సాహితీ బంధువులారా!
మనం సాధారణంగా ఉదయం లేచిన మొదలు దేవునితో పాటు మన సాటివారికి అనేక మందికి నమస్కరిస్తూ ఉంటాము.
ఐతే ఈ నమస్కారం కూడా చేయి కొంచెము పైకెత్తి చేయటం, రెండు చేతులు ఏదో మ్రొక్కుబడికి కలిపి చేయటం, అరచేతులు రెండూ తాకేలాగ నొక్కి పట్టి అంగుళులు పదీ కలిపి చేయటం మొదలుగా అనేక విధాలుగా చేస్తుంటాము.
ఐతే ఈ నమస్కారం వెనుక గల భావన గ్రహించి చేసే నమస్కారమే పరమాత్మ విషయంలో మనం చేస్తున్నట్టనిపిస్తుంది.
మీ రూ గమనించండి.
శ్లో:-
మత్తస్త్వముత్కృష్టః. త్వత్తోzహమపకృష్టః.
ఇత్యాకారకాంగుళి సంపుటీకరణం నమస్కారః.
గీ:-
నీవు ఘనుఁడవు నాకంటె నేలపైన ,
నేను తక్కువ నీకంటె నిజమటంచు
మదిని తలపోసి, యహమును మదిని వీడ,
ప్రబలు యంగుళి సంపుటి వందనమగు.
భావము:-
రెండు చేతుల వ్రేళ్ళు జోడించి, నాకంటే నీవు గొప్ప వాఁడవు. నీకంటే న్ను తక్కువ వాఁడను.అని మనస్స్ భావించి చేయు క్రియ నమస్కారమని తెలియు చున్నది. అనగా అహంకారమును వీడి మనస్సును అడంచుటయే నమస్కారమన్న మాట.
శివునెదిరింప వచ్చిన రావణుఁడు కలైసాము క్రిందఁ బడి, అతనిచే అడంపఁబడి, కిచకిచలాడుచు, పరమాత్మవైన ఓ పరమేశ్వరా! ఈ కాన వచ్చు చేతనాచేతన వస్తు జాలమంతయు నీవే. అహంకారముచే నీవింతవాఁడవని తెలియక ఎదిరింప వచ్చితిని. క్షమింపుమని,నమస్తే రుద్ర అను వేద మంత్రముతోఁ బూజించెను. అదియే నమకము.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

7 comments:
అయ్యా! శుభాశీస్సులు.
మా చిన్న ప్రయత్నమును చూడండి:
నీవె నాకంటె ఘనుడవు, నేను చిన్న
వాడ నీముందటంచు సద్భావ మలర
విడిచి "యహమును" గలుపుచో వ్రేళ్ళ నమిత
వినయమున నదె వందనంబన జెలంగు
Pandita Nemani
ఆర్యా! నమస్తే. నమస్కారానికి నిర్వచనం కాగల విధంగా విషయాన్ని పరి పూర్ణంగా వివరించిన మీ రచనా నిపుణత ప్రశంసనీయము.That is Nemaani.మీ స్పందనకు నా కృతజ్ఞతలు. నమస్తే.
ఆర్యా ! సంస్కార యుత నమస్కార విధానము, ' లో ' అర్థము చక్కగా తెలియ జేసినారు. నమస్తే !
అయ్యా! నమః అంటే నేను ఎప్పుడో విన్నది ఏమిటంటే:
మః = నాది, న = కాదు
ఈ తనువు, మనము, ధనము నావి కావు - మీవే అని చెప్పుటట.
పండిత నేమాని
నమస్కారములు.
" నమస్కారము " గురించి చక్కగా వివరించారు. ధన్య వాదములు.
ఐతే ఒకచిన్న సందేహము " నమస్కారము " అని అనాలిగానీ , " నమస్తే " అని " అనకూడదు " అని ఎక్కడో చదివాను . అది ఎంతవరకు సమంజసమో తెలియదు
అమ్మా! శుభాశీస్సులు.
నమస్కారము అనినా నమస్తే అనినా ఒకటే. సంస్కృతములో నమః తే అంటే నీకు నమస్కారము అనే కదా అర్థము. కొందరు ఛాందసుల భావములు వేరేగా ఉండ వచ్చు.
పండిత నేమాని
గురువులకు నమస్కారము.
సందేహ నివృత్తి చేసినందులకు ధన్య వాదములు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.