గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మార్చి 2013, ఆదివారం

సరిగ, పదస, సదప, గరిస అనే దత్త పదములతో రామాయణ పరముగా పూరింప మనవి

జైశ్రీరామ్.
సుజనులారా! ఈ సరిగ, పదస, సదప, గరిస అనే  దత్త పదులతో రామాయణ పరముగా మీకు నచ్చిన ఛందమున పద్యమును వ్రాయ గలరని ఆశించుచున్నాను.
నా పూరణమును వ్యాఖ్యలో చూప గలను.
జైహింద్.

Print this post

2 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

రమ్యత నొప్పగా సరిగ రామ వనాంతర వాసమున్ భరత్
సౌమ్యుని కోశలేశ పద సత్కృతు జేయగ కోరి కైక తద్
రమ్యత గోల్పడన్ సదపరాధిగ చేసెనుకోశలాధిపున్.
సౌమ్యుఁడు రాముడా నగరి సర్వుల వీడి వనాళి కేగెనే!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సరిగ రాముడు వనముల కరుగు నపుడు
నీఁగ దుఖించు దశరధుని పదసన్ని
ధిని సదప గతి మన్నించ మనెడు గతిని
ధవుని వేడుచు నగరి సదనము వీడె !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.