శివుడూ కరుణించీనాడోయమ్మా!
కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా!
కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా!
1. శివశివ యని నే భక్తిగ పిలువగ శివశివ యని నే భక్తిగ పిలువగ
శివశివ యని నే భక్తిగ పిలువగ శివశివ యని నే భక్తిగ పిలువగ
శీఘ్రమ్ముగ నామదిలోవెలుగుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.

2. శివరాత్రికి నే జాగరముండగ శివరాత్రికి నే జాగరముండగ
శివరాత్రికి నే జాగరముండగ శివరాత్రికి నే జాగరముండగ
ఆత్మలింగముగ అమరుచు మదిలో శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
శివరాత్రికి నే జాగరముండగ శివరాత్రికి నే జాగరముండగ
ఆత్మలింగముగ అమరుచు మదిలో శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
3. ఉపవసించి నే తపసును చేయగ ఉపవసించి నే తపమును చేయగ
ఉపవసించి నే తపసును చేయగ ఉపవసించి నే తపమును చేయగ
సపరివారముగ మదిలో వెలుగుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
ఉపవసించి నే తపసును చేయగ ఉపవసించి నే తపమును చేయగ
సపరివారముగ మదిలో వెలుగుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
4. భక్తులతో శివ భజనలు చేయగ భక్తులతో శివ భజనలు చేయగ
భక్తులతో శివ భజనలు చేయగ భక్తులతో శివ భజనలు చేయగ
ముక్తినొసంగగ ముందుకు వచ్చుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
భక్తులతో శివ భజనలు చేయగ భక్తులతో శివ భజనలు చేయగ
ముక్తినొసంగగ ముందుకు వచ్చుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
5. శివ లింగము దరి జ్యోతి నుంచగా శివలింగము దరి జ్యోతి నుంచగా
శివ లింగము దరి జ్యోతి నుంచగా శివలింగము దరి జ్యోతి నుంచగా
జ్యోతిర్లింగము మదిలో గొలుపుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
శివ లింగము దరి జ్యోతి నుంచగా శివలింగము దరి జ్యోతి నుంచగా
జ్యోతిర్లింగము మదిలో గొలుపుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
6. కనులు తెరచి నే శివునే చూడగ కనులు తెరచి నే శివునే చూడగ
కనులు తెరచి నే శివునే చూడగ కనులు తెరచి నే శివునే చూడగ
కనులు మూసినను కనిపించుచు ఆ శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
కనులు తెరచి నే శివునే చూడగ కనులు తెరచి నే శివునే చూడగ
కనులు మూసినను కనిపించుచు ఆ శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
7. ఓంకారమున శివాకృతి గాంచగ ఓంకారమున శివాకృతి గాంచగ
ఓంకారమున శివాకృతి గాంచగ ఓంకారమున శివాకృతి గాంచగ
ఓంకారంబయి మదిలో నిలుచుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
ఓంకారమున శివాకృతి గాంచగ ఓంకారమున శివాకృతి గాంచగ
ఓంకారంబయి మదిలో నిలుచుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
8. పుడిసెడు జలమున నభిషేకించగ పుడిసెడు జలమున నభిషేకించగ
పుడిసెడు జలమున నభిషేకించగ పుడిసెడు జలమున నభిషేకించగ
వడి వడి నామది వరలగ నిలుచుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
పుడిసెడు జలమున నభిషేకించగ పుడిసెడు జలమున నభిషేకించగ
వడి వడి నామది వరలగ నిలుచుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
9. కేశవ యని నే నాచమించగా కేశవ యని నే నాచమించగా
కేశవ యని నే నాచమించగా కేశవ యని నే నాచమించగా
యీ శివుడే యా కేశవుడనుచును శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
కేశవ యని నే నాచమించగా కేశవ యని నే నాచమించగా
యీ శివుడే యా కేశవుడనుచును శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
10. ప్రాణాయామము భక్తిగ చేయగ ప్రాణాయామము భక్తిగ చేయగ
ప్రాణాయామము భక్తిగ చేయగ ప్రాణాయామము భక్తిగ చేయగ
ప్రాణము నీలో ప్రాణము నేనే యనుచును శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
