గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, ఆగస్టు 2010, సోమవారం

శార్దూలాన్నే చక్రబంధం చేసిన మహాకవి ఎవరో తెలుసా?


(చక్రంపై క్లిక్ చెయ్యండి)
పాఠక మహాశయులారా!
కవి కంఠీరవముగా చెప్ప దగిన అవధాని శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు కవి 
ఏకంగా శార్దూలాన్నే చక్ర బంధం చేసి మనముందుంచారు. 
ఆహా! ఎంతటి అద్భుతం!!!
ప్రయత్నం చేస్తే చేయలేని పనంటూ ఉండదని మనకు ప్రబోధించడానికే తానీ విధంగా ఉదాహరణ ప్రాయంగా వ్రాసి చూపారని మనం గ్రహించఁ గలిగితే; ప్రయత్నం చేసినట్లైతే మనమూ సాధించ గలమనే నేను విశ్వసిస్తున్నాను.
ఆ చక్ర బంధమైన శార్దూల అసలు స్వరూపాన్ని చూద్దామా?
శాll
విప్రస్తుత్య గుణప్రసస్త! వరదా! విశ్వాధిపా! శ్రీధరా!
సుప్రీతా! జనకాత్మజాధవ! మహాశోభాకరా! రామ! వే
దప్రామాణ్య విలాస! రాఘవ! అయోధ్యాధీశ! ధాత్రీశ్వరా!
రా ప్రాజ్ఞా! విమలా! సుఖప్రద! సురారాధ్యా! సువేషా! వరా!
ఓహో!  ఇక్కడ వివరంగా చదివితే శార్దూలంలో ఇంతటి భక్తి భావం నిబిడీకృతమై ఉందని మనకర్థమౌతోంది కదండీ!
ఇంత చక్కగా రచించిన ఆ మహా కవికి మన అభినందనలు తెలుపుతూ; 
మనం కూడా ఇక మరొక శార్దూలాన్ని చక్ర బంధం చేసే ప్రయత్నం చేద్దామా? 
ఔత్సాహికులైన కవిపుంగవులందరికీ వాంఛితార్థము తప్పక ఆ శారదాంబ నెరవేరుస్తుందని నా విశ్వాసం.
జై శ్రీరామ్.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అంద మైన ఛందస్సులతొ ప్రముఖుల ఆణి ముత్యాలను మా ముందుంచు తున్నందుకు ధన్య వాదములు. ఇంకెందుకాలస్యం ?" ఒక మత్తేభం , ఒకశార్దూలం , మరొక మత్త కోకిల " ఇలా ఒక చక్ర బంధం ,ఒక నాగ బంధం,మరొక నక్షత్ర బంధం " వ్రాసి మా ముందుంచితె మరింత ముదావహం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.