గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, ఆగస్టు 2011, ఆదివారం

కొత్తపాళీగారు మాయింటికి వచ్చారు. మాకెంతో ఆనందం తెచ్చారు.

ప్రియ పాఠకులారా!
మన ప్రియ బ్లాగ్బంధువు శ్రీమాన్ కొత్తపాళీ (నారాయణస్వామి)గారు ఎంతో శ్రమదమాదులకోర్చి హైదరాబాదులో గల మా స్వగృహానికి వచ్చారు. వారు, వారి బావగారు, మేనల్లుఁడు వచ్చారు. నాకెంతో సంతోషమనిపించింది. వారెంతో ఆనందంతో ఎంతో హాయిగా మాటాడారు.

మన తెలుగు అభివృద్ధి కారకులైన అనేకమంది దివ్యమైన బ్లాగ్ కృషిని ఎంతో సోదాహరణంగా వివరించారు.
తెలుగుభాషన్నా, తెలుగు ప్రజలన్నా,  వారికెంతటి ప్రీతో మాటలలో చెప్పలేను.వారు తన నాటకపాత్రాభినయంలో గల అనుభవాన్ని తెలియఁజేస్తూ, చక్కగా రెండు  పద్యాలు పాండవోద్యోగ విజయాలు నాటకంలో గల శ్రీకృష్ణ పడకసీనులో తాను నిర్వహించిన దుర్యోధనుని పాత్ర నుండి రెండు పద్యాలు కూడా ఎంతో అద్భుతంగా ఆలపించారు.
నాకు, మాకుటుంబ సభులకందరికీ కూడా ఎంతో ఆనందం అనిపించింది. వారికీ వారితో వచ్చిన బంధువులకూ నేను నాకుటుంబం మా ఆనందం వ్యక్తం చేసుకొంటున్నాము. వారికి మా ధన్యవాదాలు.

ఇక మేము పొందిన అనుభూతులు మీకూ పంచాలనే భావనతో వారు ఆలపించిన పద్యాలను, వారితో కూడిన చిత్తరువులను ఇక్కడ బ్లాగులో ఉంచుతున్నందుకు ఆనందంగా ఉంది. 


కొత్తపాళీగారు ఆలపించిన పడకసీనులో దుర్యోధనుని పద్యం.



నన్ను అభిమానిస్తున్న మీకు నాధన్యవాదములు. 
రేపు మన భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నా హృదయ పూర్వక శుభాకాంక్షలు ముందుగానే తెలియ జేసుకొంటున్నాను.
శుభమస్తు.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

20 comments:

శ్రీ చెప్పారు...

బాగుందండీ!

అజ్ఞాత చెప్పారు...

సింప్లీ అదుర్స్. కొత్తపాళి గారి పద్యాలు, హావభావాలు బాగున్నాయి. వహ్వా! ... వహ్వా!
వన్స్‌మోర్! ఈ..ఈ...ఈ.. ఈల వేశాను. వన్స్‌మోర్! :)

మాలా కుమార్ చెప్పారు...

బాగుందండి .
కొత్తపాళి గారి పద్యాలు బాగున్నయండి . మాకు కూడా వినిపించినందుకు ధన్యవాదాలండి .

teresa చెప్పారు...

Thanks for sharing mastaroo :)

Afsar చెప్పారు...

తలపై కిరీటం లేదు పో
ఠీవికీన్ లేదు లోటు
మైకము కమ్మగా మైకున్నూ లేదు పో
సహజ బూమ్ బాక్సు లోనున్నట్టు
గొంతులో పద్యము ఖంగున మోగెను పో
భళి రే భళి! కొత్త పాళీ!!

Hima bindu చెప్పారు...

చాలా బాగుందండీ .మా చిన్నతనం లో చుసిన నాటకాలు గుర్తుకొచ్చాయి

అజ్ఞాత చెప్పారు...

కొత్తపాళీగారు తాను మీ యింటికొస్తున్నట్లు నాకు వేగుపంపారు. నేను 11 AM తరువాత కుదురుతుందని నేనూ వేగుపంపాను. అయినా ఇతరేతర అనివార్యతల మూలాన ఆ సమయానికి అందుకోలేకపోయాను. సరే, ఫోన్ చేద్దామని చేస్తే ఆ పిలుపు వెళ్ళడం లేదు. మొత్తం మీద ఆయన ఇండియా వచ్చినప్పుడు కలవలేక పోయినందుకు చాలా విచారిస్తున్నాను. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తారని ఆశిస్తాను.

