( నక్షత్రంపై క్లిక్ చెయ్యండి)
కll
సుకవి కభినుతులు; పలు కా
నుక లందుదు రేవురురు ఘనులరయుటన్ శో
భ కభిముఖులుఁ; జక్కం జను
లు కనుదురు; సులలిత! వనరులు సుశోభ నిడున్!
భావము:-
సులలిత హృదయుఁడ వైన ఓ పాఠకుఁడా! మంచి కవికి నా అభినుతులు. వారు అనేక బహుమతులతో గౌరవింపఁ బడుదురు. పంచ భూతములూ ఆట్టి కవి నరసి యున్న కారణముగా కళ కాంతులకభిముఖులై యుండి వర్ధిల్లుదురు. ఆట్టి ఆ మహా కవిని చక్కగా జనులు ప్రేమతో సత్కవితాభిలాషతో చూచెదరు. అట్టికవికి వనరులు అమరి శొభలను కలుగఁ జేయును. సుకవి కారణంగా సుజనులిల శోభిలుదురు.
ఈ నక్షత్ర బంధము నందు
కోణములందు వరుసగా గల అక్షరములు "సు-జ-ను-లి-ల" = భూమిపై మంచివారు
కేంద్రములందు వరుసగా గల అక్షరములు "శో-భి-లు-దు-రు" = ప్రకాశింతురు.
మంచివారు భూమిపై ప్రకాశింతురు అని తత్పర్యము.
జైహింద్.
Print this post
1 comments:
తారా పధంలొ " కందం అందంగా ఉంది " కోణము నందున్న సుజనులు కేంద్ర ములలొ ప్రకాసించటం ప్రశంస నీయం.రాసిన వారు సరే " పండితులె " కనీసం చదివి ఆనందించ గల తెలివి ఉంటే చాలని పిస్తుంది.అభినందనలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.