సాహితీ ప్రియ మిత్రులారా!
మనము సాహితీ జ్ఞాన నేత్రంతో చూడ గలిగితే మనచుట్టూ అనేక మంది మహా కవులు, బంధ కవులు, గర్భకవితాప్రకాండులు అనేక మంది కనిపిస్తారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ విషయం నిజంగా నిజం .
ఇంతకీ అట్టి కవులకు ఈ కవిత్వము చేయుటయన్నిది ప్రవృత్తి మాత్రమే. వారు ప్రాణాలను కాపాడె వైద్య వృత్తిలో కొందరు, ఇంజనీర్లు కొందరు, వ్యవసాయ, వ్యాపారాదులలో కొందరూ రాణిస్తున్నవారు. ప్రత్యేకించి సాహిత్యాభ్యాసము చేసినవారు కాకపోయినా అద్భుతమైన కవితలను వెలువరించి, సాహితీ జగత్తును తేజోపూర్ణం చేసినవారు.
ఆ సరస్వతీ కటాక్షం వారిపై పరిపూర్ణంగా ఉంది అని మనకు అర్థమౌతుంది.
అట్టివారిలో చిత్రకవివతంస డా.దేవగుప్తాపు సూర్య గణపతిరావు గారు ఒకరు.
వారు రచించిన అనేక రచనలు ప్రచురితమైనవి. అందు పద్మవ్యూహము అనే పేరుగల దశావతార బంధ ప్రబంధము నిరుపమాన రచనగా పేర్కొన వచ్చును.
ఆగ్రంథము అమూల్యమైనది.
మీకు నిజంగా చదివే ఉత్సాహముండి, అది తప్పక మీకు కావాలనుకొంటే ఆ డాక్టర్ గారితో మీరే స్వయంగా మాటాడి మీ చిరునామా తెలియ జేసి, మీకు వారి రచనలను పంపమంటే తప్పక పంపగలరు.
వారి చిరునామా:-
Dr. D.S.Ganapati Rao.
Flat. No. 202.
Vijaya nagara lay ouT.
vietla vantage,
PedaWailtair junction.
VISAKHAPATNAM. 530 017.
phone. 08912539917.
నాకు తెలిసిన విషయాన్ని మీ ముందుంచాను. ధన్యోస్మి.
జైశ్రీరాం.
జైహింద్.
2 comments:
అయ్యా! శ్రీ దేవగుప్తాపు సూర్య గణపతిరావు గారు గణపతి సమానులే. ఎందుకంటే గణపతి కూడా "కవీనాం కవిః" కదా. పేరులో కూడ కొంత పెన్నిధి ఉంటుంది కదా. నా అదృష్టము ఏమిటంటే శ్రీ గణపతిరావు గారికి నాయందు ఉన్న అత్యంత గౌరవ విశేషమే. తన కృతి యొక్క మొదటి కాపీని మాయింటికి తెచ్చి నాకే ఇచ్చారు. ఎంత సహృదయము. మంచి కృషి. చాల బాగుంది. వారికి మంచి భవిష్యత్తు ఉంది. మా శుభాశీస్సులు.
పండిత నేమాని
నిన్ననే ’పోస్టు’లో వచ్చె నెన్నఁదగిన
దీ మహోత్కృష్టపుస్తక మెంత ధీవి
శాలుఁడో దీని వ్రాసి ప్రశంసపాత్రుఁ
డయ్యె గణపతిరావని యభినుతింతు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.