గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, మార్చి 2015, మంగళవారం

ఉగాది కవిసమ్మేళనమునకు కవులకు ఆహ్వానం.

జైశ్రీరామ్.
ఆర్యులారా! మన్మథ ఉగాది కవిసమ్మేళన కార్యక్రమము జయప్రకాశ నారాయణ్ నగర్ లో ఈ నెల ఇరవయ్యవ తేదీ శుక్రవారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు కమ్యూనిటీ హాల్ లో జరుపుచున్నారు.
ఈ కార్యక్రమమునకు మీరందరు సకుటుంబ సపరివారముగా రావలసినదిగా ఆహ్వానిస్తున్నాము. విచ్చేసి సభను జయప్రదము చేయవలసినదిగా కోరుచున్నాము.
కవులైనవారు తమ పద్యకవితాదులతో వచ్చి ఈ కవిసమ్మేళనము కార్యక్రమములో పాల్గొని  మన్మథను స్వాగతించి, సమాజ క్షేమమును అభిలషిస్తూ తమ కావ్య గానంచేయుటకు రావలసినదిగా మనసారా ఆహ్వానిస్తున్నాము.
పాల్గొన దలవిన ఔత్సాహికులైన కవులు తమవ్యాఖ్య ద్వారా 
మీ సెల్ నెంబర్, మీ పూర్తి పేరు, చిఱునామా మీకు సంబంధించిన విద్యాదికముల వివరములు తెలియఁ జేయుచు, వీలైతే తాము రచించి, సభలో పఠించదలచిన పద్యాదులను పంప వలసినదిగా మనవి.
నేరుగా సెల్ ద్వారా నాతో మాటాడ దలచుకొనినవారు
9247238537 సెల్ నెంబరుకు కాల్ చేసి మాటాడ వచ్చును.
జైహింద్.

Print this post

5 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చాలా ఆనందముగా ఉన్నది . నాలాగ రాలేని వారికి ఈ కవిసమ్మేళనమును దిగ్విజయా నంతరం కళ్ళకు కట్టినట్లుగా శ్రీ చింతా వారు మాకందించ గలరని కోరుతూ . సెలవు

కథా మంజరి చెప్పారు...

కవి సమ్మేళనము జయ ప్రదము కావాలని మనసారా కోరు కుంటున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అన్నా! ధన్యవాదాలు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రాజేశ్వరక్కయ్యా! నమస్తే. తప్పకుండా జరిగిన కార్యక్రమ వివరాలను మనవిచేయగలను.

Prasad Cheruvu చెప్పారు...

కవి సమ్మేళనము జయ ప్రదము కావాలని మనసారా కోరు కుంటున్నాను......
కార్యక్రమమునకు తప్పక హాజరు కావాలని మనసారా కోరు కుంటున్నాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.