భోజ కాళిదాసుల అన్యోన్యత.
ఆనాటి కవిపండితులలో ఎవరో ఒకరు భోజరాజునకు కాళిదాసు
చేపలు తింటాడన్న భ్రమ వారిలో కలిగించినాడు. అది విషయానికి
కమ్మలు కడియాలు తొడిగి రాజుకు చేరవేసినారు.
రాజు కాళీదాసును పరిక్షించేరోజు రానే వచ్చింది. భోజుడు మస్త్య విక్రయ
వీధి గుండా వచ్చే! గమనించినాడు..చంకలో వస్త్రములో చుట్ట బడిన నది
చేపయా అన్న విధముగా నీచు నీళ్ళు భూమిపై జారుతూ, పంచె వచ్చినట్లు
కనిపించుతూ వుండుట గమనించినాడు. కాళీదాసును తనవద్దకు పిలిపించినా
పండితుడు మరియు కవిఅయినందువల్ల తన సంభాషణ శ్లోకరూపములో
మొదలుపెట్టినాడు భోజమహారాజు. ఈ చాటువు సంవాద రూపములో జరుగుతుంది.
అంటే ప్రశ్న ఉత్తర రూపములో!
శ్లో. "కక్షే కిం తవ? పుస్తకం; కిముదకం? కావ్యార్థ సారోదకం;
గంధః కిం? నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః |
పుచ్చః కిం? నను తాళపత్ర లిఖితం; కిం పుస్తకం భో కవే?
రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం ||"
ఆ సంభాషణా సారాంశమిది:
భోజుడు: (కక్షే కిం తవ?) నీ చంకలోని దేమిటి?
కాళిదాసు: పుస్తకం.
భోజుడు: (కిముదకం?) నీళ్ళేమిటి?
కాళిదాసు: (కావ్యార్థ సారోదకం): : కావ్యార్ద సారపు ద్రవ, అనగా నీటి, రూపము,
భోజుడు: (గంధః కిం?) కంపేమిటి?
కాళిదాసు: (నను రామరావణ మహాసంగ్రామ రంగోద్భవః) రామరావణ యుద్ధంలో
చచ్చిన పీనుగుల కంపు.
భోజుడు: (పుచ్చః కిం?) తోక ఏమిటి?
కాళిదాసు: (నను తాళపత్ర లిఖితం) ఇంకా తోకలు తుంచని వ్రాయబడిన
తాళ పత్రములు.
భోజుడు: (కిం పుస్తకం భో కవే?) ఓ కవీ! ఏమిటా పుస్తకము?
కాళిదాసు: (రాజన్, భూమిసురైశ్చ సేవిత మిదం రామాయణం పుస్తకం)
ఓ రాజా! ఇది భూసురులు అంటే బ్రాహ్మలు సేవించే అంటే భక్తిప్రపత్తులతో
గౌరవించే రామాయణ గ్రంధము.
క్షణ కాలము అవాక్కయిన భోజుడు చూపించమంటే కాళిదాసు. నిజంగానే
చేప గా భ్రమింప జేసిన రామాయణ గ్రంథము చూపించినాడు.
అదీ కాళీదాసంటే!
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.