ప్రాణాయామము భక్తిగ చేయగ ప్రాణాయామము భక్తిగ చేయగ
ప్రాణము నీలో ప్రాణము నేనే యనుచును శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
11. సంకల్పమ్మును చేయుచు నుండగ సంకల్పమ్మును చేయుచు నుండగ
సంకల్పమ్మును చేయుచు నుండగ సంకల్పమ్మును చేయుచు నుండగ
నీ సంకల్పము నే గొలిపినదని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
సంకల్పమ్మును చేయుచు నుండగ సంకల్పమ్మును చేయుచు నుండగ
నీ సంకల్పము నే గొలిపినదని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
12. లింగాకృతి నే పొంగుచు చేయగ లింగాకృతి నే పొంగుచు చేయగ
లింగాకృతి నే పొంగుచు చేయగ లింగాకృతి నే పొంగుచు చేయగ
లింగంబయితిని రంగుగ నీకని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
లింగాకృతి నే పొంగుచు చేయగ లింగాకృతి నే పొంగుచు చేయగ
లింగంబయితిని రంగుగ నీకని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
13. హరహర రమ్మని ఆవాహింపగ హరహర రమ్మన నావాహింపగ
హరహర రమ్మని ఆవాహింపగ హరహర రమ్మన నావాహింపగ
నాలో నేనెటు లావహింతునని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
హరహర రమ్మని ఆవాహింపగ హరహర రమ్మన నావాహింపగ
నాలో నేనెటు లావహింతునని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
14. సింహాసనమున కూర్చోమనగా సింహాసనమున కూర్చోమనగా
సింహాసనమున కూర్చోమనగా సింహాసనమున కూర్చోమనగా
నే సృష్టించని ఆసనమిమ్మని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
సింహాసనమున కూర్చోమనగా సింహాసనమున కూర్చోమనగా
నే సృష్టించని ఆసనమిమ్మని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
15. కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ
కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ
తన గంగనె తన కొసగు టేమిటని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ కాళ్ళు చేతులూ కడుగగ నీరిడ
తన గంగనె తన కొసగు టేమిటని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
16. దాహము బాపగ నీళ్ళు త్రాగమన దాహము బాపగ నీళ్ళు త్రాగమన
దాహము బాపగ నీళ్ళు త్రాగమన దాహము బాపగ నీళ్ళు త్రాగమన
దాహము నేనో సృష్టించితినని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
దాహము బాపగ నీళ్ళు త్రాగమన దాహము బాపగ నీళ్ళు త్రాగమన
దాహము నేనో సృష్టించితినని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
17. స్నానము చేయుమటంచు వేడగా స్నానము చేయుమటంచు వేడగా
స్నానము చేయుమటంచు వేడగా స్నానము చేయుమటంచు వేడగా
స్మశాన వాసికి స్నానమేమిటని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
స్నానము చేయుమటంచు వేడగా స్నానము చేయుమటంచు వేడగా
స్మశాన వాసికి స్నానమేమిటని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
18. జంధ్యము దాల్చుమటంచు వేడగా జంధ్యము దాల్చుమటంచు వేడగా
జంధ్యము దాల్చుమటంచు వేడగా జంధ్యము దాల్చుమటంచు వేడగా
మంత్రాధిపుడను జధ్యమెందుకని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
జంధ్యము దాల్చుమటంచు వేడగా జంధ్యము దాల్చుమటంచు వేడగా
మంత్రాధిపుడను జధ్యమెందుకని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
19. మేన ధరింపగ వస్త్రము నీయగ మేన ధరింపగ వస్త్రము నీయగ
మేన ధరింపగ వస్త్రము నీయగ మేన ధరింపగ వస్త్రము నీయగ
దిగంబరుండను వస్త్ర మేల యని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
మేన ధరింపగ వస్త్రము నీయగ మేన ధరింపగ వస్త్రము నీయగ
దిగంబరుండను వస్త్ర మేల యని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
20. శ్రీగంధంబును మేన దాల్పమన శ్రీ గంధంబును మేన దాల్పమన
