గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, అక్టోబర్ 2011, శనివారం

పద్య రచనాభిలాషులకు నేమాని వారి సూచన.


పద్య రచనాభిలాషులారా!తవ, మమ, అనే సంస్కృత పదాలను తెలుగులో ఉపయోగించేటప్పుడు గమనించ వలసిన విషయం శ్రీ నేమాని వారు ఈ క్రింది విధంగా సూచించారు.
చూడండి.
అందరకూ కొన్నిసూచనలు:
అయ్యా! శుభాశీస్సులు.
తవ, మమ, మొదలగు సంస్కృత పదములను తెలుగులో యథా తథముగా వాడరాదు అని నాకు
జ్ఞాపకము.  
తావక (త్వత్, త్వదీయ, భవత్, భవదీయ), మామక(మత్, మదీయ) అని
వాడవచ్చును. 

ఇట్లు  పండిత నేమాని. 
ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుందాం.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

10 comments:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆర్యా ! తరచూ పద్య రచనకు ఉపయోగ పడే ఇలాటి విషయములను ఓపికగా బ్లాగునందుంచుచున్న మీకు, సూచించుచున్న శ్రీ నేమాని వారికీ ధన్యవాదములు.

Pandita Nemani చెప్పారు...

ఓంకార పంజర శుకీం
ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం
ఆగమ విపిన మయూరీం
ఆర్యా మంతర్విభావయే గౌరీం

అనువాద పద్యము:
ప్రణవ పంజరమున నొప్పు రామ చిలుక
పికము వేదాంత సుమవన ప్రకరమందు
ఆగమారణ్యముల నాట్యమాడు నెమిలి
యైన శ్రీగౌరి నార్య నే నాత్మ దలతు
Pandita Nemani

Pandita Nemani చెప్పారు...

అయ్యా! రామకృష్ణ రావు గారూ!
మహాత్ముని జయంతినాడే మీరూ పుట్టిన రోజు జరుపుకుంతున్నందుకు చాల సంతోషము. అభినందనలు
పండిత నేమాని

Pandita Nemani చెప్పారు...

మన దేశ ప్రియనేత మాన్యుడు, మహాత్మా గాంధి, సత్యాగ్రహం
బను భద్రాయుధమూని దీక్షగొని పోరాడెన్ బ్రిటిష్ వారితో
జనబాహుళ్యపు మానసాంబుజములన్ చైతన్యమున్ నింపె దె
చ్చెను స్వాతంత్ర్యము మాతృదేశమునకున్ జేజేలివే వానికిన్
పండిత నేమాని

కంది శంకరయ్య చెప్పారు...

రామకృష్ణారావు గారూ,
జన్మదిన శుభాకాంక్షలు!

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గురువులు చింతా రామకృష్ణ రావుగారికి,

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Pandita Nemani చెప్పారు...

Ayyaa! ShaShThi poorti Hero garoo!
mee vEDukala photos coopiMcaMDi.
Sanyasi Rao

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! సన్యాసి రావుగారూ! నమస్తే.
మీ శుభాశీస్సులే షష్టి పూర్తి కళను తెచ్చి పెట్టాయండి.
మీరు లహరి బ్లాగుద్వారా అందించిన పంచరత్నాలు ఆహ్లాద జనకంగా ఉన్నాయి.
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేసుకొంటున్నాను.
మీరు చేసిన గాంధీ నిజ రూప ఆవిష్కరణ అద్భుతంగా ఉందండి.
ఇక ఫొటోలంటారా..... లక్ష్మీ గణపతి హోమం, ఆయుష్హోమం సందర్భంగా తీసినవి తప్పక ఉంచే ప్రయత్నం చేస్తానండి.
నమస్తే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! శంకరయ్య గారూ!
సంపత్ కుమార్ శాత్రి గారూ!
నా షష్టి పూర్తి సందర్భంగా మీ అభినందనలు నాకెంతో ఆనందం కలిగించాయండి.
మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములండి.

రవి చెప్పారు...

చాలా కాలం తర్వాత సందేహం అడుగుతున్నాను, అన్యథా భావించకండి. ఈ నియమాలు సర్వనామ శబ్దాలకు మాత్రమే వర్తిస్తాయా? "మనసా", "రామాయ" వంటి ప్రయోగాలు కూడా తెలుగులో నిషిద్ధమే కదండి?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.