టోబర్ 2024, మంగళవారం

వేదాః త్యాగశ్చ యజ్ఞాశ్చ.... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  వేదాః త్యాగశ్చ యజ్ఞాశ్చ - నియమాశ్చ తపాంసి చ |

న విప్రదుష్టభావస్య - సిద్ధిం గచ్ఛంతి కర్హిచిత్ ||

(మనుస్మృతి)

తే.గీ.  వేదములు, త్యాగ యజ్ఞముల్,వినుత నియమ

ములను చేసెడి వ్రత తపములును మనకు

నింద్రియేచ్ఛలన్, చెడు కోర్కెలిలను తీర్చ

జాల వాత్మసుజ్ఞానంబు వరలనిచ్చు.

భావము.  వేదాధ్యయనము, దానము, యజ్ఞములు, నియమాలతో కూడిన 

వ్రతాలూ-పూజలు, తపస్సు - ఇవి  ఇంద్రియసుఖాలలో ఆసక్తిగలవారికి

 అలాగే చెడు భావనలున్నవారికి ఎట్టి సంసిద్ధిని ఎచ్చటనూ కలిగింపజాలవు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.