గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2010, ఆదివారం

ఆనంద రూపుఁడగు ఆత్మా రామునికి నిత్య పుష్పార్చన.

ప్రియ పాఠక బంధువులారా!
మన హృయంలో కొలువైయున్నఆత్మారామునికి మనం నిత్యమూ వాడని శ్రేష్టమైన పుష్పములతో అర్చించే భాగ్యాన్ని మనం ఆత్మ సాక్షిగా పొందగలం. మనస్పూర్తిగా ఆ పరమాత్మను హృదయంలో ధ్యానించి; ఈ క్రింది పద్యమును భావ యుక్తముగా భావించి పఠించ గలిగితే నిత్య పూజ చేసినవారమగుదుము.
ఇంతటి ఉపయోగకరమైన పద్య రచన చేసిన దెవరో కాదు. అవధాని శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావుగారే.
ఆ పద్యాన్ని మీరు చూచి; యోగ్యమైనదే అనుకొంటే తప్పక పఠించ గలరు. 
సీll
ఇది  "అహింస"  యనెడు నింపైన పుష్పంబు - "ఇంద్రియ నిహ్రహ" మ్మీ సుమమ్ము.
ఇది "భూత దయ" యను మృదువైన కుసుమంబు - "క్షమ" యను నీ ప్రసూనము చెలంగు.
"శాంతి" నా నలరారు చక్కని పూవిది; - "తప" మన నీ లతాంతమ్ము తనరు.
"ధ్యానం" బనగ నిప్పు నందాల విరి యిద్ది; - యలరు యీ పూవు "సత్యం" బనంగ.
తే.గీll
మంచి గుణముల; తగు నియమముల మాల -  భక్తితోఁ గూర్చి; మన మను పళ్ళెరమున
నుంచి తెచ్చితి నిను పూజించు వేడ్క - అందుకొనుము మా పూజ లానంద రూప!
రచన:- శ్రీ నేమాని రామ జోగి సన్యాసిరావు.
చూచారు కదండీ! ధన్యవాదములు.
జై శ్రీరామ్.
జైహింద్. Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ పద్యము " నంది తిమ్మన గారి " " పారిజాతాపహరణంలొ " నారదుడు పారిజాత మహిమను వర్ణించి నట్ట్లు
" జలజాక్షి ఇది పారిజాత ప్రసూనంబు ,నరులకు ధరియింప నరిది సూవె
పరిమళము సెడదు వాడదు ,పరువము తప్పదు పరాగ భర భరితంబై ఇంకా
నెలకొని వేసవి జలువయు ,జలి వేళల నుష్ణ గుణము సముచిత భంజిన్ " అంటూ " పారి జాత మహిమను వివిధ వర్ణనలు చేసి నట్టుగా మనసనే పళ్ళెంలొ ఉంచి తెచ్చిన ఈ ఆత్మా రాముని పుష్పం చాలా చాలా బాగుంది ఇంతటి పరిమళ కుసుమాలను అందించిన చింతావారు ధన్యులు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.