శ్రీకర సాహితీ ప్రియమిత్రులారా!
మన ప్రియతమ కట్టమూరి చంద్రశేఖరం అవధాని వారికి షష్టి పూర్తి అగుచున్న సందర్భంగా వారికి శాస్త్రోక్తముగా జరుగు గున్న ఆయుష్ హోమాది కార్యక్రమముల వివరములు వారు పంపిన ఆహ్వానం ద్వారా తెలియు చున్నది.
ఈ శుభ సందర్భంలో మన అవధాని గారికి ఆంధ్రామృతం ద్వారా పాఠకుల తరపున అభినందనలు తెలియ జేస్తున్నాను.
బ్రహ్మశ్రీ కట్టమూరి చంద్రశేఖరావధాని గారు షష్ట్యబ్ది లో ప్రవేశించిన సందర్భముగా సమర్పించుచున్న
అభినందన మందార మాల
సమర్పణ:- చింతా రామ కృష్ణా రావు.
శా:- శ్రీ కల్యాణ మనోజ్ఞ భావ నిలయా! శ్రీ జ్ఞాన తేజో నిధీ!
లోకుల్ మెచ్చెడి చంద్ర శేఖర కవీ! శ్లోకాస్పదా! మిత్రమా!
నీకున్ షష్టి "సుపాండితీ గరిమచే" నిండారగా చేరె. సీ
తా కల్యాణియు రామచంద్రుఁడు నినున్ ధాత్రిన్ సదా కాచుతన్. 1
ఉ:- శ్రీ రఘురామ భక్త! శశి శేఖర! మేలుగ కాంచినారు, నిన్,
ధీరుని, సత్కవీశ్వరుని, దివ్య వధాన మహన్నిధానమున్
కోరిక తీర పుత్రునిగ కొండల రావును సుబ్బ లక్ష్మియున్.
మేరు సుధీర! నీ కవిత మెచ్చెద రెన్నుచు సత్కవీశులున్. 2
ఉ:- సుందర భావ బంధుర సుశోభిత సత్కవితా మతల్లికా
చందన నందనంబది ప్రశాంత కులంబగు కట్టమూరి! యా
నందనమందుఁ బుట్టిన సనాతన సద్గుణరాశివీవు. ని
న్నందరు మెచ్చుటొప్పును. మహా కవి శేఖర! చంద్ర శేఖరా! 3
చ:- స్తుతమతి! సుప్రసిద్ధ గుణ శోభల వెల్గెడి సత్కవీశ్వరా!
అతులిత సద్వధానము లనంత మహత్కవితాభిరామ సం
స్తుతములు కాగ చేసితివి. తోయజ సంభవు రాణి బంధువా!
శ్రితజన హృద్విహార! శశిశేఖర! సత్కవితా ప్రభాకరా! 4.
చ:- చదువుల తల్లి బంధువయి చక్కగ సంస్కృతమాంధ్ర భాషయున్
చ:- చదువుల తల్లి బంధువయి చక్కగ సంస్కృతమాంధ్ర భాషయున్
చదివి, మహత్కవిత్వ ఫలసాయము లందగ చేసితీవు. నీ
మధుర వచో విలాసములు మాన్యతఁ గొల్పగ నీకు, నీవు సద్
బుధవరులెల్ల మెచ్చు గతి పూజ్యుఁడ! సత్ కవివై రహించితే! 5.
చ:- సురవరులెన్ననౌ కవిత సుందరి జన్మకు కారకుండ! ధ
ర్మరతుఁడవై మహత్ కవన మర్మమెఱింగి ప్రగాఢమైన శ్రీ
కర వర భావనా రుచిర కావ్య రహస్య నిరూపివైతి వ
బ్బుర మదియే కదా! దివిజ పూజ్యుఁడ! నిన్ వినుతింపలేనుగా! 6.
క:- వరులెన్ననౌ కవిత సుం
క:- వరులెన్ననౌ కవిత సుం
దరి జన్మకు కారకుండ! ధర్మరతుఁడవై
వర భావనా రుచిర కా
వ్య రహస్య నిరూపివైతి వబ్బుర మదియే!
