జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ వల్లభవఝల కృత పేటికాముఖ బంధ కందము తిలకించండి.
కం. తళ తళ మెరిసెడి మెరుపుల
తళ తళ లకు మురియదగునె తళతళలేలన్
తళ తళలు నిజములౌనే
భళెరా నిజభక్తి తళుకు భవబంధములన్
భావము : తళ తళ మెరిసెడి మెరుపుల తళతళలకు మురియవచ్చునా మురియరాదు . తళ తళ లెందులకు? తళ తళలు నిజములుకావు. భక్తి తళుకు మాత్రము భళె యనిపించుకొని భవబంధములకు దూరము చేయును. అనగా మోక్షమును ప్రసాదించును.
జైహింద్.
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.