శ్రీగంధంబును మేన దాల్పమన శ్రీ గంధంబును మేన దాల్పమన
చిన్మయుడను నాకేల గంధమని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
శ్రీగంధంబును మేన దాల్పమన శ్రీ గంధంబును మేన దాల్పమన
చిన్మయుడను నాకేల గంధమని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
21. అక్షతలను నిను పూజించెదనన అక్షతలను నిను పూజించెదనన
అక్షతలను నిను పూజించెదనన అక్షతలను నిను పూజించెదనన
అక్షయ శుభదుఁడ నందుదు నని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
అక్షతలను నిను పూజించెదనన అక్షతలను నిను పూజించెదనన
అక్షయ శుభదుఁడ నందుదు నని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
22. పూవులతో నిను పూజించెదనన పూవులతో నిను పూజించెదనన
పూవులతో నిను పూజించెదనన పూవులతో నిను పూజించెదనన
పూవులలో తన పార్వతిఁ గని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
పూవులతో నిను పూజించెదనన పూవులతో నిను పూజించెదనన
పూవులలో తన పార్వతిఁ గని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
23. బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన
బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన
జగతి మూలమది బిల్వ మనుచు గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన బిల్వ పత్రములు ప్రీతిగ గొనుమన
జగతి మూలమది బిల్వ మనుచు గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
24. ఆవు పాల నభిషేకము చేయగ ఆవు పాల నభిషేకము చేయగ
ఆవు పాల నభిషేకము చేయగ ఆవు పాల నభిషేకము చేయగ
గోవులు దేవుల రూపమంచు గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
ఆవు పాల నభిషేకము చేయగ ఆవు పాల నభిషేకము చేయగ
గోవులు దేవుల రూపమంచు గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
25. పండ్లరసంబుల నభిషేకించగ పండ్ల రసంబుల నభిషేకించగ
పండ్లరసంబుల నభిషేకించగ పండ్ల రసంబుల నభిషేకించగ
పార్వతి ప్రకృతిని ఫలరస మని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
పండ్లరసంబుల నభిషేకించగ పండ్ల రసంబుల నభిషేకించగ
పార్వతి ప్రకృతిని ఫలరస మని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
26. పంచామృతముల నభిషేకించగ పంచామృతముల నభిషేకించగ
పంచామృతముల నభిషేకించగ పంచామృతముల నభిషేకించగ
పంచవ్వక్త్రునకు పంచా మృతమనె. శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
పంచామృతముల నభిషేకించగ పంచామృతముల నభిషేకించగ
పంచవ్వక్త్రునకు పంచా మృతమనె. శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
27. నమక చమకముల నభిషేకించగ నమక చమకముల నభిషేకించగ
నమక చమకముల నభిషేకించగ నమక చమకముల నభిషేకించగ
అన్నిట నాకే వందనమని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
నమక చమకముల నభిషేకించగ నమక చమకముల నభిషేకించగ
అన్నిట నాకే వందనమని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
28. భస్మముతో నభిషేకము చేయగ భస్మముతో నభిషేకము చేయగ
భస్మముతో నభిషేకము చేయగ భస్మముతో నభిషేకము చేయగ
భస్మ మహత్య మెఱింగితి వని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
భస్మముతో నభిషేకము చేయగ భస్మముతో నభిషేకము చేయగ
భస్మ మహత్య మెఱింగితి వని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
29. నారికేళ జలమభిషేకించగ నారికేళ జలమభిషేకించగ
నారికేళ జలమభిషేకించగ నారికేళ జలమభిషేకించగ
నారికేళమది నారూపంబని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
నారికేళ జలమభిషేకించగ నారికేళ జలమభిషేకించగ
నారికేళమది నారూపంబని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
30. పరమాన్నంబు సమర్పణ చేయగ పరమాన్నంబు సమర్పణ చేయగ
పరమాన్నంబు సమర్పణ చేయగ పరమాన్నంబు సమర్పణ చేయగ