గీ:- కవిత సుందరి జన్మకు కారకుండ!
గీ:- కవిత సుందరి జన్మకు కారకుండ!
కవన మర్మమెఱింగి ప్రగాఢమైన
రుచిర కావ్య రహస్య నిరూపివైతి!
దివిజ పూజ్యుఁడ! నిన్ వినుతింప లేను!
శ్రీ చక్ర బంధ తేటగీతి
వరలఁ జేతువు శ్రీకర భక్తి శోభ
లక్ష్యమున గల శ్రీ శుభలక్షణాల
యుక్తి నెఱిగిన శ్రీ వర భక్తి భాగ్య!
వరలఁ జేయుమ! భక్తుల భాగ్యమీవ. 7
నక్షత్ర బంధ కందము:- ( సుకవి వర - శ్రీ శశి ధర )
సుజన వశ! శశి శిఖరుఁడా!
విజయాంబుధ! సుందర! సదభిరమణుఁడా! శ్రీ
నిజ శత భూమిక చూచి, శ
శిజయధరుఁడన వలయునుర.శ్రిత శ్రీ గుణుఁడా! 8.
చ"తురంగ"గతి బంధ కందము:- (సుమధుర - కవితలు - పలి కెడి - సుజనుఁడ)
ప్రణవ విలసిత! బుధసుత! శ
మనుఁడ ! మధుమయుఁడ! సుజన సుమధురమ! వసుధన్.
జెనక యితడి కెవరన, విని,
జెనక యితడి కెవరన, విని,
కనలి, కవులు తడఁబడ, పరగ నెఱిఁగితివిలన్. 9.
గోపుర బంధము:- ( శ్రీ కరుఁడ! సుకవవీ)
శ్రీమాన్ కమలా ధరునిని
ప్రేమన్ గడ దేర్చుహరిని .ప్రియ సుఫలదునిన్
ధీమతిని, సుకవి విలసిత
కామ పితన్ యీ కవీశుఁ గావం గొలుతున్! 10.
ఛురికా బంధ కందము
జ్ఞాన మనమున మహా ఘన!
ధ్యాన మున విశేష శక్తి నార్జించితివే!
వేనకు వేలుగ శిష్యుల
ధ్యాన ముదావహులఁ జేసి, హర్షించితివే! 11.
ద్విపద-మత్తకోకిల-కంద-గీత గర్భ సీసము:-
సావధానము తోడ సాధన సల్పిన
ట్టిమహాత్ముఁడా నీకు సములు కలరె?
భావ బంధురమైన పద్యము పల్కి తీ
రుదు వక్కటా! మహద్బుధ వరేణ్య!
చేవ చూపెద వీవు క్షేమము సేయగా
గుణ సుందరా! నిన్నుఁ గొలువ నగునె?
శ్రీవివర్ధన! చంద్ర శేఖర! జ్ఞేయ మీ
వని యెంతు నే నిన్ను సునిశిత మతి!.
గీ:- సుకవులు మహాత్ముఁడంచును ప్రకటితముగ
నీ సుచరిత పల్కగ విననే! సుకవివి !
సహృదయుఁడవు. నిన్సకలార్థ చయము వలచు
సుచరితుఁడ! కనగ ననఘ! చోద్యము కద? 12.
క:- సుకవులు మహాత్ముఁడంచును
ప్రకటితముగ నీ సుచరిత పల్కగ విననే!
క:- సుకవులు మహాత్ముఁడంచును
ప్రకటితముగ నీ సుచరిత పల్కగ విననే!
సుకవివి! సహృదయుఁడవు. ని
న్సకలార్థ చయము వలచు సుచరితుఁడ! కనగన్!
ద్విపద:-
సావధానము తోడ సాధన సల్పి
భావ బంధురమైన పద్యము పల్కి
చేవ చూపెద వీవు క్షేమము సేయ
శ్రీవివర్ధన! చంద్ర శేఖర జ్ఞేయ!
మత్తకోకిల:-
సావధానము తోడ సాధన సల్పినట్టిమహాత్ముఁడా!
మత్తకోకిల:-
సావధానము తోడ సాధన సల్పినట్టిమహాత్ముఁడా!
