జైశ్రీరామ్
|| 15-11 ||
శ్లో. యతన్తో యోగినశ్చైనం పశ్యన్త్యాత్మన్యవస్థితమ్|
యతన్తోऽప్యకృతాత్మానో నైనం పశ్యన్త్యచేతసః.
తే.గీ. సాధనముచేత యోగికి సాధ్యపడును
ఆత్మలోన్నదైవంబునరయువిధము,
జ్ఞాన హీనులకునసాధ్యమౌను కనుట
సాధనముచేయుచున్నను సద్గుణాడ్య!
భావము.
సాధన చేసే యోగులు తమ ఆత్మలో ఉన్న భగవదంశను చూడకలరు.
మనస్సు పరిపక్వము కాని వారు వివేకహీనులు సరైన జ్ఞానము
లేనందువలన సాధన చేసినా చూడలేరు.
|| 15-12 ||
శ్లో. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేऽఖిలమ్|
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్.
తే.గీ. చంద్రసూర్యాగ్నులరయుచు జగతికిడెడి
తేజమంతయు నాదని ధీవరేణ్య!
తెలుసుకొనుమయ్య, నా శక్తి, దీప్తి, యుక్తి
తెలివిగా నీవు శ్రద్ధతో తెలుసుకొనుము.
భావము.
జగత్తు నంతటినీ వెలిగించే సూర్యునిలో, చంద్రునిలో, అగ్నిలో ఉన్న
తేజస్సు ఏదో అది నాదని తెలుసుకో.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.