గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, అక్టోబర్ 2024, సోమవారం

గురురగ్నిర్ద్విజానీనాం, .. మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  గురురగ్నిర్ద్విజానీనాం, - వర్ణానాం బ్రాహ్మణో గురుః,

పతిరేవ గురుస్త్రీణాం, - సర్వస్యాభ్యాగతోగురుః. 

తే.గీ. బ్రాహ్మణుల కగ్ని గురువు, పరంబుఁ గొలుపు,

వర్ణములకెల్ల గురువు సత్ బ్రాహ్మణుండు,

సతికి గురువన పతియేను క్షితిని జూడ,

జనుల కభ్యాగతుఁడు గురువని గ్రహించు.

భావము.  బ్రాహ్మణులకు అగ్నిహోత్రమే గురువు.  అన్ని వర్ణములవారికి 

సద్బ్రాహ్మణుఁడే గురువు.  ఆడువారికి భర్తయే గురువు.  జనులందరికీ 

అభ్యాగతుఁడే గురువు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.