భావ బంధురమైన పద్యము పల్కి తీరుదు వక్కటా!
చేవ చూపెద వీవు క్షేమము సేయగా గుణ సుందరా!
శ్రీవివర్ధన! చంద్ర శేఖర జ్ఞేయ మీవని యెంతు నే!
చంపక-కంద-తేటగీతి-ఆటవెలది- గర్భ సీసము:-
వర శశి శేఖరా!పరమ భక్త శిఖామ
ణి! బ్రహ్మ తేజ! కానెదఁ గొలుపర
వర కవితన్ సదా కరుణ భావ భవోద్భ
వ క్రాంతి దర్శివై వరలనిమ్ము!
వర దశ కోల్పడెన్. వరలు భావ శరధృ
తి వ్రాసి, గొల్పు, ప్రాగ్దేశిక! గురు
తర కవివై! సమాసగుణ దార్ఢ్య కవిత్వ
ము శ్రావ్య మౌనుగా! బుధ జన నుత!
గీ :-
సతము సభల నడుమ సహజత నిలుపుచు
రుచిర కవిత లమర రుచుల చెలఁగగను.
పలుకు పలుకుదువట! ప్రవరుల మదిఁగొన
పలుకులమ్మ చేతి చిలుక పలుకునటుల . 13.
సీస గర్భస్థ చంపకమాల:-
వర శశి శేఖరా!పరమ భక్త శిఖామణి! బ్రహ్మ తేజ! కా
వర కవితన్ సదా కరుణ భావ భవోద్భవ క్రాంతి దర్శివై!
వర దశ కోల్పడెన్. వరలు భావ శరధృతి వ్రాసి గొల్పు, ప్రా
తర కవివై! సమాస గుణ దార్ఢ్య కవిత్వము శ్రావ్యమౌనుగా!
సీస గర్భస్థ కందము:-
శశి శేఖరా!పరమ భ
క్త శిఖామణి! బ్రహ్మ తేజ! కావర కవితన్.
దశ కోల్పడెన్. వరలు భా
క్త శిఖామణి! బ్రహ్మ తేజ! కావర కవితన్.
దశ కోల్పడెన్. వరలు భా
వ శరధృతి వ్రాసి గొల్పు, ప్రాతర కవివై!
సీస గర్భస్థ గీతము:-
పరమ భక్త శిఖామణి! బ్రహ్మ తేజ!
కరుణ భావ భవోద్భవ క్రాంతి దర్శి!
వరలు భావ శరధృతి వ్రాసి గొల్పు,
సగుణదార్ఢ్య కవిత్వము శ్రావ్యమౌను.
సీసాంతమునగల గీత గర్భస్థ ఆటవెలది. :-
సతము సభల నడుమ సహజత నిలుపుచు
రుచిర కవిత లమర రుచుల చెలఁగ.
పలుకు పలుకుదువట! ప్రవరుల మదిఁగొన
పలుకులమ్మ చేతి చిలుక పలుకు.
తరళము:-
తెలుగు పండిత వృత్తి చేకొని దీక్షతో నట చెప్పుచున్
సులభ రీతిని పద్యముల్ విన సొంపు వ్రాయుట నేర్పితే!
కలలు గన్న కవీశ్వరాకృతిగా ముదంబున నిల్చి మీ
కలల రూపగు పిల్లలన్ గనికార మొప్పగ చూచితే! 14.
సీ:- పూజ్యుఁడ! లలిత సుబోధినీ వ్యాకర
ణంబువ్రాసితి జగదంబ కృపను!
కవిరాజు రచియించి కవిరాజువైతి! వి
లాసగణపతి ని వ్రాసితీవు!
అందంబుగా కడు సుందర గీతామృ
తము వ్రాసి పాడితి! ధన్యమూర్తి.
అటనట నెరపిన యవధాన పర్వము
నందఁ జేసితివిమా కందముగను.
గీ:- వర ప్రబంధమండలి వ్రాసి ప్రబలితివిగ! కష్ట కాలమునందును కష్టపడక
ఆత్మ ధైర్యము కోల్పోక యమర కవిత
లల్లి వ్రాయుట యది నీకె చెల్లెనయ్య. 15.
