గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, మార్చి 2015, శనివారం

శ్రీమన్మన్మథవత్సర ఉగాది శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
శ్రీకరులైన ఆర్యులారా! శ్రీమన్మన్మథ ఆగమన శుభవేళ సహృదయులైన మీకు సకల జీవకోటికి  
ఉగాది శుభా కాంక్షలు. 
ఆనందామృత మాధురీ గరిమతోనత్యద్భుతంబైన సు
జ్ఞానాంభోధిని తేలుడీ!  శుభ లసత్కల్యాణ సంధాయకుం
డానందావహుడైనయా హరిని మీరారాధనంబున్ మదిని
జ్ఞానంబొప్పఁగ చేయుడీ! శుభములే సర్వత్ర మిమ్మొందెడున్! 
ఈ ఆనంద మన్మథ మనందరికీ ఆనందప్రదం కావాలని మనసారా మరోమారు కోరుకొంటున్నాను.
శుభమస్తు.
జైహింద్.

Print this post

3 comments:

అజ్ఞాత చెప్పారు...

భాషాసంపద లేని పేదనగుటన్ వ్యక్తీకరింపంగ నా
తోషంబేవిధి సాధ్యమౌను సరిగా! తోడ్పాటు నీకుండినన్
భాషాదేవియె తోపజేసి పదముల్, పద్యంబునో, పాటనో!
శోషన్ బొందుటె చేయు యత్నములతో :-) స్రుక్కంగ నాగుండెయున్!
---

సంతోషమ్మిడె నన్నిఛందములునున్, సత్పాండితీ ప్రౌఢిమన్
వింతేముండును వ్రాయగర్భకవితల్ విద్వత్తు మీభాగ్యమై!
కాంతిన్, శాంతిని గోరి ప్రాణితతికిన్ గావించు సత్ప్రార్థనల్
స్వాంతంబెంతయు బొంగజేయ, ముదమున్ శార్దూలమే దూతగా :-)
చింతావారికి బంపుచుంటి నమసుల్,చేకొండు సౌహార్దమున్ /\/\/\

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

భాషా సంపద లేదు లేదనుచునే పాండిత్యమున్ జూపి, సం
తోషంబున్కలిగించినారలనఘా! దుర్వార శార్దూలముల్
భాషోద్భాగ్యము మీకు కల్గు విధమున్ బ్రత్యక్షమున్ జేసె. సత్
ప్రాసల్, సద్యతి సంపదల్ నిలిపి మీ పాండిత్యమున్ జూపిరే!

అజ్ఞాతగ మీరుండిన,
నజ్ఞాతము చేత పలుక నౌనెటులగు నో
సుజ్ఞానీ మీ పేరును
సుజ్ఞేయము చేయ తగదొ? సుజనులు తెలియన్.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా బాగున్నాయి ఒక్క మన్మధే కాదు ఇలాంటి మన్మధలు మళ్ళీ మళ్ళీ మీచేత రాయించాలని ఆ వాగ్దేవిని ప్రార్ధిస్తూ దీవించి అక్క

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.