ఆంధ్ర దివ్య జ్యోతిస్వరూపాన్ని తన గాత్రంద్వారా యావద్భారాతీయులూ మహదానందంతో తిలకించేలా భారతాంబ పులకరించేలా చిఱునగవులొలుకు ముఖారవిందంనుండి తేనె వాగులా పాటలను జాలువారించిన ఆంధ్ర మాత గర్వ కారకుఁడైన శ్రీరామ చంద్రను తమ కడుపు పంటగా బడసిన తల్లిదండ్రులకు ఆంధ్రామృతం అభినందనలు తెలియఁ జేస్తోంది.
నిరంతర విజయ పరంపరలతో తనకు; తనను కడుపార గన్న తల్లిదండ్రులకు; ఆంధ్ర మాతకు; స్వర్ణ భారతాంబకు దినదిన ప్రపంచ ప్రఖ్యాతిని కలిగిస్తూ; పురోగమించాలని మనసారా కోరుకొంటూ; ఆపరమాత్మ పరిపూర్ణ ఆయురారోగ్య ఆనంద సద్గుణ సౌభాగ్యా లివ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post
జైశ్రీరాం.
జైహింద్.
4 comments:
congrats SREERAMCHANDRA
వీనుల విందైన గాన మాధుర్యాన్ని అందిస్తున్న శ్రీ రామచంద్రకు అభినందనలు + దీవెనలు చక చక్కని పరిచయ భాగ్యాలను అందిస్తున్న చింతా వారికి అభినందనలు + దీవెనలు + ధన్య వాదములు
శ్రీ రామా చంద్ర, నీ గెలుపు కోసం ఎంత ఆరాట పదినామో మా మిత్ర బృందానికి తెలుసు. చివరి క్షణాలలో మిత్రులందరినీ కూడదీసి సుమారుగా 680 మేస్సేజులు వెళ్ళేల చేశాను. హిందీ లో నీ యాస ప్రాస హిందీ వాళ్ళకే సవాలు అనిపించి స్థాయిలో వుందని చెప్ప గలుగుతున్నాను ఎందుకంటే నేను హిందీ లో MA చేశాను గనక. మరో idol వొచ్చే లోగ మన కీర్తి పతాక ఏ స్థాయిలో నాటాలంటే హిందీ రాష్ట్రాలన్నీ మనల్ని కొన్ని వందల సంవత్సరాల వరకు గుర్తుంచుకోవాలి. We wish you all the BEST!
రాజేంద్ర కుమార్జీ! మీలాగే యావదాంధ్రులూ; యావద్భారతీయులూ మెరిట్ ని గౌరవిస్తే మాత్రం మన ఆంధ్రులు ఏ రంగంలోనైనాసరే తమ ప్రావీణ్యత నిరూపించుకో గలరు. కాని ఆంధ్రులు ఆరంభశూరులనే అపప్రధరావడానికి కారకులు కూడా ఉండడం చేతనే వీరాభిమానులు మరింతగా శ్రమించక తప్పటం లేదు విజయాలందుకోవడం కోసం.
మీకు నా అభినందనలు మనసారా తెలియ జేస్తున్నాను.
జైహింద్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.