ఉ:- మంగళ భావ శోభితుఁడ!మంగళ సద్రచనాభిరామ! సన్
మంగళ సద్వధానివర! మంగళ రూప విరాజమానుఁడా! మంగళ కావ్య శోధకుఁడ! మంగళ సద్గురుదేవ! నీకు సన్
మంగళ భాగ్యకారులగు మంగళ గౌరియు సాంబమూర్తియున్. 16.
మంగళం మహత్
శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ
అభినందనలతో
సజ్జన విధేయుఁడు
చింతా రామ కృష్ణా రావు.Hyderabad,
Dt. 09.10. 2011.
email id:-chinta.vijaya123@gmail.com@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
ఆర్యులారా! విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అన్న నానుడి ఎంత యదార్థము!
అవధానిగారి సమస్యా పూరణలను, దత్తపది పూరణలను, మీరు గుర్తించి యున్నందున మీకూ ఆసక్తి కలిగియున్నచో మీ యొక్క అభినందనలను కూడా ఆంధ్రామృతం ద్వారా అవధాని గారికి తెలియజేయ గలరని ఆశిస్తున్నను.
జైశ్రీరాం.
జైహింద్.
7 comments:
శ్రీ మాన్ కట్టమూరి చంద్ర శేఖర అవధాని గారికి షష్టి పూర్తి మహోత్సవము సందర్భంగా శుభాకాంక్షలు.
పలువత్సరములు వారి కవనామృతము ఆంధ్ర జనులకు అందించు భాగ్యం కలిగించ వలెనని నలువ రాణిని కోరుచూ నమస్కారములు తెలుపుకొను చున్నాను.
శ్ర్రీ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారికి షష్తిపూర్తి సందర్భముగా హృదయపూర్వక శుభాకాంక్షలు. సాష్టామంగనమస్కారములు.
వివిధ పద్యాలలో అవధానిగారిని అభినందించిన గురువర్యులు శ్రీ చింతా రామకృష్ణారావు గారికి పాదాభివందనములు
ఆర్యా,
మీ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అద్భుతం!
అయ్యా! శుభాశీస్సులు.
శ్రీ కట్టమూరి వారి మీద మీ అభిమానము కట్టలు తెంచుకొని ప్రవహించినది.
మీ బంధాలు అనుబంధాలు బాగున్నవి. కడుపులో కైతలు కడు మిన్న.
బంధ కవితలు గర్భ కవితలు అరుదుగా వాడుచుంటారు. భాషను భావమును ఇబ్బందిపెట్టే ప్రక్రియలు అవి. అందుకేనేమో వాటికి పూర్వ కవులు ఏ మాత్రము గౌరవమును ఈయలేదు. అన్వయమునకు సరళ గమనమునకు ధారకు మాత్రమే పెద్ద పీట కదా.
పండిత నేమాని
శ్రీ కట్టమూరి చంద్రశేఖర అవధానుల వారికి షష్టిపూర్తి మహోత్సవ సందర్భమున హృదయపూర్వక అభినందనలు. భగవంతుడు కృపతో వారికి దీర్ఘతరాయురారోగ్యములు సకల శుభములు నొసగు గాక! ముగ్గురమ్మల కరుణ ఆయనపై సదా ప్రసరించు గాక!
ఆర్యా ! కట్టమురి వారి పై మీరు చెప్పిన పద్యములు సాహితీ ప్రక్రియలన్నీఒకే చోట పరిచయమయ్యే విధంగా మాబోటి వాండ్లకు కనువిందుచేసాయి.
శంకరార్యులన్నట్లు మీ విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
"టూ ఇన్ వన్, త్రీ ఇన్ వన్, పైవ్ ఇన్ వన్ పద్యాలతో ఆల్ ఇన్ వన్ గా కనిపించారు."
హనుమచ్ఛాస్త్రిగారూ!
శ్రీపతిశాస్త్రిగారూ!
శ్రీ కంది శంకరయ్యగారూ!
పండిత నేమానివారూ!
శ్రీ గన్నవరపు నరసింహ మూర్తిగారూ!
మీ అందరి అభినందనలకూ, అభిమానానికీ ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.