అజ్ఞాత చెప్పారు...

video is not available sir. please check

rākeśvara చెప్పారు...

చాలా సంతోషం.
మిమ్మల్ని రాజమండ్రిలోనూ భాగ్యనగరంలోనూ కలుసుకోవడం గుర్తుకు వచ్చి చాలా సంతోషం అనిపించింది.
వీడియోలు తాత్కాలికంగా పనిచేస్తున్నట్టులేవు. అవి పని చేస్తే చూడాలని కుతూహలముగానుంది.

కథా మంజరి చెప్పారు...

బాగుంది మిత్రమా.

Sanath Sripathi చెప్పారు...

నేను గత మూడు రోజులుగా ఇంటర్నెట్ చూడకపోవటం వలన మంచి అవకాశం కోల్పోయా... కొత్తపాళి గారు ఇంకా భారత దేశం లోనే ఉన్నారా? లేక తిరుగు ప్రయాణమైపోయారా? వారి సెల్ నంబర్ వంటిదేమైనా ఉన్నదా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చిరంజీవీ! సనత్!
కొత్తపాళీగారు ప్రస్తుతం భారత డదేశంలోనే ఉన్నారు.
కొత్తపాళీ నారాయణస్వామి గారి సెల్ నెంబర్.
9866976240
శుభమస్తు.

ఆ.సౌమ్య చెప్పారు...

అయ్యయ్యో...కొత్తపాళీ గారు పాడిన పద్యాలు మిస్ అయిపోయాను. ఆడియో పనిచెయ్యట్లేదు. ఒకసారి సరి చూసి పోస్ట్ చెయ్యగలరా?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అమ్మా!సౌమ్యా! వీడియో మిమ్మల్ని నిరుత్సాహ కలిగినందుకు చింతిస్తున్నాను.
అలాగ ఎందుకైందో అర్థం కావటం లేదు. టెక్నికల్ పరిజ్ఞానం కలవారెవ్వరైనా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నానమ్మా.

జ్యోతి చెప్పారు...

రామకృష్ణగారు అదృష్టవంతులండి.. కొత్తపాళీగారితో పద్యాలు పాడించారు. మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు..

ఇందు చెప్పారు...

చాలాబాగుందండీ....మా గురువుగారు పద్యాలు పాడటం,అది మీరు చక్కగా రికార్డు చేయడం మా అదృష్టం :) మీకు బోలెడు ధన్యవాదాలు :)

ఆ.సౌమ్య చెప్పారు...

భళి భళి కొత్తపాళీ గారు పద్యాలు అదరగొట్టారు!
శ్రమ తీసుకుని మరల పంపించినందుకు చాలా చాలా ధన్యవాదములు!

SHANKAR.S చెప్పారు...

హేట్సాఫ్ కొత్తపాళీ గారికి. మొదటి వీడియో లో ఆయన పద్యం అభినయ సహితంగా ఆలపిస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయిన నేను పద్యం అయిపోయాక అసంకల్పితంగా విజిల్ వేసేశాను.

రామకృష్ణారావు గారూ ఇంత చక్కని వీడియో మాతో పంచుకున్నందుకు మీకు బోలెడన్ని ధన్యవాదాలు.

కొత్త పాళీ చెప్పారు...

మాస్టారూ, మీరింత హడావుడి చేస్తారని తెలిస్తే పాడే ధైర్యం చెయ్యకపోదును! :)
ఆ రోజు మీరు చూపించిన అభిమానం మరువలేనిది. ఎన్నో మధురమైన జ్ఞాపకాల్ని మూటగట్టుకుని ఇల్లు చేరాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

కొత్తపాళీగారూ!
ఎంతో అభిమానంతో శ్రమదమాదుల కోర్చుకొని, మా యింటికి మీరు వచ్చినందుకు మాకెంతో సంతోషం కలిగింది.
మీరు కులాసాగా ఇంటికి చేరినందుకు సంతోషం.
మీ పద్యాలకు ఎంతోమంది అద్భుతంగా స్పందించి వారి ఆనందాన్ని వ్యక్తం చేసారు.మీరింత బాగా పాడతారని నేను ఊహించి ఉంటే ఇంకా బోలెడన్ని పద్యాలు మీచేత పాడించుకొని సహపాఠకులతో పాటు నేనూ ఆనంద సాగరంలో ఓలలాడేవాడిని. ప్రస్తుతానికింతే ప్రాప్తం.
మీ అభిమానానికి ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.