గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, ఆగస్టు 2010, బుధవారం

ముంబై నుండి యన్. ప్రసాద్ గారి దత్తపది పూరణ అద్భుతం.

ప్రియ సాహితీ బంధువులారా! 
ముంబై నివాసులైన ఆంధ్రామృత పాఠకులు శ్రీ యన్. ప్రసాద్ గారు. మన ఆంధ్రామృతంలో పూరణకై దత్తపదిని చూచి; ఎంతో ఉత్సాహంతో అద్భుతంగా పూరించి మన బ్లాగుద్వారా పదిమంది ఔత్సాహికులూ చదివే అవకాశంకల్పించడానికి వీలుగా పంపిరి.
ఆ ప్రసాద్ గారి పూరణను వారి స్వదస్తూరీలోనే మీ ముందుంచుతున్నాను. చదివి చూడండి.
మll
పిరమిడ్లీల శవాలు చేరె గదిలో భీభత్సమున్ బ్రాకె; ప
ల్వురు రక్త హ్రదమందు బాసి రసువుల్ పూరీకృతాయుష్కులై;
పరిరక్షించితివే కరిన్; గతమె యుప్మానంబుగా చంపు ము
ష్కర నక్రమ్ముల; వీరు వీడ రెవరిన్; కాఫిర్లగా నెంచుచున్.


ఉపమానము అనే పదాన్ని కాస్త వక్రించాను.
పిరమిడ్ + లీల; పిరమిడ్లలో శవాలుంటాయని మనకు తెలుసు.
కాఫిర్ = ఇస్లాం మతమంది విశ్వాసము లేనివారు.అట్టి వారిని వధించాలని నియమం పెట్టుకొని ఉన్నారు.


నా పరిచయం.: ప్రసాదు నామధేయం.
ముంబాయి నివాసం.
పద్య కవిత్వం అంటే యిష్టం.
ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాను.
మీ అభిప్రాయాలు తెలుప గలరుఇట్లు యన్. ప్రసాద్.

దత్తపది ఇడ్లీ; పూరీ; ఉప్మా; కాఫీ; అనే వాటితో ముంబై మారణ కాండను గజేంద్ర మోక్ష సన్నివేశానికి అన్వయిస్తూ పూరణ చేయవలసినదిగా నేను చేసిన మనవికి స్పందించి తన పూరణను పంపిన శ్రీ యన్. ప్రసాద్ గారికి ధన్యవాదములు తెలియ జేస్తున్నాను.
జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

4 comments:

కొత్త పాళీ చెప్పారు...

పద్యం ఏది మాస్టారూ?

అసంఖ్య చెప్పారు...

మాష్టారూ, ఆ పూరణ ఎక్కడా కనపడలేదండీ.

చతురంగబంధ కందం మీదగ్గర చూసి, ఒకటి ప్రయత్నించాను.
http://karvepaku.blogspot.com/2010/08/blog-post_25.html

దయ ఉంచి కొంచెం సరిచూడగలరా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ఆర్యా! స్వామిగారూ! ప్రసాద్ గారు పంపిన పద్యం డౌన్ లోడ్ చేస్తే అది రాలేదు. సరే సేవ్ చేసి పేష్ట్ చేస్తే సరిపోకపోతుందా అని పేష్ట్ చేసాను. మీ యొక్క అసంఖ్య యొక్క కామెంట్స్ చూసింతరువాత తెలిసింది.పేష్టు కాదది ఐనది వేష్టు గాని.అని.
సరే వెంటనే నేనే లిఖించాను.
గుర్తింప చేసినందుకు మీకు; అసంఖ్యకు ధన్యవాదములు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

బాగుంది చక్కని పూరణ " పిరమిడ్లీ " " పూరీకృతాయుష్కులై " " యుప్మానంబుగా " " కాఫీర్లగా " నెంచు చున్ " అని రసరమ్య మైన పూరణ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.