గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, మార్చి 2015, గురువారం

అనిర్వేదః శ్రియో మూల ... మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. అనిర్వేదః శ్రియో మూలమనిర్వేదః పరం సుఖమ్,
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః.
క. ఉత్సాహమె శ్రేయస్కర
ముత్సాహమె సుఖము గన మహోత్కృష్టంబు
న్నుత్సాహమె నడుపు మనల
నుత్సాహము వీడవలవ రుత్తమపురుషుల్.
భావము. అనిర్వేదమే శ్రేయస్సుకి మూలం, పరమ సుఖం. అనిర్వేదమే మానవుణ్ణి  అన్ని కార్యములలోను ముందుకు నడిపిస్తుంది. అనిర్వేదమే అన్నింటిని సఫలం చేస్తుంది.
(నిర్వేదము అనే పదమునకు వ్యతిరేకపదము అనిర్వేదము. నిర్వేదము లేకపోవుట అనగా ఉత్సాహముగా ఉండుట.)
ఏంత సేపటికీ సీతమ్మ జాడ తెలియలేదని స్వామి హనుమ కించిత్ నిర్వేదానికి గురి అవుతాడు. నిరుత్సాహానికి లోనవుతాడు. అంతలోనే తేరుకోని పై మాటలు అంటాడు.
జైహింద్. 
Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును ఉత్సాహము పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చును .చక్కని సందేసాన్ని అందించారు ధన్య వాదములు

nari చెప్పారు...

52 వ శ్లోకం:–

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ ||

భావం:–
మోహమనెడి ఊబినుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.
ఆధ్యాత్మిక దృష్ట్యా అవి రెండూ (నిర్వేదం,అనిర్వేదం) వ్యతిరేక పదాలు కావని అర్దమౌతున్నది.
అనిర్వేదం గమనం అయితే
నిర్వేదం గమ్యం అయి ఉందని నా అభిప్రాయము.
ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.