గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, మార్చి 2013, బుధవారం

నేడు హోలీ మరియు ప్రపంచ రంగస్థల దినోత్సవము .

జైశ్రీరామ్.
నేడు హోలీ సందర్భముగా యావజ్జనానీకానికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు.
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవము.  సందర్భముగా రంగస్థలకళాకారులెల్లరికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. అనేక విధాలగా నవరసాలతో అలరింప చేసే మన రంగస్థల ప్రదర్శనలు కొన్ని మచ్చు తునకకు ఇక్కడ పొందుపరిచాను తిలకించండి.
రంగస్థలం అన్నది మానవుని నిజ జీవితానికి అద్దంపట్టే ప్రత్యక్ష ప్రదర్శనా స్థలము. రంగస్థల కళాకారులు నిజ జీవితములోని తమ అనుభవములను జోడించి, తమ నటనా కౌశలమును చూపుతూ, చక్కని ఆహార్యముతో, రసాత్మకమైన వాక్యములతో, తాదాత్మ్యత పొందుచు, నవరస భరితంగా ప్రదర్శించి ప్రేక్షకుల మదులను తమవైపునకే మళ్ళించుకొని,  రసానుభూతితో వారు ఆర్ద్రమనస్కులయేలాగ చేసే మాంత్రికులుగా మనకు తోచుదురు.అట్టి మహోన్నత కళాస్వరూపులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు, ఆ రంగంలో శ్రమించే అందరికీ, ముఖ్యంగా ఆ రంగస్థల కార్య కలాపములకు ప్రోత్సాహమిస్తూ వెన్నుదన్నుగా నిలిచే ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భముగా నా హృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను.
శుభమస్తు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగున్నాయి .
రంగస్తల నటుల నాటికలు ,బిచ్చగాడు, శెట్టిగారు , మున్నగునవి బాగున్నాయి. మాకందించిన చింతావారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.