గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, మార్చి 2013, గురువారం

తే.31-3-2013 న సాయంత్రం6గం.నుండి9గం.వరకు శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం కార్యక్రమం జరుగబోతోంది.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులారా!
శ్రీ శాకంబరి అంతర్జాల అవధానం
భారతీయ కాలమానం ప్రకారం 31st  March 2013    సాయంత్రం ఆరుగంటలనుండి రాత్రి తొమ్మిదివరకు
పూర్తి వివరాలు ఎల్లుండి విడుదల చేయబడతాయి...
అవధాని:-  డా . మాడుగుల అనిల్ కుమార్ గారు, ఎం .ఎ ; బి.ఎడ్ ;  పీహెచ్ .డి.
( సంస్కృతోపన్యాసకులు శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల తిరుపతి )
ఈ కార్యక్రమమును చేపట్టినవారు మాలిక (అంతర్జాల) పత్రిక యాజమాన్యం.( జ్యోతి గారు)
అధ్యక్షులు - సంచాలకులు  నేనే నిర్వహిస్తున్నాను.
పృచ్ఛకులు.
1. నిషేధాక్షరి :-          : నేనే నిర్వహిస్తున్నాను. 
2. నిషిద్ధాక్షరి        : శ్రీ ముక్కు రాఘవ కిరణ్ 
3. దత్తపది 1         శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి      
4. దత్తపది 2        :  శ్రీ కొరిడె విశ్వనాథ శర్మ 
5. సమస్య 1         శ్రీ యం.నాగగురునాథశర్మ
6. సమస్య 2         శ్రీ నారుమంచి వెంకట అనంతకృష్ణ 
7. వర్ణన             శ్రీమతి వలబోజు జ్యోతి
8.అప్రస్తుత ప్రసంగం   :శ్రీ నల్లాన్ చక్రవర్తుల కిరణ్ 
ఈ కార్యక్రమమును అంతర్ జాలము ద్వారా ప్రత్యక్షముగా తిలకించనెంచినవారు.
మరో ముఖ్యమైన విషయం: ఈ అవధాన కార్యక్రమాన్ని ఆస్వాదించి, ఆనందించాలనుకునే వారికోసం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. అది మాలిక  పత్రికలో రేపు సాయంత్రం ఆరునుండి మొదలవుతుంది. తప్పుకుండా చూడండి మరి..  ప్రతీ ఐదు నిమిషాలకోసారి ఈ పేజిన్ Refresh / Reload చేస్తుండాలి. ఈ ప్రత్యక్షప్రసార బాధ్యతలు నిర్వహిస్తున్నది భరద్వాజ్ వెలమకన్ని..
మాలిక పత్రిక : http://magazine.maalika.org .
ఇంకా ఏమైనా సందేహాలుంటే జ్యోతిగారికి jyothivalaboju@gmail.com కు మెయిల్ చేసి వివరములు తెలుసుకొన వచ్చును.
నమస్తే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.