గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, మార్చి 2015, సోమవారం

రాళ్ళబండి కవితాప్రసాద్ కన్నుమూత.

ఓం నమశ్శివాయ.
ఈ రోజు నిజంగా దుర్దినం. తెలుగు తల్లి ముద్దుబిడ్డడైన డా.రాళ్ళబండి కవితాప్రసాద్ (ప్రసాదరాజు) దివంగతులయ్యారు.
ప్రముఖ సాహితీవేత్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతికశాఖ అధికారి రాళ్ళబండి కవితాప్రసాద్ ఆదివారం నాడు కన్నుమూశారు. వీరు సాంస్కృతిక శాఖలో పలు కీలక పదవులను నిర్వహించారు. 
సుమారు ఐదువందలకు పైగా అవధానాలను నిర్వహించిన అవధాన శేఖరుఁడు. ఎన్నడూ మాయని చిఱునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరించే మన కవితాప్రసాద్ గారు మనకు శాశ్వితంగా దూరమవడం తెలుగు జాతి మొత్తానికే తీరని లోటు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆపరమాత్మను ప్రార్థిస్తున్నాను.
అసదృశ మందహాసము, సమాదర చిత్తము, సత్కవిత్వమున్,
విసుగునెఱుంగకుండ నడిపించు వధాన విధాన తత్వమున్.
విషయ వివేకమున్, సహజ విశ్వ జనీనత వాని సొమ్ములౌ
నసదృశ రాళ్ళబండి కవి యాత్మకనంత ప్రశాంతి కల్గుతన్.  
Print this post

4 comments:

అజ్ఞాత చెప్పారు...

its really very sad to hear the demise of rallbandi gaaru. i pray god for his soul will be rest in peace.

GS Ramakrishna చెప్పారు...

శ్రీ రాళ్లభండి వారినీ, వారి సమ్మోహనమైన చిరునవ్వునీ, ఇక చూడ లేము. తెలుగు జాతికి అపార నష్టం జరిగింది. భగవదిచ్చ అలా వున్నది. హర హర మహాదేవ.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

సాహిత్య సమధికోత్సాహమ్ము వెలయించి
.......... తెలుఁగు జిలుగులనెల్ల వెలుఁగఁ జేసె
రసరమ్యభూయిష్ట లాలిత్యపదముల
.......... కవితా విలాసంపు గరిమ జూపె
నవధానవిజయమ్మునవలీల నొనరించి
.......... సూరిజనాళిసంస్తుత్యుఁడయ్యె
తిరుపతి నగరిలో తెలుఁగు మహాసభల్
.......... వైభవంబుగ జేసె ప్రథితుఁడయ్యె

తెలుఁగు సాహిత్యలోకంపు దీపమగుచు
మోముపై మందహాసంపు ముద్రవిడక
సాగుచుండెడి జ్ఞానవిశారదుండు
రాలి పోయెను కవితల రాళ్ళ బండి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ రాళ్ళ బండి వారు నిష్క్రమించడం సాహితీ ప్రపంచానికి తీరని లోటు .ప్చ్ ! ఒకదృవతార రాలి పోయింది .హృదయ పూర్వక శ్రధాంజలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.