జైశ్రీరామ్.
శ్లో. అతి కామాత్ దశగ్రీవః – అతి లోభాత్ సుయోధనః,అతి దానాత్ హతః కర్ణః, – అతి సర్వత్ర వర్జయేత్.
ఆ.వె. కామ లోభ దాన కర్మంబు లమితమై
రావణ కురుపతులు నీవి కర్ణు డిలను చంపఁబడిరి. మెలగుట మంచిది
మితిని మీరకుండ క్షితిని జనులు.
భావము. మితి మీరిన కామముచే రావణాసురుఁడును, మితి మీరిన లోభ గుణముచే సుయోధనుఁడును, మితిమీరిన దానగుణముచే కర్ణుఁడును భూమిపై చంపఁ బడిరి. కావున ఏ విషయములోనూ మితి మీరి ప్రవర్తించుట మంచిది కాదు.
జైహింద్.
2 comments:
చక్కని ఉపదేశమందించారు!చింతా వారూ!అభినందనలు!
నమస్కారములు
అవును ఏదీ అతిగా పనికి రాదు .మంచి విషయాలను అందించారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.