గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఆగస్టు 2010, శనివారం

చెట్టుకు నమస్కరించి అనుమతి కోరి పూలు కోసుకోవాలి.

పువ్వులను కోసేముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ కోయాలని పెద్దలు చెప్పరు.
శ్లోll
నమస్తే కుసుమా ధారే, నమస్తే కమలాలయే
పుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవాజ్ఞయా!

తే.గీ.ll
వందనము నీకు పుష్ప సౌభాగ్యధారి!
వృక్ష రాజమ! హరికి నే బ్రీతి తోడ
పూజ సేసెద పూలతో. పూలు కోయ
నానతిని వేడు చుంటి. నా కానతిమ్ము.
జైశ్రీరాం.
జైహింద్.
Print this post

4 comments:

కథా మంజరి చెప్పారు...

హరి పూజకు పూల కొరకు కనుక అనుమతిని వేడి మరీ పూలను కోయడం ( వాటి గొంతు నులమడం) కొంత వరకు నయం.
అలంకారార్ధం కోసేటప్పుడు కూడా పూలను అనుమతి అడిగి కోయడం దుర్మార్గం. దండం పెట్టి మరీ, గాడ్సే మహాత్ముని చంపినట్టు.
చక్కని టపా పెట్టారు. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

ఈ రోజు ఉదయం లేస్తూనె చక్కని దృశ్యం అంద మైన పూలబాలలు కను విందు చేస్తున్నాయి ఐతె " వృక్ష రాజమా " అని పొగుడుతూనె కోసు కోవడానికి అనుమతిని అడగడం " " గొంతు నులిమి తల్లికి బిడ్డ ను వేరు చేస్తున్నావా ? అన్నట్టు పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం ఘంట సాల వారి గళం లోంచి ఒక్కసారి మారు మ్రోగింది.తమ్ముడు ! హేట్సాఫ్

అజ్ఞాత చెప్పారు...

అనుమతి కోరడం బాగానే వుంది. శ్లోకం చెట్టుకెలా అర్థమవుతుంది, మొక్క అనుమతి ఇచ్చిందో లేదో మనకు ఎలా తెలుస్తుందంటారు?

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అజ్ఞాత గారూ!
శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పుష్ప విలా మీరు చదివే ఉంటా రనుకొంటాను.
ఆ మహాకవికి ఆ పుష్ప విలాపం వినబడగా లేనిది మన శ్లోకం చెట్టుకర్థమవడంలోను, అది దాని సమ్మతిని తెలియ జేయడంలోను విడ్డూరమేముందండీ! అది హృదయైక వేద్యము.హృదయస్తులకు అర్థమౌతుందని నా భావన.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.