గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఆగస్టు 2010, మంగళవారం

శ్రీ నేమాని రామ జోగి సన్యాసి రావు కవి ఏమంటున్నారో చూద్దామా?

మll
సుమనస్సేవ్యము; సాధు వాఙ్మయము;  సుశ్లోకంబు; సౌవర్ణ యు
క్తము; శ్రావ్యంబు; విశిష్ట భావ రస పౌష్కల్యంబునౌ యాంధ్ర భా
ష మహిన్ భాషల కెల్ల భూషణము నై సందీప్తమౌ తన్మహ
త్వము నాంధ్రామృత బ్లాగులో గనుచు మోదంబందుడీ ధీనిధుల్.
ఇట్లు
నేమాని రామ జోగి సన్యాసి రావు.
విశాఖ పట్టణము.
తే.24 - 8 - 2010.
పాఠకులారా! మనలను ప్రోత్సహిస్తున్న అవధాని సన్యాసిరావు కవి గారికి సహృదయత ప్రశంసనీయము.
వారికి హృదయ పూర్వక ధన్యవాదములు.
జై శ్రీరామ్.
జైహింద్. Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.