గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, నవంబర్ 2017, సోమవారం

ప్రస్తుతము శని సంచారము. మనపై దాని ప్రభావము. .. .. .. బ్రహ్మశ్రీ కేబీయన్ శర్మ.

జై శ్రీరామ్.
ఆర్యులారా! ప్రస్తుతము శని గ్రహము ఏయే రాశులవారికి  ఏయే స్థానాలలో ఉన్నదో ఆ విధంగా ఉండుటవలన కలుగు శుభాశుభములేమిటో బ్రహ్మశ్రీ కేబీయన్ శర్మగారు ఈ క్రింది విధంగా వివరించుతూ దోష పరిహారాన్ని కూడా చక్కగా సూచిచించియున్నారు.. చూచి శోభస్కర మార్గానువర్తులగుదురని ఆసించుచు, బ్రహ్మశ్రీ కేబీయన్ శర్మగారికి ధన్యవాదములు తెలియఁజేయుచున్నాను.

శని గ్రహము
తేది 26 అక్టోబర్ 2017, గురువారం నుండి  వృశ్చిక రాశి వదిలి ధనుస్సు రాశిలోకి మారుతున్నాడు. తద్వారా   మేషాది 12 రాశులవారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం.

శనీశ్వరుడు స్వతహాగా మంచివాడే. కానీ జోతిష్య శాస్త్రం ప్రకారం పాప గ్రహంగా పిలువబడుతున్నాడు.

శనికి  3 -6-11 స్థానాలు ఆయనకు  శుభ స్థానాలు.

అలాగే శనికి 1 - 2 - 4 - 7 - 8 - 12 స్థానాలు అశుభ స్థానాలు.

మన రాశి నుండి శని ఉన్న రాశికి లెక్కించగా వచ్చే సంఖ్యని బట్టి మన రాశికి శని శుభుడా లేక అశుభుడా అని తెలుసుకోవాలి.

*ఏయే రాశివారికి శని ఏయే స్థానాలలో ఉన్నాడో కింద గమనించండి*

*1 ♈ మేషం* :   *9 వ స్థానం*

*2 ♉ వృషభం* :  *8 వ స్థానం*

*3 ♊ మిధునం* : *7 వ స్థానం*

*4 ♋ కర్కాటకం* : *6 వ స్థానం*

*5 ♌ సింహం* :    *5 వ స్థానం*

*6 ♍ కన్య*      :      *4  వ స్థానం*

*7 ♎ తుల*  :    *3 వ స్థానం*

*8 ♏ వృశ్చికం*   :  *2 వ స్థానం*

*9 ♐ ధనుసు*  : *1 వ స్థానం*

*10 ♑ మకరం* : *12 వ స్థానం*

*11 ♒ కుంభం*  : *11 వ స్థానం*

*12 ♓ మీనం*  : * 10 వ స్థానం*

పై పట్టికను బట్టి  తుల కర్కాటక కుంభ రాశివారికి శని స్వర్ణ పాదంతో సంచరించడం వలన  శుభుడుగా ఉన్నాడు.                                                                                                                                     వృషభం -  మిధునం -  కన్య -  వృశ్చికం -  ధనుస్సు - మకర రాశులవారికి శని లోహ పాదంతో సంచరిస్తాడు కావున ఈ రాశుల వారికి మంచిది కాదు.
*వృశ్చికం -  ధనుస్సు - మకర రాశులవారికి ఏలినాటి శని* జరుగుతున్నది.
తక్కిన రాశులవారికి శని వలన ఎలాంటి శుభాశుభ ఫలాలు ఉండవు.

*శని బాగుగా లేనివారు ఈ కింది స్తోత్రం పారాయణం చేయడం మంచిది*

*శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)*

నమః కృష్ణాయ నీలాయ శిఖిఖండనిభాయ చ |
నమో నీలమధూకాయ నీలోత్పలనిభాయ చ || ౧ ||

నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్రుతిజటాయ చ |
నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక || ౨ ||

నమః పౌరుషగాత్రాయ స్థూలరోమాయ తే నమః |
నమో నిత్యం క్షుధార్తాయ నిత్యతృప్తాయ తే నమః || ౩ ||

నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే |
నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోఽస్తు తే || ౪ ||

నమస్తే ఘోరరూపాయ దుర్నిరీక్ష్యాయ తే నమః |
నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోఽస్తు తే || ౫ ||

సూర్యపుత్త్ర నమస్తేఽస్తు భాస్వరోభయదాయినే |
అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తు తే || ౬ ||

నమో మందగతే తుభ్యం నిష్ప్రభాయ నమోనమః |
తపసా జ్ఞానదేహాయ నిత్యయోగరతాయ చ || ౭ ||

జ్ఞాన చక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజసూనవే |
తుష్టో దదాసి రాజ్యం త్వం క్రుద్ధో హరసి తత్‍ క్షణాత్ || ౮ ||

దేవాసురమనుష్యాశ్చ సిద్ధ విద్యాధరోరగాః |
త్వయావలోకితాస్సౌరే దైన్యమాశువ్రజంతితే || ౯ ||

బ్రహ్మా శక్రోయమశ్చైవ మునయః సప్తతారకాః |
రాజ్యభ్రష్టాః పతంతీహ తవ దృష్ట్యాఽవలోకితః || ౧౦ ||

త్వయాఽవలోకితాస్తేఽపి నాశం యాంతి సమూలతః |
ప్రసాదం కురు మే సౌరే ప్రణత్వాహిత్వమర్థితః || ౧౧ ||

*శని త్రయోదశి రోజున
అలాగే
శనివారం నియమం
మరియూ
త్రయోదశి,అమావాస్య
తిధులలో
అలాగే
ప్రతిరోజు
శనీశ్వర స్వామి కి ప్రీతి గల
" తైలాభిషేకం"
శని జపం , స్వామి వారి దర్శనం
రుద్రాభిషేకం చేసుకోవడం వలన శని బాధలు తగ్గును. మంచిది*

తూ#గో , మందపల్లి గ్రామం లో గల శ్రీమందేశ్వర శనీశ్వర స్వామి వారి ఆలయ దర్శనం ,తైలాభిషేకం జరిపించుకోవడం వలన శనిగ్రహ శాంతి , శుభం కలుగును*
స్వస్తి.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బ్రమ్మశ్రీ కే.బీ.యెన్ . శర్మ గారు శనిప్రభావమును చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.