గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, మార్చి 2015, ఆదివారం

శివుని దర్శనమునకు ముందు చేయ వలసిన నందీశ్వర ప్రార్థన. మేలిమి బంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.
శ్లో. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక 
మహాదేవస్య సేవార్ధం అనుజ్ఞాం దాతుమర్హసి.
గీ. భవునికానందమును గూర్చువాఁడ! నీకు
వందనము సేతు గొనుమయ్య నంది దేవ!
శివుని దర్శనమిట నేను చేయనుంటి.
అనుమతించుమ! స్వామికి వినుతి చేసి.
భావము:- భక్తవత్సలుడవైన, సాంబశివునికి, ఆనందప్రదుడవైన ఓ నందీశ్వరా! నీకు నమస్కారము. 
ఆ మహాదేవుని సేవించుట కొఱకు నాకు అనుజ్ఞ ప్రసాదించుము.
జైహింద్.
Print this post

5 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అసలు నందీశ్వరుని ముందుగా ప్రార్ధించా లన్నసంగతి తెలియదు .చాలా బాగుంది నిజంగా మన సంస్కృతి మేలిమి బంగారమె .ధన్య వాదములు

అజ్ఞాత చెప్పారు...

ధన్యవాదాలు

M.KSHEMANATH చెప్పారు...

Chala Baga artham itudi,

అజ్ఞాత చెప్పారు...

నందీశ్వరుని ప్రార్ధన చక్కగా వివరించి నదులకు ధన్యవాదములు
anjineyulubasr@gmail.com

అజ్ఞాత చెప్పారు...

చాలా మంది పండితులకు కూడా ఈ శ్లోకం రాదు....డైరెక్ట్ శివాభిషేకం చేస్తారు.కానీ చక్కగా వివరించారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.