గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, నవంబర్ 2017, బుధవారం

ఈ నాటి అవధానులలో పిన్న వయస్కుఁడయిన తాతా సందీప్ శర్మ ప్రతిభను చూడఁగలరు.

  జైశ్రీరామ్.
ఆర్యులారా! 
శ్రీ వాణీ ప్రసాద లబ్ధ యైన నా సహోదరి 
ఉన్నత పాఠశాల తెలుఁగు ఉపాధ్యాయురాలు అయిన
 శ్రీమతి తాతా పార్వతి 
గారి పౌత్రుఁడు.
ఈ నాటి అవధానులలో పిన్న వయస్కుఁడు. 
చిరంజీవి తాతా శ్రీనివాస రమా సత్య సందీప్ శర్మ .MSc.,
జననము. తే.14-06-1994.
ఈ చిరంజీవి డాధూళిపాళ మహదేవమణి గారి వద్ద అవధాన విద్యనభ్యసించి ఇంత వరకు 23 అష్టావధానములు
ఒక ద్విగుణీకృత అష్టావధానౌ చేసి ఇంత చిన్న వయస్సులొనే
 తన అవధాన గురువులచే సత్కృతుఁడయ్యెను
అంతే కాదు
డా.గరికిపాటి నరసింహారావుగారు స్వయంగా సరస్వతీమాత ముద్రిక గల స్వర్నాంగుళీకాన్ని ఇతనికి అలంకరించారు.
ఇంకా
 అవధాని శ్రీ కడిమెళ్ళ ప్రసాద్ గారి చేత సత్కరించారు.
 జేసీఐ రాజమండ్రీ వారి చేత,
 నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్ ట్రష్టు వారిచేత సత్కృతులందుకొనెను.
  ప్రస్తుత 25వ అష్టావధానమును
25-11-2017న శ్రీ విరించిగారి ఇంట వారి అబ్బాయి వివాహము సందర్భముగా ఏర్పాటుచేయగా
అక్కడ నిరుపమానంగా చేసి అందరి మన్ననను పొందెను.

ఈ సభ నా సంచాలకత్వములో జరిగినది.
 సమస్యాపూరణ పృచ్ఛకులు శ్రీ మాచవో లు శ్రీధరరావు గారు
“బడియే చెఱసాల కేగు బాటను గొలుపున్ ”
అని ఈయగా
గుడి కట్టక గోపన్నయె 

వడి వడిగా పోగు జేయ వరహాలెలమిన్
జడుడగు తానీషా ఏ
ల్బడియే చెఱసాల కేగు బాటను గొలుపున్ !
అని సునాయాసంగా పూరించి తన అవధాన పటిమను చాటుకొని అందరినీ ఆశ్చర్యచకితులను చేసెను.
దత్తపది శ్రీఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఇవ్వగా  
సునాయాసంగా పూరించెను.
ఈ విధముగా ఎనమండుగురు పృచ్ఛకుల ప్రశ్నలకు చక్కగా సమధానములు చెప్పుచూ 
తన సమయ స్ఫూర్తిని కనఁబరెచెను.
ఈ అవధానము సుసంపన్నము చేసి
నిర్వాహకులైన శ్రీ విరించి గారిచే సత్కృతులందుకొనెను.
మన భాగ్యబగరమున జరుగుచున్న ప్రపంచ తెలుఁగు మహా సభలలో కూడా ఈ చిరంజీవికి సముచిత అవకాశమునివ్వఁ గలిగిరేని  అతని ప్రజ్ఞాపాటవములతో 
ప్రపంచ తెలుఁగు మహాసభకే వన్నె తేగలఁడనుటలో ఏమాత్రమూ సందేహము లేదు.
ఈ చిరంజీవి మీ అందరి ఆశీస్సులతో తన అవధానపాటవముతో ప్రపంచ భాషలలోనే మన తెలుఁగు అమోఘమైనదిగా తప్పక నిరూపించఁగలఁడు. వీనికి ఆ శారదాంబ కటాక్షం మీ అందరి ఆశీస్సులద్వారా లభింపఁ గలదని ఆశించుచున్నాను.
జైహింద్. 
Print this post

5 comments:

Unknown చెప్పారు...

శ్రీ సందీప్ శర్మ గారికి శారదాదేవి కటాక్షం కలిగి మరిన్ని అవధానములు చేయాలని కోరుకుంటూ.. వారికి అభినందన వందనములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చి.సాయిరామ్. చాలా సంతోషం నాయనా. నీకు శుభమగుగాక.

డా. ఉమాదేవి జంధ్యాల చెప్పారు...

చిరంజీవి సందీప్ శర్మ గారికి శుభాశీస్సులు .

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవధాన సరస్వ్తికి అభినందన మందారములు .

విరించి చెప్పారు...

భళి భళి అవధాన సరస్వతి అనిపించుకున్న ఈ బాలుడు....బాలుడైన నేమి జ్ఞానవృద్ధుడే........
మరో అవకాశం నాకా సరస్వతిమాత కల్పిస్తే పృచ్ఛకునిగా వారి అవధానంలో పాలుపంచుకోవాలని వుంది....

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.