పరమాన్నంబున భక్తిని గని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
పరమాన్నంబు సమర్పణ చేయగ పరమాన్నంబు సమర్పణ చేయగ
పరమాన్నంబున భక్తిని గని గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
31. తాంబూలమ్ము సమర్పణ చేయగ తాంబూలమ్ము సమర్పణ చేయగ
తాంబూలమ్ము సమర్పణ చేయగ తాంబూలమ్ము సమర్పణ చేయగ
త్రిగుణసమాహిత మహో యనుచు గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
తాంబూలమ్ము సమర్పణ చేయగ తాంబూలమ్ము సమర్పణ చేయగ
త్రిగుణసమాహిత మహో యనుచు గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
32. కర్పూరంబున హారతి నొసగగ కర్పూరంబున హారతి నొసగగ
కర్పూరంబున హారతి నొసగగ కర్పూరంబున హారతి నొసగగ
హారుడననుచునె హారతి మది గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
కర్పూరంబున హారతి నొసగగ కర్పూరంబున హారతి నొసగగ
హారుడననుచునె హారతి మది గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
33. మంత్ర పుష్పమును మదితో నీయగ మంత్ర పుష్పమును మదితో నీయగ
మంత్ర పుష్పమును మదితో నీయగ మంత్ర పుష్పమును మదితో నీయగ
మహిమాన్వితమని మది కని తా గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
మంత్ర పుష్పమును మదితో నీయగ మంత్ర పుష్పమును మదితో నీయగ
మహిమాన్వితమని మది కని తా గొని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
34. అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ
అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ
హారుడ నే నీ పాప హరుడనని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ అత్యుత్కృష్ట ప్రదక్షిణ చేయగ
హారుడ నే నీ పాప హరుడనని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
35. సాష్టాంగంబుగ నమస్కరింపగ సాష్టాంగంబుగ నమస్కరింపగ
సాష్టాంగంబుగ నమస్కరింపగ సాష్టాంగంబుగ నమస్కరింపగ
అష్ట మూర్తి నే హాయి నొసగుదని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
సాష్టాంగంబుగ నమస్కరింపగ సాష్టాంగంబుగ నమస్కరింపగ
అష్ట మూర్తి నే హాయి నొసగుదని శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
36. శివ మహిమాదుల పాడుచు పొగడగ శివ మహిమాదులు పాడుచు పొగడగ
శివ మహిమాదుల పాడుచు పొగడగ శివ మహిమాదులు పాడుచు పొగడగ
ధర్మ మార్గమున నడువగ తెలుపుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
శివ మహిమాదుల పాడుచు పొగడగ శివ మహిమాదులు పాడుచు పొగడగ
ధర్మ మార్గమున నడువగ తెలుపుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
37. శివ శివ శివ శివ శివ యని పలుకగ శివ శివ శివ శివ శివ యని పలుకగ
శివ శివ శివ శివ శివ యని పలుకగ శివ శివ శివ శివ శివ యని పలుకగ
శివతత్వమ్మును నా మది నిలుపుచు శివుడూ ll
కరుణించీనాడోయమ్మా. కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
కైలాసమందలి శివుడూ కరుణించీనాడోయమ్మా.
కరుణించీనాడోయమ్మా.
కరుణించీనాడోయమ్మా.
కరుణించీనాడోయమ్మా.
కరుణించీనాడోయమ్మా.
స్వస్తి
ఓం నమశ్శివాయ.
జైహింద్.

3 comments:
ఆర్యా ! శివ మయముగా సకలోప చార సహితముగానున్న ఈ గేయము పాడిన కర్ణ పేయముగా నుండుటలో సందేహము లేదు.చాలా బాగుంది.
' శివుడూ తాండవమో చేసేనమ్మా ' అను నొక పాట పద్ధతిలో పాడాలనుకొంటాను.
ఔనండి హనుమచ్ఛాస్త్రి గారూ. మీరు చెప్పిన పాటలాగే పాడాలి. గాత్ర మార్దవం కలవారు పాడితే మీరు చెప్పినట్టుగా బాగుంటుందండి. ప్రయత్నిస్తాను అలా పాడించి బ్లాగులో పెట్టే ప్రయత్నం చేస్తానండి.
మహా శివరాత్రి పర్వ దినాన భక్తి రస భరిత మైన మంచి రచన అందించి నందులకు అభినందనలు. ఇది శివ తాండ వ నృత్య గీతం..చాలా బాగుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.